రాక్షసన్ 2 రిజల్ట్ దాకా వెయిట్ చేస్తారా..?
డైరెక్టర్ రామ్ కుమార్ తోనే ఆ మూవీ సీక్వెల్ రాబోతుందని చెప్పారు. సో తమిళ్ లో రాక్షసన్ సీక్వెల్ అనగానే తెలుగు ఆడియన్స్ కూడా అది రీమేక్ చేస్తే బాగుంటుందని అంటున్నారు.
By: Tupaki Desk | 8 July 2025 8:15 AM ISTథ్రిల్లర్ సినిమాలను కూడా ఆడియన్స్ రిసీవ్ చేసుకుంటారని కొన్ని సినిమాల విజయాలు చూస్తే అర్ధమవుతుంది. థ్రిల్లర్ తో పాటుగా క్రైమ్ సినిమాలను చూసే ఆడియన్స్ సంఖ్య పెరుగుతుంది. ఐతే ఇండియన్ వెండితెర మీద చాలా క్రైం థ్రిల్లర్ సినిమాలు రాగా అందులో బెస్ట్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది రాశ్చసన్. విష్ణు విశాల్ లీడ్ రోల్ లో నటించిన ఈ సినిమాను రాం కుమార్ డైరెక్ట్ చేశాడు. 2018 లో రిలీజైన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.
ఇదే సినిమాను తెలుగులో బెల్లంకొండ శ్రీనివాస్ రీమేక్ చేసి సక్సెస్ అందుకున్నాడు. బెల్లంకొండ శ్రీనివాస్ కి మంచి కమర్షియల్ హిట్ ఇచ్చిన సినిమా రాక్షసన్. ఐతే రాక్షన్ సీక్వెల్ కోసం ఆడియన్స్ అడుగుతున్నా మాత్రుక మేకర్స్ ఏదైనా చేస్తే అప్పుడు చూద్దాం అనుకున్నాడు బెల్లంకొండ హీరో. ఐతే లేటెస్ట్ గా విష్ణు విశాల్ రాక్షసన్ 2 చేస్తున్నట్టుగా అనౌన్స్ చేశాడు.
డైరెక్టర్ రామ్ కుమార్ తోనే ఆ మూవీ సీక్వెల్ రాబోతుందని చెప్పారు. సో తమిళ్ లో రాక్షసన్ సీక్వెల్ అనగానే తెలుగు ఆడియన్స్ కూడా అది రీమేక్ చేస్తే బాగుంటుందని అంటున్నారు. ఐతే ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ మూడు సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈమధ్యనే ఆయన నటించిన భైరవం సినిమా వర్క్ అవుట్ కాలేదు. అయినా కూడా బెల్లంకొండ శ్రీనివాస్ కి లైన్ లో 3 క్రేజీ ప్రాజెక్ట్ లు ఉన్నాయి.
ప్రస్తుతం కిష్కిందపురి, హైందవ, టైసన్ నాయుడు సినిమాలు చేస్తున్నాడు బెల్లంకొండ శ్రీనివాస్. ఈ సినిమాలతో ఆడియన్స్ ని అలరించనున్నాడు శ్రీనివాస్. రాక్షసన్ 2 రీమేక్ విషయంలో బెల్లంకొండ శ్రీనివాస్ నిర్ణయం ఎలా ఉంటుందో కానీ ఈమధ్య కొన్ని సినిమాలు ఫస్ట్ మూవీ చూపించినంత ఇంపాక్ట్ సీక్వెల్స్ చూపించట్లేదు. అందుకే ఆ సినిమా రిలీజై సక్సెస్ అయ్యాక ఏమైనా రీమేక్ ప్రయత్నాలు చేస్తారేమో చూడాలి.
కెరీర్ పరంగా తనకున్న మాస్ స్టామినా తో బెల్లంకొండ శ్రీనివాస్ రకరకాల ప్రయత్నాలు చేశాడు. ఛత్రపతి హిందీ రీమేక్ చేసి అక్కడ ఆడియన్స్ ని అలరించాలని కోరుకున్న బెల్లంకొండ హీరోకి ఆ సినిమా రిజల్ట్ షాక్ ఇచ్చింది. ఐతే రాక్షసన్ సీక్వెల్ కథ అలా ఉంచితే రాబోతున్న ఈ సినిమాల్లో ఏది ఆయనకు మంచి సక్సెస్ అందిస్తుంది అన్నది చూడాలి.