Begin typing your search above and press return to search.

సమంత-రాజ్ రూమర్స్: మేనేజర్ క్లారిటీతో కొత్త ట్విస్ట్!

అయితే, ఆమె వ్యక్తిగత జీవితం మరోసారి చర్చనీయాంశంగా మారింది. బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో సమంత డేటింగ్‌లో ఉన్నట్లు కొన్ని నెలలుగా రూమర్స్ హల్‌చల్ చేస్తున్నాయి.

By:  Tupaki Desk   |   16 May 2025 11:01 AM IST
సమంత-రాజ్ రూమర్స్: మేనేజర్ క్లారిటీతో కొత్త ట్విస్ట్!
X

సమంత రూత్ ప్రభు, సినిమాలు ఉన్నా లేకపోయినా నిత్యం మీడియాలో హైలెట్ అవుతూనే ఉంది. టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న ఆమె నిర్మాతగా మారి శుభం సినిమాతో మంచి విజయం సాధించింది. అయితే, ఆమె వ్యక్తిగత జీవితం మరోసారి చర్చనీయాంశంగా మారింది. బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో సమంత డేటింగ్‌లో ఉన్నట్లు కొన్ని నెలలుగా రూమర్స్ హల్‌చల్ చేస్తున్నాయి.

‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’, ‘సిటాడెల్: హనీ బనీ’ సిరీస్‌లలో రాజ్‌తో కలిసి పనిచేసిన సమంత, ఆయనతో సన్నిహితంగా ఉన్నట్లు సోషల్ మీడియాలో చర్చలు నడుస్తున్నాయి. ఇటీవల సమంత తన ఇన్‌స్టాగ్రామ్‌లో ‘శుభం’ సినిమా సక్సెస్‌ను సెలబ్రేట్ చేస్తూ కొన్ని ఫోటోలు షేర్ చేసింది. ఈ ఫోటోల్లో ఒకటి రాజ్ నిడిమోరుతో సమంత సన్నిహితంగా ఉన్న చిత్రం, ఫ్లైట్‌లో ఆమె ఆయన భుజంపై తల వాల్చిన ఫోటో వైరల్ అయింది.

ఈ ఫోటోలు నెటిజన్లలో డేటింగ్ రూమర్స్‌ను మరింత రెచ్చగొట్టాయి. “సమంత, రాజ్ డేటింగ్‌లో ఉన్నారు, కలిసి జీవించేందుకు ఇల్లు కూడా వెతుకుతున్నారు” అని సోషల్ మీడియాలో చర్చలు జోరుగా సాగాయి. సమంత, రాజ్ నిడిమోరు గతంలో తిరుపతి ఆలయంలో కలిసి కనిపించారు, అప్పటి నుంచి వీరి రిలేషన్‌షిప్ గురించి ఊహాగానాలు ఊపందుకున్నాయి.

అయితే, ఈ డేటింగ్ రూమర్స్‌పై సమంత మేనేజర్ స్పందించి క్లారిటీ ఇచ్చారు. ఈ వార్తలన్నీ కేవలం రూమర్స్ మాత్రమే, సమంత, రాజ్ డేటింగ్‌లో ఉన్నారని, కలిసి జీవించేందుకు ఇల్లు వెతుకుతున్నారనే వార్తల్లో ఎలాంటి నిజం లేదు.. అని ఆయన స్పష్టం చేశారు. ఈ క్లారిఫికేషన్ రూమర్స్‌కు చెక్ పెట్టినప్పటికీ, నెటిజన్లలో చర్చలు మాత్రం ఆగలేదు.

రాజ్ నిడిమోరు గతంలో శ్యామలి డే అనే అసిస్టెంట్ డైరెక్టర్‌ను 2015లో వివాహం చేసుకున్నాడు, వీరు 2022లో విడాకులు తీసుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో శ్యామలి డే కూడా ఇటీవల ఓ క్రిప్టిక్ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ షేర్ చేసింది, ఇది సమంత-రాజ్ రూమర్స్‌కు సంబంధించినదని నెటిజన్లు భావించారు. అయితే, ఈ పోస్ట్‌లో ఎవరి పేరును ప్రస్తావించకపోవడంతో ఈ విషయం అలా వివాదాస్పదంగా మారింది. మొత్తంగా, సమంత, రాజ్ నిడిమోరు డేటింగ్ రూమర్స్‌పై మేనేజర్ క్లారిటీ ఇచ్చినప్పటికీ, సోషల్ మీడియాలో చర్చలు ఆగేలా లేవు. మరి సామ్ మరేదైనా క్లారిటీ ఇస్తుందేమో చూడాలి.