వీడియోలో దొరికిపోయిన సాహో బ్యూటీ
సాహో బ్యూటీ శ్రద్ధా కపూర్ కి సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. దాదాపు 10 కోట్ల మంది అనుచరులు తనను నిత్యం ఫాలో అవుతుంటారు.
By: Tupaki Desk | 7 July 2025 9:39 AM ISTసాహో బ్యూటీ శ్రద్ధా కపూర్ కి సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. దాదాపు 10 కోట్ల మంది అనుచరులు తనను నిత్యం ఫాలో అవుతుంటారు. తన అభిమానులను అలరించేందుకు శ్రద్ధా చాలా చిలిపి వేషాలు వేస్తుంది. అల్లరి కొంటె పనులతో నిండిన వీడియోలను షేర్ చేస్తుంటుంది. ఇప్పుడు అలాంటి ఒక వీడియో ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది.
ఈ వీడియోలో శ్రద్ధా అద్భుతమైన డ్యాన్సింగ్ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తోంది. అదే సమయంలో తన హావభావాల్లో బోలెడంత ఫన్ ని ప్రదర్శించింది. ఇది తన ఫాలోవర్స్ ని విపరీతంగా ఆకర్షిస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో వెబ్ లో ఒక ట్రెండ్‌ను సృష్టించింది. దీనికి శ్రద్ధా అద్భుతమైన క్యాప్షన్ ఇచ్చింది. ఈ వీడియోలో శ్రద్ధా డ్యాన్సులు మాత్రమే కాదు... ఇందులో ఒక సర్ ప్రైజింగ్ ఎలిమెంట్ కూడా బయటపడింది. నెటిజనులు ఈ వీడియోలో ఒక ప్రత్యేకమైన వ్యక్తిని గుర్తించారు. అతడు శ్రద్ధా కపూర్ ప్రియుడు రాహుల్ మోడీ. సహజంగానే రాహుల్ ఎక్కువగా తన చేతిలోని ఫోన్ లో తలదూర్చి కనిపిస్తాడు. నడిచేప్పుడు, కూచున్నప్పుడు, నిదురించేప్పుడు కూడా అతడి చేతిలో ఫోన్ ఉండాల్సిందే. ఇప్పుడు కూడా అతడు సోఫాలో కూచుని ఫోన్ చూస్తున్నాడు. ``ఆ వ్యక్తి అనుమానం లేకుండా రాహుల్ మోడీ`` అని అందరూ గుర్తించారు. దీనిని గమనించిన అభిమానులు కూడా చాలా ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. ఒక వ్యక్తి ``చివరి భాగంలో నేను ఎవరినో చూస్తున్నాను`` అని వ్యాఖ్యానించారు. మరొకరు ``కెమెరా మ్యాన్ ఇన్ మిర్రర్ కు ధన్యవాదాలు`` అని రాశారు.
ఒక షాడో మ్యాన్ తో తన సంబంధాన్ని ఇంతకుముందే శ్రద్ధా కపూర్ అధికారికంగా ధృవీకరించింది. అయితే అతడు రాహుల్ మోడీ అని మాత్రం ఇప్పటివరకూ ప్రకటించలేదు. ఆ ఇద్దరూ కలిసే డిన్నర్ లకు, లంచ్ డేట్ లకు వెళతారు. కానీ తమ మధ్య ఏం జరుగుతుందో చెప్పరు. ఈ జోడీ స్త్రీ ఫ్రాంఛైజీ కోసం కలిసి పని చేసారు. అదే సమయంలో ఇద్దరి మధ్యా ప్రేమ మొదలైంది. ప్రస్తుతం ఈ జోడీ సహజీవనంలో ఉన్నారని అర్థమవుతోంది. అయితే ఇది ఎంతవరకూ వెళుతుందో స్పష్ఠత లేదు.
శ్రద్ధా ఎక్కువగా తన స్నేహితులతో గడిపేందుకు ఆసక్తిగా ఉంటుంది. స్కూల్ స్నేహితులు, వారి కుటుంబాలతో కలిసి భోజనం చేయాలని ఆశపడతానని చెప్పింది. తనకు మానవ సంబంధాలు బాంధవ్యాలు చాలా ఇష్టమైనవి అని గతంలో వెల్లడించింది. వివాహ ప్రణాళికల గురించి చర్చిస్తూ సరైన వ్యక్తితో ఉండటం ముఖ్యమని అంది. ఎవరైనా వివాహం చేసుకోవాలనుకుంటే అది అద్భుతం.. వివాహం చేసుకోకూడదని భావించినా అది కూడా అద్భుతమేనని శ్రద్ధా అంది. దీనిని బట్టి శ్రద్ధా మైండ్ సెట్ ఎలా ట్యూన్ అయి ఉందో అర్థం చేసుకోవచ్చు.