చెన్నై ఓడిందని బోరున ఏడ్చేసిన హీరోయిన్ శృతిహాసన్.. వైరల్ వీడియో
ఐపీఎల్ 2025 టోర్నమెంట్‌లో భాగంగా నిన్న రాత్రి చెన్నై సూపర్ కింగ్స్ (CSK) వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) మధ్య జరిగిన మ్యాచ్ క్రికెట్ అభిమానులను తీవ్ర ఉత్సాహపరిచింది.
By: Tupaki Desk | 26 April 2025 11:19 AM ISTఐపీఎల్ 2025 టోర్నమెంట్‌లో భాగంగా నిన్న రాత్రి చెన్నై సూపర్ కింగ్స్ (CSK) వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) మధ్య జరిగిన మ్యాచ్ క్రికెట్ అభిమానులను తీవ్ర ఉత్సాహపరిచింది. అయితే ఈ మ్యాచ్ ఫలితం చెన్నై అభిమానులకు నిరాశనే మిగిల్చింది. సొంత గడ్డపై చెన్నై జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఐదు వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. చెన్నై స్టేడియంలో చెన్నైపై హైదరాబాద్‌కు ఇదే తొలి విజయం కావడం గమనార్హం.
సొంత గడ్డపై తమ అభిమాన జట్టు ఓటమిని చెన్నై అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. చాలా మంది తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు వచ్చిన ప్రముఖ హీరోయిన్ శృతి హాసన్ కూడా చెన్నై ఓటమిని తట్టుకోలేకపోయారు.
హైదరాబాద్ గెలిచి, చెన్నై ఓడిపోగానే శృతి హాసన్ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఓటమి బాధతో ఆమె కళ్లు చెమర్చాయి. కన్నీళ్లను తుడుచుకుంటూనే, చెన్నై ప్లేయర్ల పోరాటాన్ని, వారి ఆటతీరును ఆమె ప్రశంసించారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
శృతి హాసన్ కన్నీళ్లు చూసిన క్రికెట్ అభిమానులు, చెన్నై సూపర్ కింగ్స్‌కు ఎంత మంది డై-హార్డ్ ఫ్యాన్స్ ఉన్నారో చెప్పడానికి ఇది నిదర్శనమని కామెంట్ చేస్తున్నారు. అభిమానులు తమ జట్టు ఓటమిని ఎంతగా హృదయానికి తీసుకుంటారో దీని ద్వారా అర్థమవుతోందని పేర్కొంటున్నారు.
కాగా, ఈ మ్యాచ్‌ను చూసేందుకు తమిళ సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు చెన్నై స్టేడియానికి వచ్చారు. హీరోయిన్ శృతి హాసన్‌తో పాటు, స్టార్ హీరో అజిత్ కుటుంబం, నటుడు శివ కార్తికేయన్ వంటి వారు కూడా ఈ మ్యాచ్‌ను తిలకించారు. వీరికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయినప్పటికీ, చెన్నై ఓటమి బాధతో శృతి హాసన్ కన్నీళ్లు పెట్టుకున్న వీడియో మాత్రం ప్రత్యేకంగా హైలైట్ అయింది. ఈ సంఘటన చెన్నై సూపర్ కింగ్స్ పట్ల అభిమానులకు ఉన్న బలమైన అనుబంధాన్ని మరోసారి చాటి చెప్పింది.