నిమిషంలో 250 కి.మీ స్పీడ్.. సల్మాన్ బుల్లెట్ ప్రూఫ్ కార్
అయితే సల్మాన్ ఖాన్ గ్యారేజీలో ఇప్పటికే డజను పైగా ఖరీదైన కార్లు ఉన్నాయి. రేంజ్ రోవర్, మెర్సిడెస్-బెంజ్ జీఎల్ఎస్, టయోటా ల్యాండ్ క్రూయిజర్ వంటి అనేక SUVలు సహా లగ్జరీ హై ఎండ్ వాహనాలను అతడు కొనుగోలు చేసాడు.
By: Tupaki Desk | 24 Jun 2025 9:12 PM ISTబాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ని గ్యాంగ్ స్టర్ లారెన్స్ విష్ణోయ్ భయాలు నిత్యం వెంటాడుతున్నాయి. అతడి ఎట్నుంచి ఎటాక్ చేస్తాడో ఎవరికీ తెలియదు. అందుకే సల్మాన్ బ్యాక్ టు బ్యాక్ బుల్లెట్ ప్రూఫ్ కార్లను కొనుగోలు చేస్తున్నాడు. ఏడాదిలో కనీసం రెండు మూడు సార్లు కోట్లాది రూపాయల విలువ చేసే బుల్లెట్ ప్రూఫ్ కార్లను కొనుగోలు చేస్తుండడం చూస్తుంటే, అతడిలోని భయాలు అంతకంతకు ఎలా రెట్టింపవుతున్నాయో అర్థం చేసుకోవచ్చు.
బిష్ణోయ్ గ్యాంగ్ నుండి ఇటీవలి బెదిరింపుల నేపథ్యంలో సల్మాన్ హై అలెర్ట్ అయ్యాడు. అతడు తన సెక్యూరిటీని పెంచుకున్నాడు. ఇటీవల బాంద్రాలోని తన నివాసం గెలాక్సీ అపార్ట్‌మెంట్‌లో బుల్లెట్‌ప్రూఫ్ కిటికీలను ఏర్పాటు చేసుకున్నాడు. బాల్కనీలో బుల్లెట్ ప్రూఫ్ మిర్రర్స్ ని ఏర్పాటు చేసారు. అదే సమయంలో అతడు గల్ఫ్ నుంచి ఖరీదైన బుల్లెట్ ప్రూఫ్ కార్ ని దిగుమతి చేసుకోవడం హాట్ టాపిక్ అయింది.
ఇప్పుడు మరోసారి రూ. 3.40 కోట్ల విలువైన బుల్లెట్‌ప్రూఫ్ మెర్సిడెస్-మేబ్యాక్ GLS 600 ఎస్.యు.విని కొనుగోలు చేశాడు. ఇటీవల సల్మాన్ తన కొత్త SUVని నడుపుతూ కనిపించాడు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే సల్మాన్ కొత్త కార్ కొన్నాడా లేక కొన్ని నెలల క్రితం కొన్న కార్ ని అందుకున్నాడా? అనేదానిపై కొంత క్లారిటీ మిస్సయింది. వాహనం రిజిస్ట్రేషన్ తేదీ 2024 అని రాసి ఉంది. ఈ ప్రత్యేక మోడల్ మేబ్యాక్ GLS 600 మోడల్ 2021 కి రిపీట్ వెర్షన్. ఈ కార్ 9-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో పరుగులు పెడుతుంది. 4.0-లీటర్ V8 పెట్రోల్ ఇంజిన్‌తో హైఎనర్జీతో నడుస్తుంది. 550 హెచ్.పి 730 ఎన్.ఎం టార్క్‌ను కలిగి ఉంది. ఇది 4.9 సెకన్లలో 0-100 కి.మీ.ల వేగాన్ని అందుకుంటుంది. 250 కి.మీ.ల గరిష్ట వేగంతో పరుగులు పెడుతుంది.
అయితే సల్మాన్ ఖాన్ గ్యారేజీలో ఇప్పటికే డజను పైగా ఖరీదైన కార్లు ఉన్నాయి. రేంజ్ రోవర్, మెర్సిడెస్-బెంజ్ జీఎల్ఎస్, టయోటా ల్యాండ్ క్రూయిజర్ వంటి అనేక SUVలు సహా లగ్జరీ హై ఎండ్ వాహనాలను అతడు కొనుగోలు చేసాడు. ఆడి RS7 వంటి స్పోర్ట్స్ కార్ అతడికి ఉంది. ఇటీవల బుల్లెట్ ప్రూఫ్ నిస్సాన్ పెట్రోల్ కార్ ని కూడా కొనుగోలు చేసాడు.
కెరీర్ మ్యాటర్ కి వస్తే, సల్మాన్ భాయ్ సికందర్ ఫ్లాప్ అయ్యాక అతడు కెరీర్ ప్లానింగ్ లో చాలా జాగ్రత్తపడుతున్నాడు. తదుపరి గల్వాన్ లోయలో ఇండియా- పాక్ సైనికుల ముష్ఠియుద్ధం నేపథ్యంలో ఓ సినిమాని ప్లాన్ చేసాడు. గల్వాన్ అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారని సమాచారం. త్వరలో లడఖ్‌లో ఈ చిత్రం షూటింగ్‌ను ప్రారంభించాలని భావిస్తున్నారు.