Begin typing your search above and press return to search.

శ్రీవిష్ణు, వెన్నెల కిషోర్ కాదు.. ఆమీర్ సల్మాన్..!

సింగిల్ సినిమా సక్సెస్ మీట్ లో పాల్గొన్న సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి మాట్లాడుతూ శ్రీవిష్ణు కామెడీ టైమింగ్ ని పొగిడారు.

By:  Tupaki Desk   |   16 May 2025 11:28 PM IST
శ్రీవిష్ణు, వెన్నెల కిషోర్ కాదు.. ఆమీర్ సల్మాన్..!
X

శ్రీ విష్ణు వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రలుగా కార్తీక్ రాజ్ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా సింగిల్. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో రూపొందించిన ఈ సినిమా లాస్ట్ వీక్ రిలీజై సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. సూపర్ హిట్ టాక్ తో అందుకు తగినట్టుగానే కలెక్షన్స్ తో సినిమా దూసుకెళ్తుంది. ఈ క్రమంలో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ ని ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్ కి మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గెస్ట్ గా వచ్చారు. ఆయనతో పాటు టాలీవుడ్ ప్రముఖ దర్శకులు కూడా ఈవెంట్ కి అటెండ్ అయ్యారు.

సింగిల్ సినిమా సక్సెస్ మీట్ లో పాల్గొన్న సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి మాట్లాడుతూ శ్రీవిష్ణు కామెడీ టైమింగ్ ని పొగిడారు. అతను తనకు మంచి స్నేహితుడని అతనితో వర్క్ చేయడానికి తాను ఎదురుచూస్తున్నా అని అన్నారు. అంతేకాదు సినిమాలో వెన్నెల కిశోర్ లుంగీ స్టెప్ చాలా ఎంజాయ్ చేశానని అన్నారు. ఈవెంట్ లో పాల్గొన్న డైరెక్టర్ వంశీ పైడిపల్లి మాట్లాడుతూ సింగిల్ సినిమాలో శ్రీవిష్ణు, వెన్నెల కిశోర్ లను చూస్తే అందాజ్ అప్నా అప్నా సినిమాలో సల్మాన్ అమీర్ ల కెమిస్ట్రీ గుర్తొచ్చిందని అన్నారు వంశీ పైడిపల్లి. విష్ణు ఆఫ్ స్క్రీన్ లో చాలా సైలెంట్ గా ఉంటాడు కానీ స్క్రీన్ మీద మాత్రం పులిలా విజృంభిస్తాడు.. ఇదే క్వాలిటీ తాను విజయ్ లో చూశానని అన్నారు వంశీ పైడిపల్లి.

సినిమా సక్సెస్ అయిన ఉత్సాహంలో అల్లు అరవింద్ శ్రీ విష్ణుతో మరో రెండు సినిమాలు చేస్తున్నట్టు ప్రకటించారు అల్లు అరవింద్. శ్రీవిష్ణు వర్క్ కి చాలా ఇంప్రెస్ అయ్యానని అన్నారు. కార్తీక్ రాజు ఈ సినిమాను చాలా బ్రిలియంట్ గా హ్యాండిల్ చేశాడని చెప్పారు అల్లు అరవింద్. అందుకే ఈ సినిమా మ్యాట్నీ షో నుంచి స్టాంగ్ గా మారిందని అన్నారు అల్లు అరవింద్.

ఈమధ్య చాలా మంది ఆడియన్స్ థియేటర్ కు రావట్లేదు. మంచి సినిమాలకు కూడా కలెక్షన్స్ రావట్లేదని అంటున్నారు. ఐతే సరైన సినిమా తీస్తే చూసేందుకు మేము సిద్ధమని ఆడియన్స్ సింగిల్ సినిమాతో మరోసారి ప్రూవ్ చేశారు. శ్రీవిష్ణుకి ఈ సినిమాతో మరో ఎనర్జిటిక్ హిట్ అందించారు ఆడియన్స్. శ్రీవిష్ణు తో సింగిల్ సినిమాలో ఇవానా, కెతిక శర్మలు హీరోయిన్స్ గా నటించారని తెలిసిందే.