హీటెక్కించే లుక్స్ లో సామ్.. ఈ ఫొటోలు చూశారా?
ఇక లేటెస్ట్ గా, ఆమె పుట్టినరోజు సందర్భంగా 'ఫెమినా' మాగజైన్ విడుదల చేసిన మర్చ్ 2024 కవర్ స్టోరీస్ మరింత హైలైట్ అయ్యాయి.
By: Tupaki Desk | 28 April 2025 11:00 PM ISTసౌత్ సినిమా ప్రపంచంలో బ్యూటీఫుల్ హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని అందుకున్న టాప్ హీరోయిన్స్ లిస్టులో సమంత రూత్ ప్రభు ఒకరు. సినిమాల్లో తన నటనతోనే కాదు, వ్యక్తిత్వంతోనూ మిలియన్ల మంది అభిమానులను సంపాదించుకుంది. సమంత కెరీర్‌దిశలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నా, ఆమెకు ఉన్న ఫైట్ స్పిరిట్ వేరే లెవెల్ అని చెప్పవచ్చు. ఇక లేటెస్ట్ గా, ఆమె పుట్టినరోజు సందర్భంగా 'ఫెమినా' మాగజైన్ విడుదల చేసిన మర్చ్ 2024 కవర్ స్టోరీస్ మరింత హైలైట్ అయ్యాయి.
ఈ ఫోటో షూట్‌లో సమంత డిఫరెంట్ స్టైల్ తో ఆకట్టుకుంది. వైట్ లేస్ కాస్ట్యూమ్ నుంచి స్టైలిష్ మోడర్న్ అవతారాల వరకు ఆమె ప్రతీ ఫోటో ఒక కొత్త స్టిల్ లా అనిపిస్తోంది. ప్రత్యేకంగా బ్లాక్ క్రియేటివ్ డిజైన్ గౌన్‌లో సమంత అందాన్ని వర్ణించడానికి మాటలు చాలవు. ఆ డ్రెస్‌లో ఆమె సూపర్ కాన్ఫిడెన్స్‌తో పోజులు ఇవ్వడం చూసి ఫ్యాషన్ లవర్స్ మైమరచిపోయారు.
'ఫెమినా' కవర్ పేజీపై సమంతను చూసిన ప్రతి ఒక్కరూ బ్యూటీఫుల్ హీరోయిన్! అంటూ కామెంట్స్ చేస్తున్నారు. నిజంగానే, ఆమెలో ఉన్న దైర్యం, గ్లామర్, గ్రేస్ అన్నీ కలిపి ఒక రేర్ కాంబినేషన్. గోల్డెన్ కార్సెట్ లుక్‌లోనూ ఆమె మరింత స్టన్నింగ్‌గా కనిపించింది. ప్రతి డ్రెస్‌ని తనదైన స్టైలిష్ స్వాగ్‌తో క్యారీ చేయగల గుణం సమంతను ప్రత్యేకం చేస్తోంది.
సమంత ఫొటోలు అలా పోస్ట్ చేసిన వెంటనే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఫ్యాన్స్ ఆమె బ్యూటీ, ఫెయిర్ ఫైటింగ్ స్పిరిట్‌ను మళ్ళీ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇటీవలి కాలంలో ఆమె చేసిన కొన్ని రిఫ్లెక్టివ్ పోస్ట్‌లు కూడా ఆమె జీవితాన్ని ఎంత పాజిటివ్‌గా ముందుకు తీసుకెళ్లిందో చెప్పకనే చెబుతున్నాయి. మొత్తానికి సమంత ఫెమినా కవర్ ఫోటోలు మరోసారి నిరూపించాయి.. ఎన్ని అడ్డుకట్టలు వచ్చినా, నిజమైన అందం, స్ఫూర్తి ఎప్పుడూ వెలిగిపోతుంది. ఆమె తదుపరి ప్రాజెక్ట్స్‌పై కూడా ఇప్పుడు భారీ అంచనాలు నెలకొన్నాయి.