Begin typing your search above and press return to search.

సిద్ధార్థ్ '3 BHK'.. ల్యాంగ్ గ్యాప్ తర్వాత హిట్ దక్కనుందా?

అయితే 3 BHK మూవీ సాలిడ్ టాక్ అందుకుంది. సినిమా బాగుందని సినీ ప్రియులు కామెంట్లు పెడుతున్నారు.

By:  Tupaki Desk   |   8 July 2025 10:32 PM IST
సిద్ధార్థ్ 3 BHK.. ల్యాంగ్ గ్యాప్ తర్వాత హిట్ దక్కనుందా?
X

సౌత్ స్టార్ హీరో సిద్ధార్థ్.. రీసెంట్ గా 3 BHK మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఎమోషనల్ డ్రామాగా శ్రీ గణేష్ దర్శకత్వం వహించిన ఆ సినిమాలో చైత్ర జే ఆచార్ హీరోయిన్ గా నటించారు. యంగ్ ప్రొడ్యూసర్ అరుణ్ విశ్వ నిర్మించిన ఆ మూవీలో సీనియర్ నటుడు శరత్ కుమార్ యాక్ట్ చేశారు.

దేవయాని, మీథా రఘనాథ్ సహా పలువురు నటీనటులు కీలక పాత్రల్లో నటించారు. జులై 4వ తేదీన గ్రాండ్‌ గా రిలీజ్ అయిన ఆ సినిమా.. తెలుగులో విడుదల చేసింది. ఒక త్రిబుల్ బెడ్ రూమ్ హౌస్ ను సొంతం చేసుకోవాలని టార్గెట్ పెట్టుకున్న ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ చుట్టూ సినిమా మొత్తం తిరుగుతుంది.

శరత్ కుమార్ భార్యగా దేవయాని, కొడుకుగా సిద్ధార్థ్ కనిపించారు. వారు సొంత ఇంటి కలను సాకారం చేసుకోవాలనుకుంటారు. అదే సమయంలో తండ్రి ఆలోచనలకు, ఆశయాలకు కొడుకు భిన్నంగా ఉంటారు. దీంతో శరత్ కూతురు జీవితం ఇబ్బందుల్లో పడుతుంది. మరి చివరకు సొంతింటి కలను సాకారా చేసుకున్నారా లేదా అన్నదే మూవీ.

అయితే 3 BHK మూవీ సాలిడ్ టాక్ అందుకుంది. సినిమా బాగుందని సినీ ప్రియులు కామెంట్లు పెడుతున్నారు. కుటుంబం భావోద్వేగాల చుట్టూ డైరెక్టర్ సినిమాను నడిపించిన తీరు బాగుందని కొనియాడుతున్నారు. సింపుల్ స్టోరీతో మెప్పించారని.. ఎలాంటి కాంప్లికేషన్ లేకుండా మూవీ తీసిన విధానం సూపర్ అని చెబుతున్నారు.

సినిమా స్లో సాగుతున్నప్పటికీ.. ఓవరాల్ గా మాత్రం మూవీ బాగుంటుందని కొనియాడుతున్నారు. తెలుగులో కూడా మంచి రెస్పాన్సే వస్తోంది. పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తున్న వేళ.. ఇలాంటి ఎమోషనల్ డ్రామా వచ్చి ఆకట్టుకుంటుందని చెబుతున్నారు. ఫ్యామిలీ ఆడియన్స్ ను థియేటర్స్ ను రప్పిస్తున్నట్లు తెలుస్తోంది.

అదే సమయంలో ఇప్పటి వరకు మూవీ రూ.6 కోట్లకుపైగా వసూలు చేసినట్లు తెలుస్తోంది. వీకెండ్ అయ్యాక కాస్త వసూళ్లు తగ్గినట్లు తెలుస్తోంది. కానీ ఇదే టైమ్ లో మేకర్స్ పోస్ట్ ప్రమోషన్స్ నిర్వహించాలి. అప్పుడు మళ్లీ పికప్ అయ్యి మంచి వసూళ్లు సాధించే అవకాశం ఉంది. సిద్ధార్థ్ కు కూడా లాంగ్ గ్యాప్ తర్వాత హిట్ దక్కే ఛాన్స్ ఉంది. మరేం జరుగుతుందో వేచి చూడాలి.