'నాకంటూ హిస్టరీ ఉంది'.. రవితేజ 'మాస్ జాతర' టీజర్ చూశారా?
టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ ఇప్పుడు మాస్ జాతర మూవీతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.
By: M Prashanth | 11 Aug 2025 12:06 PM ISTటాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ ఇప్పుడు మాస్ జాతర మూవీతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. మనదే ఇదంతా అనే క్యాప్షన్ తో రూపుదిద్దుకుంటున్న ఆ సినిమా.. రవితేజ కెరీర్ లో 75వ చిత్రం కావడం విశేషం. యంగ్ బ్యూటీ శ్రీలీల.. బ్లాక్ బస్టర్ హిట్ ధమాకా తర్వాత మరోసారి రవితేజతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు.
భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమాను శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. వినాయక చవితి సందర్భంగా ఆగస్టు 27వ తేదీన సినిమాను రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే ఆ విషయాన్ని అనౌన్స్ చేసేశారు.
అయితే మేకర్స్.. సినిమా షూటింగ్ ను కొద్ది రోజుల క్రితం పూర్తి చేశారు. ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుతున్నారు. ఇప్పుడు ప్రమోషన్స్ లో భాగంగా టీజర్ ను సోమవారం ఉదయం రిలీజ్ చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిన మాస్ జాతర టీజర్.. అందరినీ ఆకట్టుకుని దూసుకుపోతోంది.
సినిమాలో రవితేజ పవర్ ఫుల్ రైల్వే పోలీస్ ఆఫీసర్ గా కనిపించనుండగా.. శ్రీలీల స్టూడెంట్ రోల్ లో సందడి చేయనున్నారు. అయితే ఇక్కడో కాలేజ్ స్టూడెంట్ని చంపేశాడు సార్ అంటూ టీజర్ స్టార్ట్ అయింది. అప్పుడు వాడి బ్యాక్ గ్రౌండ్ ఏంటి విలన్ అడగ్గా.. రవితేజ ఎంట్రీ ఇస్తారు. బ్యాక్ గ్రౌండ్ లో రైల్వే పోలీస్ అని వినిపిస్తుంది.
ఆయన డిపార్ట్మెంట్ తప్ప అన్ని డిపార్ట్మెంట్స్ లో వేలు పెడుతుంటారు అని రవితేజ కోసం చెబుతుంటారు. అప్పుడే శ్రీలీల ను పరిచయం చేయగా.. సైన్స్ అంటే ఇష్టమని రవితేజ చెబుతారు. ఇద్దరి మధ్య క్యూట్ రొమాంటిక్ సీన్స్ యాడ్ చేశారు మేకర్స్. మళ్లీ టీజర్ యాక్షన్ మోడ్ లోకి వెళ్లగా.. రవితేజ తన ఫైట్స్ తో అదరగొడతారు.
చివర్లో.. ట్విట్టర్లో ఒకడు మా హీరో టీజర్ బాలేదు అన్నాడు.. అడ్రస్ పెట్టు రాజేంద్రప్రసాద్ అనగా.. అడ్రస్ పెడితే ఏం చేస్తావ్.. స్విగ్గీలో పెట్టి ఆర్డర్ చేస్తావా అంటూ రవితేజ కామెడీ డైలాగ్ తో టీజర్ ఎండ్ అయింది. మొత్తానికి టీజర్ అయితే అదిరిపోయింది. మాస్ ప్రేక్షకులకు ఫుల్ మీల్స్ లా సినిమా ఉంటుందని క్లారిటీ ఇచ్చేసింది.
అయితే టీజర్ లో రవితేజ కామెడీ టైమింగ్, మాస్ యాటిట్యూడ్ ను చూపించిన విధానం సూపర్ అనే చెప్పాలి. రవితేజ స్వాగ్ ను బాగానే చూపించారు డైరెక్టర్. నాకంటూ హిస్టరీ ఉంది అంటూ మాస్ మహారాజా చెప్పిన డైలాగ్స్ అదిరిపోయాయి. భీమ్స్ సిసిరోలియో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మెప్పిస్తోంది. ఓవరాల్ గా టీజర్.. సినిమాపై అంచనాలు పెంచుతోంది.