అతడిలో యానిమలే కాదు చాప్లిన్ ఉన్నాడు!
అందుకే క్షణాల్లో ఈ కొత్త గెటప్ అంతర్జాలంలో వైరల్ గా మారింది. ఇది రణబీర్ నటించే తదుపరి సినిమా గెటప్ అయి ఉంటుందా?
By: Tupaki Desk | 24 Jun 2025 8:30 AM ISTప్రస్తుతం రామాయణం సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్నాడు రణబీర్. తదుపరి యష్ రాజ్ ఫిలింస్ లో ధూమ్ 4లో నటించాల్సి ఉంది. ఇలాంటి సమయంలో అతడు ఊహించని ఓ కొత్త గెటప్ తో ఆశ్చర్యపరిచాడు. అతడు అకస్మాత్తుగా చార్లీ చాప్లిన్ లా కనిపించాడు. ప్రపంచవ్యాప్తంగా అసాధారణ ఫాలోవర్స్ ఉన్న చాప్లిన్ రూపంతో అతడు చేసిన మ్యాజిక్ అంతా ఇంతా కాదు.
అందుకే క్షణాల్లో ఈ కొత్త గెటప్ అంతర్జాలంలో వైరల్ గా మారింది. ఇది రణబీర్ నటించే తదుపరి సినిమా గెటప్ అయి ఉంటుందా? అని కొందరు కామెంట్ చేసారు. అయితే ఇది కేవలం ఒక వాణిజ్య ప్రకటన కోసం అని గుసగుసలు వినిపిస్తున్నాయి. తన తాత గారైన రాజ్ కుమార్ ఆవారా చిత్రంలో చాప్లిన్ గెటప్‌లో కనిపించారు. ఆయన చాప్లిన్ రూపాన్ని పునః సృష్టించడంలో పెద్ద సక్సెసయ్యారు. ది ట్రాంప్ లో చాప్లిన్ గెటప్ ని రాజ్ కపూర్ అనుసరించారు. ఇప్పుడు రణబీర్ కపూర్ అదే రూపంతో కనిపించడంతో అందరిలో క్యూరియాసిటీ పెరిగింది.
అసలు ఈ వేషధారణ దేనికోసమో రణబీర్ స్వయంగా వెల్లడించేవరకూ ఏ విషయమూ క్లారిటీ రాదు. కెరీర్ పరంగా ప్రయోగాలు చేసేందుకు వెనకాడని రణబీర్ చాప్లిన్ గా నటిస్తే చూడాలని అభిమానులు కోరుకుంటున్నారు. యానిమల్ లో క్రూరుడైన గ్యాంగ్ స్టర్ గా నటించాడు. రామాయణంలో శ్రీరాముడిగా నటిస్తున్నాడు. ధూమ్ 4లో ఒక దోపిడీ దొంగ గా నటించాల్సి ఉంటుంది. ఇవన్నీ ఒకదానికొకటి భిన్నమైనవి. చాప్లిన్ గా నటిస్తే అది ఇంకా కొత్తగా కనిపిస్తుంది.