శుభం ట్రైలర్ టాక్: సీరియల్స్‌పై సమంత కామెడీ ప్రయోగం
మొత్తానికి 2.50 నిమిషాల శుభం ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా ఉంటూ అందరినీ ఆకట్టుకుంది. ఆఖరిగా ట్రైలర్ ఎండింగ్ లో సమంత చేసిన క్యామియో కూడా అందరినీ ఎట్రాక్ట్ చేసింది.
By: Tupaki Desk | 27 April 2025 11:28 AM ISTటాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత నిర్మాతగా మారి చేస్తోన్న మొదటి సినిమా శుభం. ఇప్పటికే టీజర్ తో మంచి వినోదాన్ని అందించి ఆడియన్స్ ను ఆకట్టుకున్న ఈ కామెడీ హర్రర్ అందరితో నవ్వుల్ని పూయించింది. ఇప్పుడు తాజాగా శుభం థియేట్రికల్ ట్రైలర్ రిలీజైంది. ఈ ట్రైలర్ ముందు చాలా సరదాగా మొదలైంది. భర్తలు, తమ భార్యలను ఎలా కంట్రోల్ లో పెట్టాలనే డిస్కషన్ తో ట్రైలర్ స్టార్ట్ అయింది.
ఆ తర్వాత సడెన్ గా కొత్తగా పెళ్లైన జంటకు ఫస్ట్ నైట్ సీన్ మొదలవుతుంది. ఆ సీన్ లో పెళ్లి కొడుకు తనను తాను ఆల్ఫా మగాడని చెప్పుకోవడానికి ట్రై చేస్తూ ఉండగా, పెళ్లి కూతురు అతని మాటలు సైలెంట్ గా వింటూ ఉంటుంది. ఆ తర్వాత ఆమె సీరియల్ పెట్టుకుని అందులో లీనమై, తనలోని భిన్నమైన కోణాన్ని బయట పెడుతుంది. దీంతో ఒక్కసారిగా అక్కడి పరిస్థితులన్నీ వింతగా మారిపోతాయి.
చూస్తుంటే ఆడవాళ్లు సీరియల్ చూడటం వ్యసనంగా మారితే ఎలా ఉంటుందో దానికి హార్రర్‌ను, కామెడీని మిక్స్ చేసి శుభం ను తెరకెక్కించినట్టు అనిపిస్తుంది. ఊరు మొత్తం ఇదే సమస్యను ఎదుర్కొంటే జరిగే పరిణామాలేంటి? ఆ పరిస్థితులను ఆల్ఫా మగాళ్లు ఎలా ఎదుర్కొని బయటపడ్డారనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే అంటూ మేకర్స్ ఊరిస్తున్నారు.
మొత్తానికి 2.50 నిమిషాల శుభం ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా ఉంటూ అందరినీ ఆకట్టుకుంది. ఆఖరిగా ట్రైలర్ ఎండింగ్ లో సమంత చేసిన క్యామియో కూడా అందరినీ ఎట్రాక్ట్ చేసింది. మే 9న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాతో ఆడియన్స్ ను థ్రిల్ చేయాలని సమంత చూస్తోంది. ప్రవీణ్ కాండ్రేగుల దర్శకత్వం వహించిన ఈ సినిమాకు వసంత్ మారింగంటి కథను అందించాడు. టీజర్ తోనే మంచి అంచనాలను ఏర్పరచిన శుభం సినిమా ఇప్పుడు ట్రైలర్ తో వాటిని ఇంకాస్త పెంచింది. ట్రైలర్ తో హైప్ పెంచాలనే సమంత ప్లాన్ వర్కవుట్ అయినట్టే. ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమాతో సమంత నిర్మాతగా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.