టాలీవుడ్ కి గుడ్ బై చెప్పినట్టేనా..?
కమల్ హాసన్ గారాల పట్టి శృతి హాసన్ టాలీవుడ్ కి దాదాపు గుడ్ బై చెప్పినట్టే అనిపిస్తుంది.
By: Ramesh Boddu | 12 Aug 2025 9:37 AM ISTకమల్ హాసన్ గారాల పట్టి శృతి హాసన్ టాలీవుడ్ కి దాదాపు గుడ్ బై చెప్పినట్టే అనిపిస్తుంది. ఆమె వ్యవహార శైలి చూస్తే అది నిజం అనేలా ఉంది. ఎందుకంటే అమ్మడు తెలుగులో సినిమాలు చేయాలన్న ఆసక్తి చూపించట్లేదు. ఒకటి అర సినిమాలు చేసినా వాటి మీద అంత ఆసక్తి చూపించట్లేదట. అడివి శేష్ తో డెకాయిట్ సినిమా ముందు శృతి హాసన్ తోనే చేయాలని అనుకున్నారు. ఆమెతో టీజర్ కూడా రిలీజ్ చేశారు. కానీ ఏమైందో ఏమో సడెన్ గా శృతి హాసన్ ప్లేస్ లో మృణాల్ ఠాకూర్ వచ్చింది.
కెరీర్ పీక్స్ లో ఉన్న టైంలో కూడా..
టాలీవుడ్ లో శృతికి వచ్చేదే అర కొర అవకాశాలు వాటిని కూడా అమ్మడు చేజార్చుకుంటుంది. దీని వెనక రీజన్స్ ఏమై ఉండొచ్చు అని ఆడియన్స్ డిస్కషన్ చేస్తున్నారు. ఇప్పుడే కాదు కెరీర్ పీక్స్ లో ఉన్న టైంలో కూడా శృతి హాసన్ తెలుగు దర్శక నిర్మాతలను కాస్త ఇబ్బంది పెట్టేదని టాక్ ఉంది. సినిమా కమిట్ అవ్వడం వరకు ఓకే ఆ తర్వాత అమ్మడు డేట్స్ విషయంలో ఇబ్బందులు పెడుతుందని ఇన్నర్ టాక్. అందుకే అంతకుముందు కూడా శృతి హాసన్ చేయాల్సిన కొన్ని సినిమాలు వేరే హీరోయిన్స్ ని పెట్టి చేశారు.
అడివి శేష్ డెకాయిట్ సినిమాలో శృతి హాసన్ ఉంటే బాగుండేదని అనుకున్నారు. కానీ ఆమెకు ఛాన్స్ లేదు. ఈ పరిస్థితులన్నీ చూస్తుంటే శృతి హాసన్ తెలుగు సినిమాలను దాదాపు దూరం పెట్టినట్టే ఉంది. ప్రభాస్ తో సలార్ లో నటించిన శృతి హాసన్ ఆ సినిమా సెకండ్ పార్ట్ లో కూడా నటించాల్సి ఉంది. అది ఎలాగు కమిట్ అయ్యింది కాబట్టి తప్పదు. కానీ ఇక మీదట తన పూర్తి ఫోకస్ అంతా కూడా కోలీవుడ్ మీదే పెట్టాలని చూస్తుంది అమ్మడు.
పవర్ స్టార్ తో చేసిన గబ్బర్ సింగ్..
శృతి హాసన్ పర్సనల్ గా కూడా లైఫ్ ని సూపర్ గా ఎంజాయ్ చేస్తుంది. ఏ విషయం గురించి పెద్దగా సీరియస్ గా తీసుకోదు అమ్మడు. ఐతే సౌత్ లో క్రేజీ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న శృతి హాసన్ కెరీర్ లో మొదటి హిట్ కొట్టింది మాత్రమే తెలుగు సినిమాతోనే. అది కూడా పవర్ స్టార్ తో చేసిన గబ్బర్ సింగ్ సినిమాతోనే ఆమె సూపర్ హిట్ అందుకున్నారు. అప్పటి నుంచి శృతి హాసన్ ఇక తిరిగి చూసుకోలేదు. ప్రజెంట్ శృతి హాసన్ సూపర్ స్టార్ర్ రజినీకాంత్ కూలీ సినిమాలో నటించింది.
మరో రెండు రోజుల్లో రిలీజ్ కాబోతున్న కూలీ సినిమాతో ప్రేక్షకులను అలరించనుంది శృతి హాసన్. ఈ మూవీ మీద శృతిహాసన్ చాలా హోప్స్ పెట్టుకుంది. మరి అమ్మడి పెట్టుకున్న ఈ హోప్స్ ఎంతవరకు నిజం అవుతానన్నది చూడాలి.