సమీరా రెడ్డిని వెంటాడిన ఆ భయాలేంటి?
తనకున్న భయాలన్నింటినీ పోగొట్టి, తనను తిరిగి హెల్తీగా చేయడంలో యోగా ఎంతగానో ఉపయోగపడిందని సమీరా రెడ్డి ఈ సందర్భంగా వెల్లడించింది.
By: Tupaki Desk | 22 Jun 2025 7:00 PM ISTసమీరా రెడ్డి గురించి కొత్తగా పరిచయం చేయనక్కర్లేదు. ఒకప్పుడు సినిమాల్లో హీరోయిన్ గా నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సమీరా, ఇప్పుడు సినిమాల్లో నటించకపోయినా సోషల్ మీడియా ద్వారా తన అభిమానులకు చేరువలోనే ఉంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన అప్డేట్స్ ను షేర్ చేసే సమీరా తాజాగా అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది.
తనకున్న భయాలన్నింటినీ పోగొట్టి, తనను తిరిగి హెల్తీగా చేయడంలో యోగా ఎంతగానో ఉపయోగపడిందని సమీరా రెడ్డి ఈ సందర్భంగా వెల్లడించింది. యోగా తన లైఫ్ లో ఓ బలమైన శక్తిగా ఎలా మారిందో, తన భయాలను ఎదుర్కోవడానికి, తన భావోద్వేగాలను స్వీకరించి, ప్రతీరోజూ అంతర్గత శాంతిని ఎలా కనుగొనాలో యోగా తనకు నేర్పిందని చెప్పింది.
జీవితంలో ఛాలెంజెస్ నుంచి బలం, శాంతి, బ్యాలెన్స్ ను ఎలా పొందాలో తెలుసుకోవడానికి యోగా తనకు చాలా ఉపయోగపడిందని తెలుపుతూ యోగా తన జీవితాన్ని ఎంతగానో మార్చిందని, తాను యోగా చేస్తున్న వీడియోను పోస్ట్ చేసింది సమీరా రెడ్డి. యోగా తనకు ఆశ, బలాన్ని ఇస్తుందని, తనతో తాను తప్ప ఎవరితోనూ మాట్లాడలేని సిట్యుయేషన్స్ లో కూడా నువ్వు నా మాట విని, నాకు సమాధానాలిస్తావని యోగా గొప్పతనాన్ని చెప్పడంతో పాటూ, తన జీవితంలో యోగా ఎంత కీలక పాత్ర పోషించిందో వివరించింది. ఈ పోస్ట్ చూశాక సమీరా రెడ్డిని అంతగా వెంటాడిన భయాలేంటని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
ప్రస్తుతం సమీరా రెడ్డి తన ట్రాన్స్‌ఫర్మేషన్ జర్నీని సోషల్ మీడియాలో తన పోస్ట్ ల ద్వారా తెలియచేస్తోంది. రెగ్యులర్ గా వర్కవుట్ సెషన్స్ నుంచి వీడియోలను షేర్ చేస్తూ తన ఫిట్‌నెస్ రొటీన్ ను వివరిస్తోంది. ఇక ప్రొఫెషనల్ గా సమీరా రెడ్డి నుంచి ఆఖరిగా 2013లో వరదనాయక అనే సినిమా వచ్చింది. ఈ సినిమాకు అయ్యప్ప పి. శర్మ దర్శకత్వం వహించారు.