రష్మిక నెంబర్-1 ర్యాంక్ అందుకున్నట్లే!
నటిగా ఆమె కెరీర్ గ్రాఫ్ ఎలా ఉంది? అన్నది చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్ లో సక్సస్ పుల్ గా కొనసా గుతూనే బాలీవుడ్ కి వెళ్లింది.
By: Tupaki Desk | 24 Jun 2025 6:00 PM ISTకొంత కాలంగా టాలీవుడ్ లో నెంబర్ వన్ ర్యాంక్ ఖాళీగా ఉన్న సంగతి తెలిసిందే. స్వీటీ అనుష్క సినిమా లు తగ్గించడంతో? ఆమె రేసులో లేకుండా పోయింది. అప్పటి నుంచి ఆ స్థానం ఖాళీగానే ఉంది. చాలా మంది భామలు వస్తున్నారు గానీ ఎవరూ ఆస్థానాన్ని భర్తీ చేయడం లేదు. సరైన సక్సస్ లేకపోవడం ...ఫామ్..ఫేమ్ కోల్పోవడంతో ఎవరికీ సాధ్యపడలేదు. మరి ఇప్పుడు ఆ స్థానానికి నేషనల్ క్రష్ రష్మికా మందన్నా అన్ని రకాల అర్హతలు సంపాదించిందా? అంటే అవుననే అనాలి.
నటిగా ఆమె కెరీర్ గ్రాఫ్ ఎలా ఉంది? అన్నది చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్ లో సక్సస్ పుల్ గా కొనసా గుతూనే బాలీవుడ్ కి వెళ్లింది. అక్కడా తిరుగులేని నాయికగా ఎదుగుతోంది. `యానిమల్`, `పుష్ప`, `ఛావా` లాంటి విజయాలు ఆమె స్థాయిని బాలీవుడ్ లో రెట్టింపు చేసాయి. స్టార్ హీరోలే ఆమె తో కలిసి నటించ డానికి ఆసక్తి చూపిస్తున్నారు. పారితోషికం పరంగానూ అమ్మడు హైలోనే ఉంది. తన డిమాండ్ ను ఎవరూ కాదనలే కపోతున్నారు.
డిమాండ్కు తగ్గ పనితనం రష్మికలో ఉంది కాబట్టే సాధ్యమవుతుంది. టాలీవుడ్ లోనూ ఇది కాదనలేని నిజం. ఇక రష్మిక నటనకు, చలాకీ తనానికి ఫ్యాన్స్ అవ్వడంలో సీనియర్ హీరోలు కూడా ఎక్కడా తగ్గడం లేదు. నటసింహ బాలయ్య నుంచి తొలి ప్రశంసం అందుకుంది. అటుపై కింగ్ నాగార్జున నాగ్ క్రష్ గా పేర్కొన్నారు. `కుబేర` సినిమాలో తానే పెద్ద స్టార్ అని నాగ్ అన్నారు. అలాగే మెగాస్టార్ చిరంజీవి కూడా రష్మిక విషయంలో ఎక్కడా తగ్గలేదు.
రష్మిక నేషనల్ క్రష్ కాదని ఇంటర్నేషనల్ క్రష్ అని కితాబిచ్చారు. రష్మికను తొలి సినిమా నుంచి చూస్తు న్నాను తాను నటిస్తున్న పాత్రలను చాలా క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తున్నట్లు తెలిపారు. సౌందర్యతో ఆమె నటన ను పోల్చారు. కళ్లతో నటించగల గొప్ప నటిగా కీర్తించారు. చిరంజీవే అంత పెద్ద మాట అన్నారంటే? టాలీవుడ్ లో రష్మిక స్థానం గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది.