మరింత ముదురుతున్న ప్రభాస్ వర్సెస్ షారుఖ్ వివాదం
సోషల్ మీడియా బాగా పెరిగినకారణంతో ఎప్పుడు ఏ విషయం ఎలా మారి, ఎటు దారి తీస్తుందో అర్థమవడం లేదు.
By: Sravani Lakshmi Srungarapu | 7 Nov 2025 2:00 AM ISTసోషల్ మీడియా బాగా పెరిగినకారణంతో ఎప్పుడు ఏ విషయం ఎలా మారి, ఎటు దారి తీస్తుందో అర్థమవడం లేదు. రీసెంట్ గా షారుఖ్ ఖాన్ చేస్తున్న తర్వాతి సినిమా టైటిల్ ను కింగ్ అని వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే షారుఖ్ మూవీ టైటిల్ అనౌన్స్ చేశారనే విషయాన్ని ఎంజాయ్ చేసే లోపే ఆన్‌లైన్ లో ఓ కొత్త వార్ స్టార్ట్ అయింది. ఫ్యాషన్ పోలికగా మొదలైన ఈ విషయం తర్వాత షారుఖ్, ప్రభాస్ ఫ్యాన్స్ మధ్య వివాదంగా మారింది.
షారుఖ్ ను ఇండియాస్ కింగ్ అన్న సిద్ధార్థ్ ఆనంద్
రీసెంట్ గా షారుఖ్ కు బర్త్ డే విషెస్ ను తెలియచేస్తూ డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ అతన్ని ఇండియాస్ కింగ్ అని ప్రస్తావిస్తూ, స్టార్లు కేవలం సూపర్ స్టార్ అని కాకుండా వేరే పేరు తెచ్చుకున్నప్పుడే వారిని కింగ్ అని పిలుస్తారని పోస్ట్ చేయగా, వెంటనే ప్రభాస్ ఫ్యాన్స్ సిద్ధార్థ్ ఆనంద్ చేసిన పోస్ట్ కు డాట్స్ ను కనెక్ట్ చేశారు. ఆల్రెడీ ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అని ప్రభాస్ ను సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ టీజర్ లో వ్యాఖ్యానించడంతో, సిద్ధార్థ్ ఆనంద్ ప్రభాస్ ను ఉద్దేశించే అన్నారని డార్లింగ్ ఫ్యాన్స్ భావించారు.
సోషల్ మీడియాలో ముదురుతున్న వివాదం
దీంతో షారుఖ్ ఖాన్ మరియు ప్రభాస్ ఫ్యాన్స్ మధ్య ఉద్రిక్తతలు బాగా పెరిగాయి. ఆ హీరోల ఫ్యాన్స్ ఇద్దరూ తమ తమ అభిమాన హీరోలను సమర్ధించుకోవడంలో భాగంగా మీమ్స్, ఎడిట్స్, ట్రోల్ వీడియోలను పోస్ట్ చేయడంతో ఈ వివాదం సోషల్ మీడియాను గందరగోళంగా మార్చేసింది. ఇదిలా ఉంటే ఈ విషయంలో ప్రభాస్ ఫ్యాన్స్ డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ ను నిందిస్తున్నారు.
సీన్స్ ను కాపీ చేశాడని సిద్ధార్థ్ పై ఆరోపణలు
సాహో సినిమాలోని కొన్ని యాక్షన్ సీన్స్ ను డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ కాపీ చేసి వాటిని పఠాన్ మూవీ లో వాడారని ఆరోపణలు చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. అటు షారుఖ్, ఇటు ప్రభాస్ ఫ్యాన్స్ ఇద్దరి మధ్య ఘర్షణ మరింత తీవ్రమైంది. చూస్తుంటే ఈ ఫ్యాన్ వార్ ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు.
