శికర్ ధావన్ హీరో వేషాలు.. హీరోయిన్‌తో రొమాన్స్
వెయ్యర వేషం ఐలెస్సో.. పట్టర పట్టు ఐలెస్సో..! అన్నట్టుగా ఉంది శిఖర్ ధావన్ వాలకం. వదిలేస్తే హీరో అయ్యేట్టున్నాడు.
By: Tupaki Desk | 15 May 2025 6:21 PM ISTవెయ్యర వేషం ఐలెస్సో.. పట్టర పట్టు ఐలెస్సో..! అన్నట్టుగా ఉంది శిఖర్ ధావన్ వాలకం. వదిలేస్తే హీరో అయ్యేట్టున్నాడు. రంగుల ప్రపంచాన్ని ఏలడానికి ఇతడు వెనకాడేట్టు లేడు. ఎం.ఎస్.ధోని, యువరాజ్, శ్రీశాంత్ సాటి క్రికెట్ స్టార్లంతా మిస్సయ్యారు కానీ శిఖర్ ధావన్ వదిలిపెట్టేట్టు లేడు. సీన్ చూస్తుంటే హీరో అవ్వడం గ్యారెంటీ అనిపిస్తోంది.
గత కొంతకాలంగా ధావన్ వేషాలు చూస్తుంటే, అతడిలో హీరో అయ్యే లక్షణాలు స్పష్ఠంగా కనిపిస్తున్నాయని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ఇటీవలే శ్రీలంకన్ బ్యూటీ జాక్విలిన్ తో కలిసి ఉన్న ఫోటోలు అంతర్జాలంలో వైరల్ అయ్యాయి. ఈ జంట వీడియో గ్లింప్స్ వెబ్ ని వేడెక్కించింది. మరోసారి ధావన్- జాక్విలిన్ జంటగా నృత్యం చేస్తున్న వీడియో ఇంటర్నెట్‌ని షేక్ చేస్తోంది. ఈ వీడియోలో ధావన్ రకరకాల డిజైనర్ దుస్తుల్లో ప్రత్యక్షమయ్యాడు. భారీ ఎంబ్రాయిడరీ సహా బరువైన దుస్తులు ధరించి సినిమాటిగ్గా తనను తాను ఎలివేట్ చేసుకున్నాడు.
స్పష్ఠంగా గమనిస్తే ఈ వీడియో ఆద్యంతం అతడు హ్యాట్ ధరించి కౌబోయ్ ని తలపించాడు. ఒకే ఒక్క చోట బాల్డ్ హెడ్ ని కూడా చూపించాడు. అయితే బాల్డ్ ని కవర్ చేసేందుకు అతడు హెయిర్ ట్రీట్ మెంట్ చేయించుకున్నాడని కూడా అర్థమవుతోంది. క్రికెటర్లకు రంగుల ప్రపంచంతో కనెక్షన్ చాలా సాధారణమైన విషయం. కానీ ధావన్ మాత్రం దీనిని అడ్వాంటేజ్ తీసుకుంటున్నాడని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇటీవల భార్య నుంచి విడిపోయిన ధావన్ విదేశీ ప్రియురాలితో జోరుగా వీడియోలు తెరకెక్కించి వైరల్ చేస్తున్నాడు. అదే సమయంలో బాలీవుడ్ కథానాయికలతో కలిసి ప్రకటనలు, యాడ్ షూట్లలో చిల్ అవుతున్నాడు. జాకీతో ధావన్ వీడియో క్షణాల్లో వైరల్ గా మారింది.