Begin typing your search above and press return to search.

సమంత.. 'శుభం'తో శుభమేనా?

వర్ధమాన నటులతో సినిమా బండి ఫేమ్‌ ప్రవీణ్‌ కండ్రేగుల తెరకెక్కించిన ఆ మూవీని తక్కువ బడ్జెట్ తోనే నిర్మించారు సామ్.

By:  Tupaki Desk   |   12 May 2025 7:15 PM IST
Samantha  Shubham A Promising Start to Her Producer Journey
X

స్టార్ హీరోయిన్ సమంత.. ఇప్పుడు నిర్మాతగా మారిన విషయం తెలిసిందే. ఓవైపు పలు ప్రాజెక్టుల్లో యాక్ట్ చేస్తూనే.. ప్రొడ్యూసర్ గా కెరీర్ లో మరో మెట్టెక్కారు. తన సొంత బ్యానర్ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ పై కామెడీ హారర్ మూవీ శుభం రూపొందించారు. రీసెంట్ గా ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

వర్ధమాన నటులతో సినిమా బండి ఫేమ్‌ ప్రవీణ్‌ కండ్రేగుల తెరకెక్కించిన ఆ మూవీని తక్కువ బడ్జెట్ తోనే నిర్మించారు సామ్. అంతే కూడా ఓ క్యామియో రోల్ లో నటించారు. నిర్మాతగా ఎవరిని సాయం అడగాలని అనుకోలేదని, అందుకే తానే స్పెషల్ రోల్ లో యాక్ట్ చేసినట్లు రీసెంట్ గా సమంత తెలిపారు.

అదే సమయంలో సినిమా కోసం సామ్ బాగానే కష్టపడ్డారని చెప్పాలి. థియేటర్లలో విడుదలకు ముందు మంచి బజ్ క్రియేట్ చేశారు. వరుస ఈవెంట్స్ లో సందడి చేశారు. ఇంటర్వ్యూలు కూడా ఇచ్చి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. అలా చాలా చురుగ్గా, హుషారుగా శుభం మూవీని ప్రమోట్ చేశారని చెప్పాలి.

అయితే సినిమా రిలీజ్ అయ్యాక మూవీ లవర్స్ నుంచి మంచి రెస్పాన్సే వచ్చింది. కామెడీ హారర్ స్టోరీతో తెరకెక్కిన సినిమాలో యంగ్ యాక్టర్స్ నటించడంతో బెనిఫిట్ గా మారింది. కానీ బాక్సాఫీస్ వద్ద వసూళ్లు మాత్రం అనుకున్న స్థాయిలో రాలేదు. ఇప్పటి వరకు ఫస్ట్ వీకెండ్ లో వరల్డ్ వైడ్ గా దాదాపు రూ.5 కోట్లే వసూలు చేసింది.

వసూళ్ల విషయం కాకపోయినా.. ఓవరాల్ గా 'శుభం'తో సామ్ కు శుభమేనని చెప్పాలి. బాక్సాఫీస్ సంగతి పక్కన పెడితే ఆమెకు ప్రశంసలు వచ్చాయి. ఆ తర్వాత డబ్బుల పరంగా కూడా మూవీతో ప్రాఫిట్టేనని చెబుతున్నారు. ఎందుకంటే శాటిలైట్ హక్కుల కోసం రూ. 1.50 కోట్ల ఒప్పందం కుదుర్చుకున్నారని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.

ఆ తర్వాత ఓటీటీ హక్కులకు గాను రూ. 3 కోట్ల ఒప్పందం కుదుర్చుకోవడానికి సమంత చర్చలు జరుపుతున్నట్లు చెబుతున్నారు. కాబట్టి సామ్ కు శుభం మూవీతో శుభమే జరిగిందని అంటున్నారు. అలా కెరీర్ లో దూసుకుపోవాలని కోరుకుంటున్నారు. అటు నటిగా.. ఇటు నిర్మాతగా మరిన్ని సక్సెస్ లు అందుకోవాలని, అందనంత ఎత్తుకు ఎదగాలని ఆకాంక్షిస్తున్నారు.