Begin typing your search above and press return to search.

సంయుక్త టాలీవుడ్ షిఫ్ట్..?

అఖండ 2 సెప్టెంబర్ 25న రిలీజ్ అంటున్నారు. ఆ తర్వాత నిఖిల్, శర్వానంద్ సినిమాలు రిలీజ్ ఎప్పుడన్నది క్లారిటీ లేదు.

By:  Ramesh Boddu   |   14 Aug 2025 9:26 AM IST
సంయుక్త టాలీవుడ్ షిఫ్ట్..?
X

మలయాళ భామ సంయుక్త టాలీవుడ్ కి షిఫ్ట్ అయినట్టు ఉంది. మలయాళ సినిమాలతో పాపులర్ అయిన ఈ అమ్మడు సౌత్ సినిమాల్లో రాణిస్తూ వచ్చింది. ఐతే తెలుగులో మాత్రం భీమ్లా నాయక్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమాలో రానా వైఫ్ రోల్ చేసి మెప్పించింది సంయుక్త. అక్కడ నుంచి అమ్మడికి మంచి ఛాన్స్ లు వస్తున్నాయి. కెరీర్ లో హిట్లు ఫ్లాపులు ఇలా అన్నీ ఎక్స్ పీరియన్స్ చేస్తుంది సంయుక్త.

తెలుగులో 3 సినిమాల్ సంయుక్త..

ఐతే ప్రస్తుతం అమ్మడు మలయాళంలో కన్నా తెలుగులోనే బిజీ హీరోయిన్ అయ్యింది. ప్రెజంట్ అమ్మడు తెలుగులో 3 సినిమాల్లో నటిస్తుంది. అందులో ఒకటి బాలకృష్ణతో చేస్తున్న అఖండ 2, ఆ తర్వాత శర్వానంద్ తో నారి నారి నడుమ మురారి చేస్తుంది. ఈ రెండిటితో పాటు నిఖిల్ తో స్వయంభు సినిమా లైన్ లో ఉంది. స్వయంభు సినిమాలో సంయుక్త కూడా హార్స్ రైడింగ్ నేర్చుకుని మరీ సినిమాలో నటిస్తుంది.

ఈ 3 సినిమాల్లో ఏ ఒక్కటి క్లిక్ అయినా కూడా సంయుక్త మళ్లీ తెలుగులో బిజీగా మారే ఛాన్స్ ఉంది. సినిమాలే కాదు ఈమధ్య తెలుగు ఈవెంట్స్ లో కూడా సంయుక్త తరచు కనిపిస్తుంది. ఆమెను పిలవాలే కానీ కంపల్సరీగా ఎలాంట్ ఈవెంట్ కైనా వస్తుంది. అంతేకాదు ఐపీఎల్ లో మన సన్ రైజర్స్ తరపున ఆమె మ్యాచ్ లను కూడా వీక్షించింది. సో తెలుగు సినిమాలపై మాత్రమే కాదు తెలుగు ఆడియన్స్ మీద సంయుక్త ప్రేమ ప్రేక్షకులను మెప్పిస్తుంది.

తెలుగు ఆడియన్స్ అంతగా నచ్చారు కాబట్టే..

అఖండ 2 సెప్టెంబర్ 25న రిలీజ్ అంటున్నారు. ఆ తర్వాత నిఖిల్, శర్వానంద్ సినిమాలు రిలీజ్ ఎప్పుడన్నది క్లారిటీ లేదు. సంయుక్తకి హిట్లు పడితే మాత్రం టాలీవుడ్ లోనే తిష్ట వేసుకుని కూర్చునేలా ఉంది. తెలుగు ఆడియన్స్ అంతగా నచ్చారు కాబట్టే ఆమె ఇక్కడే సెటిల్ అయిపోవాలని చూస్తుంది సంయుక్త. టాలెంటెడ్ హీరోయిన్ అయిన సంయుక్త వచ్చిన ప్రతి అవకాశాన్ని వదలట్లేదు. బాలయ్య లాంటి సీనియర్ హీరోతో నటిస్తే కెరీర్ రిస్క్ లో పడుతుంది అన్న ఆలోచన కూడా అమ్మడికి లేదు.

ఇక నిఖిల్ స్వయంభు భారీ రేంజ్ లో తెరకెక్కుతుంది. ఇక శర్వానంద్ నారి నారి నడుమ మురారి సినిమాపై కూడా టీజర్ తోనే అంచనాలు పెంచారు. మరి ఈ సినిమాలతో సంయుక్త ఏ రేంజ్ సక్సెస్ అందుకుంటుందో చూడాలి. ఈమధ్యనే చిరంజీవి అతిథిగా వచ్చి చేసిన మెగా బ్లడ్ డొనేషన్ ఈవెంట్ లో కూడా సంయుక్త పాల్గొన్నది. తెలుగు ఆడియన్స్ కి మరింత దగ్గర కావాలని అమ్మడు ఆలోచిస్తుంది.