Begin typing your search above and press return to search.

అభిమానులకు సమంత సలహా..!

ఒక అభిమాని సమంతని వెరైటీ ప్రశ్న అడిగాడు.. ఇంతకీ అతను ఏం అడిగాడు అంటే ప్రేమికులు టాటూ వేయించుకోవడం పై మీ అభిప్రాయం చెప్పండి అన్నాడు.

By:  Tupaki Desk   |   29 April 2025 9:00 PM IST
అభిమానులకు సమంత సలహా..!
X

తాము ఎంత బిజీగా ఉన్నా ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్ తో చిట్ చాట్ చేసే కొంతమంది హీరోయిన్స్ ఉంటారు. అలాంటి వారిలో మన సౌత్ స్టార్ హీరోయిన్ సమంత కూడా ఉంటుంది. నిన్న తన బర్త్ డే సందర్భంగా తనకు విషెష్ చెప్పిన అందరికీ తిరిగి రిప్లై ఇచ్చింది సమంత. ఓపికగా తన ఫ్రెండ్స్ పెట్టిన మెసేజ్ లు అన్నిటికీ ఆన్సర్ ఇచ్చింది. ఇక ఫ్యాన్స్ కి కూడా సమంత తన కృతజ్ఞతలు తెలిపింది. అంతేకాదు అభిమానులతో కొద్దిసేపు చిట్ చాట్ కూడా చేసింది. కొంతమంది ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు సమంత ఇంట్రెస్టింగ్ ఆన్సర్స్ ఇచ్చింది.

ఒక అభిమాని సమంతని వెరైటీ ప్రశ్న అడిగాడు.. ఇంతకీ అతను ఏం అడిగాడు అంటే ప్రేమికులు టాటూ వేయించుకోవడం పై మీ అభిప్రాయం చెప్పండి అన్నాడు.. దానికి సమాధానంగా సమంత ప్రేమించుకుంటే ప్రేమించుకోండి కానీ ఈ టాటూలు మాత్రం వద్దని అంటుంది. ఈ విషయంలో కచ్చితంగా జాగ్రత్త వహించండి అంటుంది సాం. సమంత చెప్పిన ఈ టాటూ ఫిలాసఫీని భూతద్దం పెట్టి వెతికేస్తున్నారు నెటిజన్లు.

సమంత ఇప్పుడు సింగిల్ గా ఉంటుంది. స్టార్ హీరోతో పెళ్లి విడాకులు ఆమె లైఫ్ మీద ఎఫెక్ట్ చూపించాయి. అందువల్ల సమంత అనారోగ్యపాలైంది. ఐతే సమంత ఇదివరకు టాటూల విషయంలో చాలా ఆసక్తి చూపించేది. అంతేకాదు తన చేతికి ఒక టాటూ కూడా స్పెషల్ ఎట్రాక్షన్ గా ఉండేది. సమంతకు టాటూలు అంటే ఇష్టం. కానీ ఇప్పుడు మాత్రం తన ఫ్యాన్స్ కి టాటూలు వేయించుకోకండి అంటుంది. అంటే ఎవరికోసమైతే మనం టాటూ వేయించుకుంటామో ఆ మనిషి మనతో లేకపోతే ఆ టాటూ చూసినప్పుడల్లా అతను గుర్తుకొస్తాడు.

సమంత కూడా అందుకే తన ఫ్యాన్స్ కి టాటూలు గట్రా వద్దు.. ఆ విషయంలో జాగ్రత్త వహించండి అని చెప్పుకొచ్చింది. ఐతే సమంత ఇచ్చిన ఆన్సర్ కి ఆమె ఎవరిని ఉద్దేశించి.. ఏ ఆలోచనతో అలా అన్నది అని రకరకాలుగా చర్చించుకుంటున్నారు. ఇక సమంత సినిమాల విషయానికి వస్తే తొలిసారిగా సమంత నిర్మాతగా మారి చేస్తున్న శుభం సినిమా మే 9న రిలీజ్ అవుతుంది. ప్రవీణ్ కండ్రేగుల డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో సమంత కూడా ఒక స్పెషల్ రోల్ చేసిందని తెలిసిందే.