Begin typing your search above and press return to search.

టీజ‌ర్ టాక్: 'ధురంధ‌ర్' గ‌ట్టిగా కొట్టేట్టున్నాడు

క‌చ్ఛితంగా ఈ సినిమా చూడాలి అనేలా కొన్ని టీజ‌ర్లు మాత్ర‌మే బ‌ల‌మైన‌ ముద్ర వేస్తాయి.

By:  Tupaki Desk   |   6 July 2025 11:30 PM IST
టీజ‌ర్ టాక్: ధురంధ‌ర్ గ‌ట్టిగా కొట్టేట్టున్నాడు
X

క‌చ్ఛితంగా ఈ సినిమా చూడాలి అనేలా కొన్ని టీజ‌ర్లు మాత్ర‌మే బ‌ల‌మైన‌ ముద్ర వేస్తాయి. అలాంటి బ‌ల‌మైన ముద్ర వేస్తోంది ఈ టీజ‌ర్. కచ్ఛితంగా థియేట‌ర్ కి వెళ్లి సినిమా చూడాలి అనిపించే ఘాఢంగా హ‌త్తుకుంది 'ధురంధ‌ర్' టీజ‌ర్. కొన్ని వ‌రుస డిజాస్ట‌ర్ల త‌ర్వాత పున‌ర్జ‌న్మ‌ను కోరుకుంటున్న ర‌ణ్ వీర్ సింగ్ కి స‌రైన పున‌రుజ్జీవ‌నం ఈ టీజ‌ర్ అని చెప్పాలి. ధురంధ‌ర్ అత‌డి కెరీర్‌లోనే ఒక ప్ర‌త్యేక‌మైన సినిమా అని తొలి నుంచి ప్ర‌చారం సాగుతోంది. దానికి త‌గ్గ‌ట్టే తన 40వ పుట్టినరోజు సందర్భంగా ర‌ణ్ వీర్ పిచ్చి అవతారంతో ఈ క్లిప్ లో క‌నిపించాడు. టీజ‌ర్ లో అత‌డి పాత్ర తీరుతెన్నులు, న‌డ‌క న‌డ‌త ప్ర‌తిదీ విప‌రీతంగా అభిమానుల‌ను క‌ట్టి ప‌డేసాయి.

రణవీర్ సింగ్‌తో పాటు టీజ‌ర్‌లో దిగ్గ‌జ న‌టులను ప‌రిచ‌యం చేసారు. ఆర్. మాధవన్ ఈసారి బ‌ట్ట‌త‌ల‌తో ఒక కార్పొరెట్ మాఫియా గురూలా క‌నిపిస్తున్నాడు. అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్ , అర్జున్ రాంపాల్ వంటి ప్రామిస్సింగ్ న‌టులు జీవం పోస్తున్నారు. టీజ‌ర్ ని ఎలివేట్ చేసిన తీరుకు కూడా దర్శకుడు ఆదిత్య ధర్ కూడా చాలా ప్రశంసలు అందుకుంటున్నారు.

ఇది కొంద‌రు బ‌య‌టి ప్ర‌పంచానికి తెలియని వ్యక్తుల నిజమైన కథను వెలికితీసే ప్ర‌య‌త్నం అని ఆదిత్యాధ‌ర్ తొలి నుంచి చెబుతున్నాడు. యూరి ఫేం మ‌రో అసాధార‌ణ క‌థ‌ను వండుతున్నాడు. #ధురంధర్ 5 డిసెంబర్ 2025న విడుద‌ల కానుంది. ఇది ర‌ణ్ వీర్ కి క‌చ్ఛితంగా గొప్ప పున‌రాగ‌మ‌నం అవుతుంద‌ని అంతా ఆశిస్తున్నారు. ఈ టీజ‌ర్ కి అభిమానుల నుంచి స్పంద‌న‌లు అదే స్థాయిలో ఉన్నాయి.

ఈలలు వేసేలా డైలాగ్స్, భారీ తారాగ‌ణం, విస్ఫోటనకరమైన యాక్షన్, అడ్రినలిన్ పంపింగ్ పాటలు, మైండ్ బ్లో అనిపించే రణ్‌వీర్ స్క్రీన్ ప్రెజెన్స్.. ఇలా ఈ చిత్రంలో అన్నీ ఉన్నాయి. ఇది బాక్సాఫీస్ వద్ద ఖచ్చితంగా హిట్ అవుతుంది.. రణ్‌వీర్ సింగ్ తిరిగి గొప్ప‌గా వచ్చాడు అని ఒక అభిమాని టీజ‌ర్ ని ప్ర‌శంసించాడు.

#ధురంధర్ చిత్రాన్ని ఆదిత్య ధర్ -ర‌ణ్ వీర్ ఈసారి భిన్నంగా కూక్ చేశారు! పరిశ్రమ దీనికి సిద్ధంగా లేదు! గూస్‌బంప్స్ గ్యారెంటీ! బాబా మనందరికీ ఎంత మంచి బి-డే బహుమతి! ఇది పిచ్చిగా ఉంటుంది! అని ఒక‌రు ఉబ్బిత‌బ్బిబ్బ‌య్యారు. రణవీర్ సింగ్ కా కమ్‌బ్యాక్ మాస్ + యాక్టింగ్ + స్టోరీ + BGM = #ధురంధర్ అని మ‌రొక‌రు రాసారు. ఓవ‌రాల్ గా ధురంధ‌ర్‌ టీజ‌ర్ చాలా న‌మ్మ‌కాన్ని పెంచింది. డిసెంబ‌ర్ లో ఈ సినిమా రాక కోసం ఇప్ప‌టి నుంచే అభిమానులు వేచి చూసేలా చేసింది. అయితే ఈ సినిమాలో యాక్ష‌న్ పార్ట్ చూస్తుంటే, ర‌క్త‌పాతం యానిమ‌ల్ ని కొట్టేట్టే క‌నిపిస్తోంది.