సమ్మర్ కి పర్ఫెక్ట్ సినిమా ఇది..!
శ్రీవిష్ణు కామిక్ టైమింగ్ బాగుంటుంది.. అతనితో వెన్నెల కిషోర్ కాంబినేషన్ ఇంకా బాగుంటుందని అన్నారు అల్లు అరవింద్.
By: Tupaki Desk | 28 April 2025 8:38 PM ISTటాలీవుడ్ హీరోల్లో కంటెంట్ ఉన్న సినిమాలు చేస్తూ ప్రేక్షకుల నుంచి సూపర్ అనిపించుకుంటున్న హీరో శ్రీ విష్ణు. అతను లీడ్ రోల్ లో ఇవానా, కెతిక శర్మ హీరోయిన్స్ గా నటించిన సినిమా #సింగిల్. ఈ సినిమాను కార్తీక్ రాజు డైరెక్ట్ చేయగా గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో విద్య కొప్పినీడి, భాను ప్రతాప్, రియాజ్ చౌదరి ఈ సినిమా నిర్మించారు. మే 9న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ట్రైలర్ ని నేడు రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ కి నిర్మాత అల్లు అరవింద్ అటెండ్ అయ్యారు.
#సింగిల్ ట్రైలర్ ఇలా రిలీజ్ అయ్యిందో లేదో అలా ఆడియన్స్ కి నచ్చేసింది. శ్రీవిష్ణు మరోసారి ఫన్ ఫిల్డ్ ఎంటర్టైనర్ ఈసారి ఇద్దరు అమ్మాయిలతో కలిసి చేయబోతున్నాడు. ఈ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో నిర్మాత అల్లు అర్వింద్ మాట్లాడుతూ ఈ సినిమా కథ కార్తీక్ రాజు చెప్పినప్పుడే చాలా నవ్వుకున్నానని అన్నారు. ఇద్దరు గెంతులేసే అబ్బాయిలు.. ఇద్దరు అందమైన అమ్మాయిలు చేసే హంగామా బాగుంటుందని అన్నారు.
శ్రీవిష్ణు కామిక్ టైమింగ్ బాగుంటుంది.. అతనితో వెన్నెల కిషోర్ కాంబినేషన్ ఇంకా బాగుంటుందని అన్నారు అల్లు అరవింద్. ఇక ట్రైలర్ లో ఆడవాళ్లను కాక్రోచ్ తో పోల్చిన డైలాగ్ ఉంది. అటామిక్ బాంబ్ పేలినా కాక్రోచ్ కి ఏం కాదు. అంత బలంగా ఆడవాళ్లు ఉంటారని పాజిటివ్ గా వాడిన డైలాగ్ అది. దాన్ని ఎవరు తప్పుగా భావించవద్దు అని అన్నారు అల్లు అరవింద్.
ఈ క్రమంలోనే సమ్మర్ కి ఫ్యామిలీతో సినిమా చూద్దమనుకునే వాళ్లు ఉంటారు.. ఈ ఎండలకి ఎయిర్ కండీషన్స్ లో కాసేపు కూర్చుందాం అనుకునే వాళ్లు ఉంటారు. అందుకే ఈ సమ్మర్ కి బాగా సూటయ్యే సినిమా సింగిల్. మే 9న మీరు డెఫినెట్ గా సినిమా చూసి ఎంజాయ్ చేస్తారని అన్నారు అల్లు అరవింద్.
గీతా ఆర్ట్స్ నుంచి బన్నీ వాసు బయటకు వెళ్తున్నాడన్న వార్తపై కూడా స్పందించారు అల్లు అరవింద్. బన్నీ వాసు, విద్య ఇద్దరు గీతా ఆర్ట్స్ కి రెండు కళ్ళ లాంటి వారని అన్నారు. అల్లు అరవింద్ చెప్పారని కాదు కానీ సింగిల్ ట్రైలర్ చూస్తే శ్రీవిష్ణు మరో సూపర్ హిట్ కొట్టడం గ్యారెంటీ అనిపించేలా ఉంది. సమ్మర్ కి బెస్ట్ ఎంటర్టైనర్ గా నిలిచేందుకు #సింగిల్ వస్తుంది.