Begin typing your search above and press return to search.

రాజు వెడ్స్ రాంబాయి.. చార్ట్ బస్టర్ సాంగ్ రిలీజ్!

ఈ మధ్యకాలంలో నటీనటులతో పని లేకుండా కంటెంట్ ఉంటే చాలు సినిమా హిట్ అవుతుందని ఇప్పటికే ఎన్నో చిత్రాలు నిరూపించాయి.

By:  Madhu Reddy   |   5 Nov 2025 4:00 PM IST
రాజు వెడ్స్ రాంబాయి.. చార్ట్ బస్టర్ సాంగ్ రిలీజ్!
X

ఈ మధ్యకాలంలో నటీనటులతో పని లేకుండా కంటెంట్ ఉంటే చాలు సినిమా హిట్ అవుతుందని ఇప్పటికే ఎన్నో చిత్రాలు నిరూపించాయి. ముఖ్యంగా కంటెంట్ లేకపోతే అటువైపు పెద్ద స్టార్ హీరో ఉన్నా సరే ఆ సినిమాను ప్రేక్షకులు ఆదరించరు అనడంలో సందేహం లేదు. ఈ క్రమంలోనే మరో మంచి కంటెంట్తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అవుతోంది రాజు వెడ్స్ రాంబాయి. ఈ ఏడాది నవంబర్ 21న విడుదల కానున్న ఈ సినిమా.. తెలంగాణలోని వరంగల్ , ఖమ్మం జిల్లాల సరిహద్దు గ్రామాలలో జరిగిన నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ సినిమా రూపుదిద్దుకుంటుంది.

డాక్టర్ నాగేశ్వర్ పూజారి సమర్పణలో ఈటీవీ ఒరిజినల్స్, డోలాముఖి సబాల్టర్ ఫిలిమ్స్, మాన్సూన్ టేల్స్ బ్యానర్లపై వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవి ఈ చిత్రాన్ని నిర్మించారు. సాయిలు కంపాటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అఖిల్ రాజ్ ఉద్దెమరి, తేజస్వి రావు, చైతు జొన్నలగడ్డ, శివాజీ రాజా ప్రధాన పాత్రల్లో రాబోతోంది. చిన్న సినిమానే అయినా ఇప్పుడు ఈ సినిమాకి పెద్ద పెద్ద స్టార్స్ ప్రమోషన్స్ కార్యక్రమాలు చేపట్టారు. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా నుండి మొదటి పాటను రిలీజ్ చేశారు మేకర్స్.

రాంబాయి నీ మీద నాకు మనసాయే అంటూ సాగే ఈ పాట ఇప్పుడు యూట్యూబ్ లో చార్ట్ బస్టర్ గా నిలిచింది. సురేష్ బొబ్బిలి స్వరాలు అందించగా.. మిట్టపల్లి సురేందర్ సాహిత్యం అందించారు. అనురాగ్ కులకర్ణి, జయశ్రీ పళ్లెంకి పాటను ఆలపించారు 4:10 నిమిషాల నిడివి ఉన్న ఈ పాట మనసును హత్తుకుంటుంది. తాజాగా విడుదల చేసిన ఈ పాట ఇప్పుడు సినిమాపై అంచనాలు పెంచేసిందని చెప్పవచ్చు..

మరొకవైపు ఈ పాట లాంచ్ ఈవెంట్ కి మంచు మనోజ్, తన భార్య భూమా మౌనిక రెడ్డితో కలిసి హాజరయ్యారు.ఈ పాట విడుదల చేసిన తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన.. ఈ పాటలోని లిరిక్స్ ని గుర్తు చేస్తూ తన ప్రేమ విషయాన్ని అందరితో పంచుకున్నారు. ఈ పాటలో " రాంబాయి నీ మీద నాకు మనసాయే" ఈ పాటలో చెప్పినట్టుగా నేను కూడా మౌనికతో రాజ్యాలు లేవు.. సినిమాలు చేయడం లేదు.. కానీ నిన్ను మాత్రం మహారాణిలా చూసుకుంటాను.. కష్టపడతాను.. ఏ రోజు ఇబ్బంది కలిగించను అని మాట ఇచ్చాను. ఇక నన్ను నమ్మిన నా భార్య నా వెంట వచ్చింది అంటూ తన ప్రేమ విషయాన్నీ అందరితో పంచుకున్నారు మంచు మనోజ్.

ఇకపోతే మంచు మనోజ్ మాట్లాడుతూ.. ఈ సినిమా ఖచ్చితంగా బ్లాక్ బాస్టర్ అవుతుంది అంటూ తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చారు. ఏది ఏమైనా ఇప్పుడు కంటెంట్ ఓరియంటెడ్ గా వస్తున్న ఈ సినిమా నవంబర్ 21న ఏ విధంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి.