Begin typing your search above and press return to search.

అలాంటి కథ.. అలాంటోడి కోసం సల్మాన్..!

మురుగదాస్ డైరెక్షన్ లో తెరకెక్కిన సికందర్ సినిమాపై సల్మాన్ ఖాన్ చాలా హోప్స్ పెట్టుకున్నాడు. కానీ సినిమా బాక్సాఫీస్ దగ్గర అసలేమాత్రం ప్రభావం చూపించలేదు.

By:  Tupaki Desk   |   29 April 2025 7:05 PM IST
అలాంటి కథ.. అలాంటోడి కోసం సల్మాన్..!
X

ఒకప్పుడు బాలీవుడ్ బాక్సాఫీస్ ని కలెక్షన్స్ తో షేక్ చేసిన కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఇప్పుడు సరైన సక్సెస్ లు లేక సతమతమవుతున్నాడు. సల్మాన్ సినిమా అంటే కనిపించే సందడి ఫ్యాన్స్ లో జోష్ వేరే లెవెల్ అనిపించేది. కానీ వరుస ఫ్లాపుల వల్ల ఆయన ఫ్యాన్స్ లో కూడా నిరాశ కొనసాగుతుంది. సల్మాన్ ఈమధ్య చేస్తున్న ఏ సినిమా కూడా ఆశించిన స్థాయి ఫలితాలు అందుకోవట్లేదు. రీసెంట్ గా వచ్చిన సికందర్ సినిమా కూడా వర్క్ అవుట్ కాలేదు.

మురుగదాస్ డైరెక్షన్ లో తెరకెక్కిన సికందర్ సినిమాపై సల్మాన్ ఖాన్ చాలా హోప్స్ పెట్టుకున్నాడు. కానీ సినిమా బాక్సాఫీస్ దగ్గర అసలేమాత్రం ప్రభావం చూపించలేదు. సికందర్ సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటించింది. ఈమధ్య రష్మిక ఉన్న సినిమాలన్నీ సూపర్ హిట్ అవుతున్నాయి. సికందర్ కి రష్మిక సెంటిమెంట్ అయినా సక్సెస్ చేస్తుందని అనుకోగా అది కాస్త రివర్స్ అయ్యింది.

ఐతే సికందర్ తర్వాత సల్మాన్ ఖాన్ అసలైతే సౌత్ డైరెక్టర్ అట్లీతో సినిమా చేయాలని అనుకున్నాడు. కానీ ఎందుకో ఆ కాంబో సినిమా క్యాన్సిల్ అయ్యింది. అట్లీ ఇప్పుడు పుష్ప హీరో అల్లు అర్జున్ తో సినిమా లాక్ చేసుకున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన అనౌన్స్ మెంట్ వీడియోనే సర్ ప్రైజ్ చేసింది. అట్లీ తో సల్మాన్ సినిమా ఎందుకు మిస్ అయ్యిందో కారణాలు తెలియాల్సి ఉంది.

ఐతే ప్రస్తుతం సల్మాన్ ఖాన్ తనకు హిట్ ఇచ్చే కథ కోసం వెతుకుతున్నాడట. అలానే సూపర్ హిట్ ఇచ్చే డైరెక్టర్ కోసం వెతుకుతున్నాడు. మొన్నటిదాకా షారుఖ్ ఖాన్ కూడా ఫ్లాపులతోనే కొనసాగాడు.. కానీ పఠాన్, జవాన్ లాంటి సినిమాలతో కంబ్యాక్ అయ్యాడు. ఇప్పుడు సల్మాన్ ఖాన్ కూడా తనకు హిట్ ఇచ్చే ప్రాజెక్ట్ కోసం సెర్చ్ చేస్తున్నాడు. అది ఎవరు ఏంటన్నది తెలుసుకోవాలని చూస్తున్నాడు. మరి సల్మాన్ ఖాన్ కోరినట్టుగా అతని కెరీర్ లో హిట్ జోష్ ఇచ్చే డైరెక్టర్ ఎవరవుతారన్నది చూడాలి.

ప్రస్తుతం బాలీవుడ్ స్టార్స్ చూపంతా కూడా సౌత్ డైరెక్టర్స్ మీదే ఉంది. ఒకవేళ సల్మాన్ తమిళ దర్శకుడు అట్లీతో సినిమా మిస్ అయ్యింది కాబట్టి మరో తమిళ దర్శకుడికి కానీ లేదా తెలుగు డైరెక్టర్ తో కానీ సినిమా చేస్తారేమో చూడాలి. తెలుగు దర్శకుడితో సల్మాన్ సినిమా చేస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని చెప్పొచ్చు.