అందంగా లేనని రిజెక్ట్ చేశారు
అలా ఎన్నో అవమానాలను ఎదుర్కొని హీరోయిన్ అయిన వారిలో తెలుగమ్మాయి, అక్కినేని కోడలు శోభితా ధూళిపాల కూడా ఒకరు.
By: Tupaki Desk | 8 July 2025 3:00 PM ISTసినీ ఇండస్ట్రీ రంగుల ప్రపంచం. అయితే ఇండస్ట్రీ చూడ్డానికే బావుంటుంది. అందులో ఉండాలంటే ఎన్నో ఇబ్బందులు పడాలి. ఎన్నో సమస్యలను దాటుకుని ముందుకెళ్లాలి. అలా వెళ్లినా సక్సెస్ వస్తుందని గ్యారెంటీ లేదు. అందరికీ ఈ సమస్య కామన్. నటీమణులకు ఈ ఇబ్బందులు ఇంకాస్త ఎక్కువగా ఉంటాయి. స్టార్ హీరోయిన్ అవాలంటే ఎన్నో ఇబ్బందులు, పరిస్థితుల్ని దాటాల్సి ఉంటుంది.
అందులో భాగంగానే ఎంతోమంది కెరీర్ స్టార్టింగ్ లో చిన్న చిన్న పాత్రలు చేసి ఆ తర్వాత హీరోయిన్లుగా మారుతూ ఉంటారు. అలా ఎన్నో అవమానాలను ఎదుర్కొని హీరోయిన్ అయిన వారిలో తెలుగమ్మాయి, అక్కినేని కోడలు శోభితా ధూళిపాల కూడా ఒకరు. శోభితను ఒకప్పుడు అందంగా లేవని ఎంతోమంది అవమానించారట. కెరీర్ స్టార్టింగ్ లో శోభిత ఓ యాడ్ కోసం ఆడిషన్ ఇస్తే అందంగా లేవని అవమానించారట.
అందంగా, ఎట్రాక్టివ్ గా లేననే కారణంతో ఓ ప్రముఖ బ్రాండ్ తనను బ్యాక్ గ్రౌండ్ మోడల్ గా కూడా సెలెక్ట్ చేయలేదని శోభిత గుర్తు చేసుకున్నారు. అయితే అదే బ్రాండ్ కు మూడేళ్ల తర్వాత తాను బ్రాండ్ అంబాసిడర్ గా సైన్ చేశానని తెలిపారు. ప్రముఖ నటి ఐశ్వర్యా రాయ్ బచ్చన్ తో కూడా తాను ఓ యాడ్ చేశానని చెప్పిన శోభిత కెరీర్ స్టార్టింగ్ లో ఎన్నో ఇబ్బందులు పడిన వైనాన్ని తెలిపారు.
గతేడాది డిసెంబర్ లో అక్కినేని వారసుడు నాగ చైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న శోభితా ధూళిపాల ప్రస్తుతం పెళ్లి జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు. మరోవైపు తన యాక్టింగ్ కెరీర్ ను కూడా శోభిత కంటిన్యూ చేస్తున్నారు. చైతన్యను పెళ్లి చేసుకున్న తర్వాత శోభిత మరింత లైమ్ లైట్ లోకి వచ్చిన సంగతి తెలిసిందే. కాగా శోభిత తన కెరీర్ ను మోడల్ గా స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే.