Begin typing your search above and press return to search.

సమంతకి టఫ్ ఫైట్.. ఇది ఊహించలేదుగా..!

సమంత.. తన సూపర్ హిట్ మేనియా కొనసాగించాలని శ్రీవిష్ణు ఇలా ఇద్దరు తమ సినిమాల మీద పూర్తి కాన్ఫిడెంట్ తో వస్తున్నారు.

By:  Tupaki Desk   |   29 April 2025 9:58 PM IST
సమంతకి టఫ్ ఫైట్.. ఇది ఊహించలేదుగా..!
X

సౌత్ స్టార్ హీరోయిన్ సమంత ఇప్పుడు కొత్తగా నిర్మాణ బాధ్యతలను మీద వేసుకుంది. సమంత సొంతంగా ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ అంటూ ఒక కొత్త బ్యానర్ స్థాపించింది. ఆ బ్యానర్ లో తొలి సినిమా శుభం అంటూ ఒక అటెంప్ట్ చేసింది. ప్రవీణ్ కండ్రేగుల డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో న్యూ ఏజ్ యంగ్ టాలెంటెడ్ యాక్టర్స్ అంతా నటించారు. మొదటి సినిమానే తన అభిరుచిని తెలియచేసేలా సమంత శుభం మూవీని చేస్తుంది.

ఈ సినిమాను మే 9న రిలీజ్ ఫిక్స్ చేశారు. సమ్మర్ లో ఆడియన్స్ కి మంచి ఫన్ ఫిల్డ్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చేందుకు శుభం వస్తుంది. ఐతే అదే మే 9న మరో సినిమా పోటీకి దిగుతుంది. శ్రీవిష్ణు హీరోగా వస్తున్న సింగిల్ సినిమా మే 9న రిలీజ్ అవుతుంది. ఆ సినిమా ట్రైలర్ కూడా రీసెంట్ గా రిలీజైంది. తన ప్రతి సినిమా డిఫరెంట్ కంటెంట్ తో తీస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న శ్రీవిష్ణు సింగిల్ తో మరో సూపర్ ఎంటర్టైనర్ తో వస్తున్నాడు.

ఈ సినిమాను కార్తీక్ రాజు డైరెక్ట్ చేశారు. సినిమా ట్రైలర్ చాలా ఎంగేజింగ్ గా ఉంది. చూస్తుంటే సమంత శుభం కి గట్టి పోటీ ఇచ్చేలా శ్రీవిష్ణు సింగిల్ సినిమా కనిపిస్తుంది. ఐతే ఈ రెండు సినిమాలు కామెడీ ప్రధానంగా వస్తున్నాయి. మాస్ యాక్షన్ అంశాలు నచ్చే వాళ్ల సంగతి ఏమో కానీ రెండు సినిమాలు ప్రేక్షకులను మెప్పించేలా కంటెంట్ తోనే వస్తున్నాయని అర్థమవుతుంది.

మే 9న వచ్చి సెన్సేషనల్ రికార్డులు కొట్టిన సినిమాలు ఉన్నాయి. ఐతే ఈ రెండు సినిమాలకు ఆ రేంజ్ ఉంటుందా లేదా అన్నది పక్కన పెడితే నిర్మాతగా తొలి ప్రయత్నం సక్సెస్ చేసుకోవాలనే తపనలో సమంత.. తన సూపర్ హిట్ మేనియా కొనసాగించాలని శ్రీవిష్ణు ఇలా ఇద్దరు తమ సినిమాల మీద పూర్తి కాన్ఫిడెంట్ తో వస్తున్నారు. సమంత శుభం సినిమాకు ట్రైలర్ తో మంచి ప్రశంసలు వచ్చాయి. సమంత కూడా అందులో నటిస్తుంది కాబట్టి తప్పకుండా సంథింగ్ స్పెషల్ గా ఉంటుందనిపిస్తుంది. మరి ఈ ఫైట్ లో రెండు సినిమాలు ప్రేక్షకుల ఆమోదం పొందుతాయా లేదా అన్నది చూడాలి. సమంత శుభం, శ్రీవిష్ణు సింగిల్ ఈ SS వర్సెస్ SS ఫైట్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండనుంది.