నేను మాట్లాడేది బూతులు కాదు.. సంస్కృతం
ఇప్పుడు శ్రీవిష్ణు మరో సినిమాతో ఆడియన్స్ ను అలరించడానికి రెడీ అయ్యాడు. ఆ సినిమా పేరు సింగిల్. కార్తీక్ రాజు దర్శకత్వం వహించిన ఈ సినిమా మే 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.
By: Tupaki Desk | 29 April 2025 1:51 PM ISTటాలీవుడ్ లో శ్రీవిష్ణు తనకంటూ స్పెషల్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. కెరీర్ స్టార్టింగ్ నుంచి భిన్న సినిమాలు చేస్తూ ఆడియన్స్ ను అలరిస్తూ వస్తున్న శ్రీవిష్ణు ఇప్పటివరకు సరదాగా సాగే సినిమాలు, క్యారెక్టర్లతో పాటూ కొన్ని ప్రయోగాలు కూడా చేసి ఆడియన్స్ లో తనకంటూ ఓ స్పెషల్ ఐడెంటిటీని దక్కించుకున్నాడు.
ఇప్పుడు శ్రీవిష్ణు మరో సినిమాతో ఆడియన్స్ ను అలరించడానికి రెడీ అయ్యాడు. ఆ సినిమా పేరు సింగిల్. కార్తీక్ రాజు దర్శకత్వం వహించిన ఈ సినిమా మే 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రమోషన్స్ లో భాగంగా చిత్ర యూనిట్ రీసెంట్ గా ట్రైలర్ ను లాంచ్ చేయగా, ట్రైలర్ లాంచ్ సందర్భంగా మీడియా ముందుకొచ్చిన శ్రీవిష్ణుని తన డైలాగుల్లో ఉండే డబుల్ మీనింగ్ డైలాగ్స్, బూతుల మీడియా గురించి ప్రశ్నించింది.
శ్రీవిష్ణు కొన్ని సీన్స్ లో డబుల్ మీనింగ్ డైలాగ్స్, బూతులను విచిత్రంగా మాట్లాడుతున్నాడనే విషయం సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిన విషయం తెలిసిందే. సామజవరగమన, స్వాగ్ సినిమాల్లో శ్రీవిష్ణు డైలాగ్స్ పై నెట్టింట బాగానే డిస్కషన్ జరిగింది. ఆయా సినిమాలు ఓటీటీలో వచ్చాక ఆ డైలాగ్స్ లోని అర్థాన్ని నెటిజన్లు పసిగట్టి ఇలాంటివి మాట్లాడటంలో శ్రీవిష్ణు చాలా నైపుణ్యుడని అన్నారు.
ఇప్పుడు శ్రీవిష్ణు కొత్త సినిమా సింగిల్ లో కూడా అతను అలానే మాట్లాడాడని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. డబుల్ మీనింగ్ డైలాగ్స్ గురించి మీడియా శ్రీవిష్ణుని అడగ్గా దానికి అతను తనదైన రీతిలో ఆన్సరిచ్చాడు. తన సినిమాల్లో ఎలాంటి డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉండవని, తాను మాట్లాడేది సంస్కృతమని, అది అర్థం చేసుకోలేక తాను డబుల్ మీనింగ్ డైలాగ్స్, బూతులు మాట్లాడుతున్నాను అని అనుకుంటున్నారని శ్రీవిష్ణు తెలిపాడు.
తన డైలాగ్స్ ను మామూలుగా కాకుండా, ఓటీటీలో వచ్చాక స్పీడు తగ్గించి చూస్తే అందరికీ అర్థమవుతాయని, అర్థం కాలేదని తానిప్పుడు అందరికీ సంస్కృతం నేర్పలేనని సరదాగా చెప్పాడు శ్రీవిష్ణు. గతంలో స్వాగ్ ఇంటర్వెల్ లో వచ్చే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను కూడా నెటిజన్లు ఇదే విధంగా బూతులున్నాయని అనగా, దానిపై డైరెక్టర్ హసిత్ గోలి క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే.