సాయి పల్లవి బాలీవుడ్ డెబ్యూకి డేట్ ఫిక్స్
తన యాక్టింగ్ తో ప్రతీ ఒక్కరినీ మెప్పించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు హీరోయిన్ సాయి పల్లవి.
By: Tupaki Desk | 9 July 2025 12:00 AM ISTతన యాక్టింగ్ తో ప్రతీ ఒక్కరినీ మెప్పించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు హీరోయిన్ సాయి పల్లవి. సాయి పల్లవి ఒక పాత్రను ఒప్పుకున్నారంటే ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేసి మరీ నటిస్తారు. అందుకే ఇప్పటివరకు సాయి పల్లవి ఎప్పుడూ నటిగా ఫ్లాప్ అవలేదు. ఆమె నటించిన సినిమాలు ఫ్లాపైనా ఆ సినిమాల్లో సాయి పల్లవి యాక్టింగ్ మాత్రం అందరినీ ఆకట్టుకుంటూ ఉంటుంది.
ఆల్రెడీ సౌత్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న సాయి పల్లవి ఇప్పుడు బాలీవుడ్ లోకి కూడా ఎంట్రీ ఇస్తున్నారు. అందులో భాగంగానే సునీల్ పాండే దర్శకత్వం వహించిన ఏక్ దిన్ అనే రొమాంటిక్ డ్రామాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో ఆమిర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్ సరసన సాయి పల్లవి నటించనున్నారు. ఈ సినిమాతోనే సాయి పల్లవి బాలీవుడ్ డెబ్యూ చేస్తున్నారు.
అయితే ఇప్పుడు ఏక్ దిన్ కు సంబంధించిన రిలీజ్ డేట్ ను మేకర్స్ తాజాగా అనౌన్స్ చేశారు. నవంబర్ 7న ఏక్ దిన్ థియేటర్లలో రిలీజ్ కానుందని చిత్ర యూనిట్ అధికారికంగా తెలిపింది. ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు మన్సూర్ ఖాన్ కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. జునైద్ ఖాన్ గతంలో నటించిన మహారాజ్, లవ్ యాపా సినిమాలు అనుకున్న ఫలితాల్ని ఇవ్వకపోవడంతో ఈ సినిమాపైనే జునైద్ తన ఆశలన్నింటినీ పెట్టుకున్నారు.
ఈ సినిమాతో పాటూ సాయి పల్లవి బాలీవుడ్ లో మరో సినిమా కూడా చేస్తున్నారు. అదే రామాయణ. నితేష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రామాయణలో రణ్‌బీర్ కపూర్ రాముడిగా నటిస్తుండగా, సీతగా సాయి పల్లవి నటిస్తున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న రామాయణ రెండు భాగాలుగా రానుండగా మొదటి భాగం 2026 దీపావళికి, రెండో భాగం 2027 దీపావళికి రిలీజ్ కానున్నాయి.