గుర్తు పట్టలేని రేంజ్ లో మారిపోయిన హీరోయిన్
డర్టీకట్ 2025 కవర్ ఫోటోపై రష్మిక చాలా కొత్త గెటప్ లో కనిపించారు. ఇంకా చెప్పాలంటే ఈ గెటప్ లో ఆమె ఎవరో గుర్తుపట్టలేనంతగా ఉన్నారు.
By: Tupaki Desk | 8 July 2025 9:00 PM ISTనేషనల్ క్రష్ రష్మిక మందన్నా క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భాషతో సంబంధం లేకుండా ప్రతీ చోటా తన సత్తా చాటి నటిగా ప్రూవ్ చేసుకున్న రష్మిక ఇప్పుడు తన కెరీర్లోనే అత్యున్నత దశలో ఉన్నారు. రష్మిక నటిస్తున్న ప్రతీ సినిమా సక్సెస్ అవడంతో ఆమెకు డిమాండ్ కూడా బాగా పెరుగుతుంది. సినిమాల్లోనే కాకుండా రష్మిక ఆఫ్ స్క్రీన్ లో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటారనే విషయం తెలిసిందే.
అయితే రష్మిక ఏం చేసినా స్పెషల్ గా చేస్తూ ఉంటారు. సినిమాల దగ్గర నుంచి బయట తను ఉండే తీరు వరకు అన్నీ డిఫరెంట్ గా ఉంటూ అందరినీ ఎట్రాక్ట్ చేయడంతో పాటూ రష్మికను వార్తల్లో నిలిపేలా చేస్తాయి. కాగా రీసెంట్ గా రష్మిక డర్టీ మ్యాగజైన్ కోసం బోల్డ్ లుక్ లో మరింత ఫ్యాషన్ గా కనిపించి తన అభిమానులను ఎంతో ఆశ్చర్యానికి గురి చేశారు.
డర్టీకట్ 2025 కవర్ ఫోటోపై రష్మిక చాలా కొత్త గెటప్ లో కనిపించారు. ఇంకా చెప్పాలంటే ఈ గెటప్ లో ఆమె ఎవరో గుర్తుపట్టలేనంతగా ఉన్నారు. డర్టీకట్ కోసం రష్మిక కొత్త లుక్ లో కనిపించగా, ఆ ఫోటో షూట్ ప్రస్తుతం నెట్టింట అందరినీ ఎట్రాక్ట్ చేస్తోంది. ఈ లుక్ లో రష్మిక ఫ్యాషన్ సెన్స్ తో పాటూ తన కాన్ఫిడెంట్ లుక్స్ నెటిజన్లను ఆకర్షిస్తున్నాయి.
ఇక కెరీర్ విషయానికొస్తే రష్మిక రీసెంట్ గానే కుబేరా సినిమాతో సూపర్ హిట్ ను అందుకున్నారు. ఆ సక్సెస్ ఇచ్చిన జోష్ లో కొత్త డైరెక్టర్ తో మైసా అనే ప్రాజెక్టును అనౌన్స్ చేసి ఆ సినిమాకు సంబంధించిన ప్రీ లుక్ తోనే అందరికీ షాకిచ్చారు రష్మిక. దాంతో పాటూ రష్మిక థామా, ది గర్ల్‌ఫ్రెండ్, రెయిన్‌బో అనే సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే.