Begin typing your search above and press return to search.

ష‌ష్ఠిపూర్తి వ‌య‌సులో సూప‌ర్‌స్టార్ ఫాంట‌సీలు

మీరు ఫాంటసీ ప్రపంచం నుండి తిరిగి వచ్చినప్పుడు మీ జీవితానికి జీవం పోయండి.. అని ఖాన్ సుదీర్ఘంగా మాట్లాడారు.

By:  Tupaki Desk   |   16 May 2025 9:15 PM IST
ష‌ష్ఠిపూర్తి వ‌య‌సులో సూప‌ర్‌స్టార్ ఫాంట‌సీలు
X

''ఫాంటసీ కలల కంటే ఒక అడుగు ముందుంది. ఫాంటసీ స్వయంగా నృత్యం చేస్తుంది. కలలు అసంపూర్ణంగా ఉంటాయి.. ఫాంటసీ పూర్తవుతుంది'' అని అన్నారు సూప‌ర్ స్టార్ షారూఖ్ ఖాన్. జీవించడానికి దీన్ని వినండి మిత్రమా. ఫాంటసీ అవసరం. ఫాంటసీకి వయస్సు లేదు.. జీవిత దశ లేదు. ప్రతి వ్యక్తికి ఫాంటసీ హక్కు ఉంది. నాకు కూడా కొన్ని ఫాంటసీలు ఉన్నాయని ఖాన్ అన్నారు. తాజాగా షారూఖ్ ఖాన్ ఓ క‌మ‌ర్షియ‌ల్ ప్ర‌క‌ట‌న‌లో న‌టించారు. ఇందులో అత‌డు చెప్పిన ఫాంట‌సీ డైలాగ్స్ అంద‌రినీ ఆక‌ర్షిస్తున్నాయి.

ఎవ‌రికైనా సందేహం ఉంటే.. రోడ్డు మీద ట్రాఫిక్‌లో చిక్కుకున్నప్పుడు.. బాస్‌ల బారిన‌ చిక్కుకున్నప్పుడు, స్టడీ టేబుల్ వద్ద కూర్చుని... మేల్కొలుపు కోసం.. సంక్లిష్టమైన సంబంధాల తర్కంలో ఉన్నప్పుడు, మీరు ఫాంటసీ యాప్ OTPMని ఆర్డర్ చేస్తారు. రాకెట్‌తో ఆలోచనల గాలిపటాన్ని ఎగురవేస్తారు, ఫాంటసీలోకి వెళ్లి గ్రహాంతరవాసులతో పోరాడుతారు లేదా వేరే విశ్వంలో చిక్కుకుంటారు. హీరోగా ఉంటారు.. కొన్నిసార్లు విలన్‌గా ఉంటారు. చివరి బంతికి సిక్స్ కొట్టండి.. ప్ర‌త్య‌ర్థిని ఓడించండి. యువరాజును ముద్దు పెట్టుకోండి... మీ కప్పను ఇంటికి తీసుకురండి. కాదు, కాదు, కాదు, క్షమించండి, క్షమించండి. కప్పను ముద్దు పెట్టుకోండి.. మీ యువరాజును ఇంటికి తీసుకురండి. లేదా ఒక రొమాంటిక్ సినిమాలో ఎస్.ఆర్.కే అవ్వండి! అని క‌వితాత్మ‌కంగా చెప్పాడు 59 ఏళ్ల‌ షారూఖ్.

ఫాంట‌సీ నుంచి స్కిప్ అయ్యాక‌, మీ పెదవులపై చిరునవ్వులు కనిపిస్తాయి. మీరు ఫాంటసీ ప్రపంచం నుండి తిరిగి వచ్చినప్పుడు మీ జీవితానికి జీవం పోయండి.. అని ఖాన్ సుదీర్ఘంగా మాట్లాడారు. ఈ వీడియోని షారూఖ్ స్నేహితురాలు, కొరియోగ్రాఫ‌ర్ కం డైరెక్ట‌ర్ ప‌రాఖాన్ స్వ‌యంగా షేర్ చేయగా అది వైర‌ల్ గా మారింది. మొత్తానికి యువ‌త‌రంలో ఫాంట‌సీని మేల్కొలిపేందుకు షారూఖ్ చేస్తున్న ప్ర‌య‌త్నం అభినంద‌నీయం. అయితే ఈ ఫాంట‌సీలో పాజిటివ్ కోణంలో సాగితే మంచిది. నెగెటివిటీతో ఫాంట‌సీ చాలా ప్ర‌మాద‌క‌రం.