Begin typing your search above and press return to search.

డే 2 డే 1కన్నా డబుల్ కిక్కు.. 'సింగిల్' సెన్సేషనల్ రన్!

ఫస్ట్ డే 4.15 కోట్లు వసూలు చేసిన సినిమా, రెండో రోజు ఒక్కటే 7.05 కోట్లు గ్రాస్‌ను రాబట్టడం నిజంగా ఆశ్చర్యకరం.

By:  Tupaki Desk   |   11 May 2025 1:39 PM IST
డే 2 డే 1కన్నా డబుల్ కిక్కు.. సింగిల్ సెన్సేషనల్ రన్!
X

శ్రీ విష్ణు ప్రధాన పాత్రలో వచ్చిన కామెడీ ఎంటర్‌టైనర్ ‘సింగిల్’ బాక్సాఫీస్‌ వద్ద ఓ మాస్ హవా చూపిస్తోంది. విడుదలైన రెండు రోజుల్లోనే ఈ సినిమా 11.20 కోట్లు గ్రాస్ వసూలు చేసి, కలెక్షన్ల పరంగా అద్భుతమైన జోరు కొనసాగిస్తోంది. ఈ మల్టీప్లెక్స్ హిట్‌ ఫెస్టివల్‌కు మారిన ‘సింగిల్’ ఇప్పుడిప్పుడే శ్రీ విష్ణు కెరీర్‌లో అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా నిలవబోతున్నట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఫస్ట్ డే 4.15 కోట్లు వసూలు చేసిన సినిమా, రెండో రోజు ఒక్కటే 7.05 కోట్లు గ్రాస్‌ను రాబట్టడం నిజంగా ఆశ్చర్యకరం. ముఖ్యంగా వీకెండ్ లో వసూళ్లు మరింత పెరగడం, బుక్‌మైషోలో ఒకే రోజులో 80వేల టిక్కెట్లు అమ్ముడవడం సినిమా పాజిటివ్ ట్రాక్‌లో ఉందని స్పష్టం చేస్తోంది. సిటీల్లోనే కాదు, టౌన్లలోనూ ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాకు మంచి ఆదరణ చూపిస్తున్నారు.

కార్తిక్ రాజు దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం క్లీనుగా ఉన్న కామెడీ, ఫ్రెష్ కథనంతో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. శ్రీ విష్ణు తన టైమింగ్‌తో మెప్పించగా, వెన్నెల కిషోర్‌తో కలిసి చేసే కామెడీ సీన్లు థియేటర్లలో రచ్చ చేస్తున్నాయి. ప్రత్యేకంగా యూత్ ప్రేక్షకులకు ఈ సినిమాకు కంటెంట్ మజా కలిపి మంచి ఎంటర్‌టైన్‌మెంట్ ప్యాకేజీగా నిలుస్తోంది.

ముఖ్యంగా అమెరికాలో ఈ సినిమా మార్కెట్‌ను కొల్లగొడుతోంది. ఇప్పటివరకే $300K మార్క్‌ను దాటి, వీకెండ్ ముగిసేలోగా అర్ధమిలియన్ దాటే అవకాశముంది. ఇప్పటివరకు శ్రీ విష్ణు సినిమాలన్నింటిలోను 'సింగిల్' అమెరికాలో బిగ్గెస్ట్ ఓపెనింగ్ అందుకున్న చిత్రంగా నిలిచింది. ఫ్యామిలీ ఆడియన్స్ నుంచే కాదు, యువతలోనూ సినిమా పాజిటివ్ వర్డ్ అఫ్ మౌత్ సొంతం చేసుకుంటోంది.

అల్లూ అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, కాల్యా ఫిలింస్ రూపొందించిన ఈ సినిమాకు మ్యూజిక్‌గా శ్రీచరణ్ పాకాల మరింత ఎనర్జీని అందించాడు. ఇప్పుడు ‘సింగిల్’ మూడో రోజు నుండి వర్కింగ్ డేస్ వరకూ అదే జోరును కొనసాగిస్తే, ఇది ఈ వేసవిలో బిగ్గెస్ట్ కామెడీ బ్లాక్ బస్టర్ అవడం ఖాయం.