మహేష్‌కు సందీప్ వంగా ఘాటైన సందేశం!
ఈ సందర్భంలో సూపర్ స్టార్ మహేష్‌కి బర్త్ డే విషెస్ అన్ని మూలల నుంచి వెల్లువెత్తాయి. అయితే ఇందులో ఓ ఇద్దరు ప్రత్యేకమైన వ్యక్తులు చాలా స్పెషల్ గా శుభాకాంక్షలు చెప్పారు.
By: Sivaji Kontham | 12 Aug 2025 9:38 AM ISTసూపర్ స్టార్ మహేష్ కి ప్రపంచవ్యాప్తంగా ఉన్న అసాధారణ ఫాలోయింగ్ గురించి తెలిసిందే. అతడికి ఇరు తెలుగు రాష్ట్రాల్లో భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. దీంతో పాటే ఉత్తరాది బెల్ట్ లో అత్యధికంగా ఆరాధించే టాలీవుడ్ హీరోగా మహేష్ బాబు పేరు మార్మోగుతోంది. చాలాసార్లు బాలీవుడ్ బాలీవుడ్ అవకాశాలు వరించాయి. కానీ ఏనాడూ మహేష్ తెలుగు పరిశ్రమను వదిలి వెళ్లలేదు. అతడు పూర్తిగా తన తెలుగు అభిమానుల ఆకాంక్షలకు కట్టుబడి పని చేసాడు.
అయితే చాలా కాలానికి ఎస్.ఎస్.రాజమౌళి కారణంగా అతడు పాన్ ఇండియా వైపు ఆలోచించాడు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న గ్లోబ్ టోటర్ (ఎస్.ఎస్.ఎం.బి29) సినిమా అతడి స్టార్ డమ్‌ని పీక్స్ కి చేర్చనుంది. మహేష్ ని తదుపరి 1000 కోట్ల క్లబ్ హీరోగా చూడగలమని అభిమానులు అంచనా వేస్తున్నారు. ఈ సమయంలో మహేష్ ఇటీవలే మరో సంవత్సరం పెద్దవాడయ్యాడు.
ఈ సందర్భంలో సూపర్ స్టార్ మహేష్‌కి బర్త్ డే విషెస్ అన్ని మూలల నుంచి వెల్లువెత్తాయి. అయితే ఇందులో ఓ ఇద్దరు ప్రత్యేకమైన వ్యక్తులు చాలా స్పెషల్ గా శుభాకాంక్షలు చెప్పారు. ఆ ఇద్దరిలో ఒకరు సందీప్ రెడ్డి వంగా కాగా, మరొకరు ఎస్.ఎస్.కార్తికేయ. సందీప్ వంగా ఇంతకుముందు మహేష్ తో సినిమా చేయాలనుకున్నారు. అతడు రణబీర్ కపూర్ కి యానిమల్ కథ వినిపించక ముందు, మహేష్ కి తన స్టోరి వినిపించాడు. కానీ వంగా వినిపించిన స్టోరి తనకు అస్సలు సూట్ కాదని మహేష్ భావించడంతో ప్రాజెక్ట్ ముందుకు వెళ్లలేదు. ఆ తర్వాత ఆ ఇద్దరూ వేర్వేరు దారుల్లో వెళ్లారు. అటుపై వచ్చిన `యానిమల్` పాన్ ఇండియాలో సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా సందీప్ వంగా రేంజును ఇంటర్నేషనల్ కి తీసుకెళ్లింది. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ తర్వాత యానిమల్ అతడి స్టార్‌డమ్‌ని మరో లెవల్ కి చేర్చింది. నేడు దేశంలో రాజమౌళి, అట్లీ తరహాలో ఎదురేలేని దర్శకులలో ఒకరిగా మారాడు సందీప్ రెడ్డి వంగా. అందుకే సందీప్ వంగా స్పెషల్ విషెస్ మహేష్ హృదయాన్ని టచ్ చేసాయని చెప్పాలి.
పుట్టినరోజు శుభాకాంక్షలు మహేష్ సార్ అంటూ సందీప్ వంగా తన వినమ్రతను చాటుకోవడమే గాక, మీరు నిజంగా ప్రతి సంవత్సరం అత్యంత ప్రకాశవంతంగా వికసించే సూపర్ స్టార్! మీరు వెండితెరపై ఆవిష్కరించే అదే మాయాజాలంతో మీ స్పెషల్ డే మెరిసిపోవాలి. సరిహద్దులను దాటి ప్రేక్షకులను ఆకర్షించే, రికార్డులను బద్దలు కొట్టే మరో సంవత్సరం ఇదిగో! అని మహేష్ విషెస్ తెలిపారు సందీప్ వంగా. ప్రస్తుతం మహేష్ నటిస్తున్న గ్లోబ్ ట్రోటర్ సరిహద్దులు దాటి రికార్డులు కొడుతుందనే నమ్మకాన్ని సందీప్ వంగా వ్యక్తం చేసారు.
మరో ట్వీట్ లో ఎస్.ఎస్.రాజమౌళి కుమారుడు ఎస్.ఎస్. కార్తికేయ ఒక అభిమాని WishSSMB.com ఐడియాను మెచ్చుకోవడం చర్చగా మారింది. #GlobeTrotter కి ప్రపంచం నలుమూలల నుండి ప్రేమ కురిసిందనడానికి ఇది ఉదాహరణ అంటూ ఒక అభిమాని షేర్ చేసిన ఆన్ లైన్ లింక్ http://WishSSMB.com ను కార్తికేయ తిరిగి రీపోస్ట్ చేసారు. ''ఇలాంటి అద్భుతమైన ఆలోచనతో వచ్చిన వారికి శుభాకాంక్షలు'' అంటూ ఆ అభిమానిని ప్రోత్సహించారు. దీన్ని మీ అందరితో పంచుకోవాలని అనిపించింది! అంటూ సోషల్ మీడియాలో మహేష్ అభిమాని షేర్ చేసిన బర్త్ డే విషెస్ లింక్ ని కార్తికేయ షేర్ చేసారు. మహేష్ పుట్టినరోజుకు ఈసారి ఆ ఇద్దరి నుంచి వచ్చిన విషెస్ చాలా ప్రత్యేకమైనవి అనడంలో ఎలాంటి సందేహం లేదు. కార్తికేయ ప్రస్తుతం మహేష్-రాజమౌళి సినిమాకి ప్రమోషన్స్ సహా ఇతర కీలక విభాగాల్లో సహకారం అందిస్తున్నారు. మహేష్ తో తదుపరి సినిమా చేసేందుకు సందీప్ వంగా చాలా ఆసక్తిగా ఉన్నారని కూడా అతడి స్పెషల్ విష్ తెలియజేస్తోంది. ప్రభాస్ తో స్పిరిట్ సినిమా పూర్తయిన తర్వాత అతడు రణబీర్‌తో యానిమల్ సీక్వెల్ చేస్తాడా? లేక మహేష్ కోసం ఒక కొత్త కథతో సీన్ లోకి దూసుకొస్తాడా? అన్నది వేచి చూడాలి.