Begin typing your search above and press return to search.

'రామాయ‌ణం'లో కుంభ‌క‌ర్ణుడిగా?

నితీష్ తివారీ రామాయ‌ణం స‌ర్వ‌త్రా ఆస‌క్తిని పెంచుతోంది. ఇటీవ‌లే విడుద‌లైన టీజ‌ర్ కి అద్బుత‌మైన స్పంద‌న వ‌చ్చింది.

By:  Tupaki Desk   |   8 July 2025 9:10 AM IST
రామాయ‌ణంలో కుంభ‌క‌ర్ణుడిగా?
X

నితీష్ తివారీ రామాయ‌ణం స‌ర్వ‌త్రా ఆస‌క్తిని పెంచుతోంది. ఇటీవ‌లే విడుద‌లైన టీజ‌ర్ కి అద్బుత‌మైన స్పంద‌న వ‌చ్చింది. టీజ‌ర్ లో ర‌ణ్ బీర్ ని శ్రీ‌రాముడిగా ఆవిష్క‌రించాడు నితీష్‌. మొదటి గ్లింప్స్‌లో, రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీత పాత్రను పోషిస్తుండ‌గా, యష్ రావణుడిగా, సన్నీ డియోల్ హనుమంతుడిగా, రవి దూబే లక్ష్మణుడిగా కనిపిస్తారని నిర్మాతలు ఇప్ప‌టికే వెల్లడించారు.

అయితే ఈ సినిమాలో కుంభ‌క‌ర్ణుడి పాత్ర‌లో ఎవ‌రు న‌టిస్తారు? అనేదానికి ఇంకా స‌మాధానం రాలేదు. ఈ పాత్ర‌లో యానిమ‌ల్ లో అబ్రార్ పాత్ర‌తో ఆక‌ట్టుకున్న బాబి డియోల్ న‌టించే అవ‌కాశం ఉంద‌ని చాలా కాలంగా పుకార్లు ఉన్నాయి. అయితే ఇది నిజ‌మా? అంటే... ఇప్ప‌టివ‌ర‌కూ ఎలాంటి అధికారిక క‌న్ఫ‌ర్మేష‌న్ లేదు. బాబి డియోల్ రామాయ‌ణంలో న‌టిస్తున్నాడా లేదా? అన్న‌దానికి ఇప్ప‌టికీ స్ప‌ష్ఠ‌త లేదు. ఒక‌వేళ బాబీకి అవ‌కాశం క‌ల్పించినా కుంభ‌క‌ర్ణుడి పాత్ర‌లో క‌నిపిస్తాడా? అనేదానికి క్లారిటీ లేదు. ప్ర‌స్తుతానికి బాబి డియోల్ తో నితీష్ బృందం ఎలాంటి చ‌ర్చ‌లు జ‌ర‌ప‌లేద‌ని క‌థ‌నాలొస్తున్నాయి. ఒక పోర్టల్ లో ''రిపోర్టులు తప్పు. అతడి పేరు అకస్మాత్తుగా బయటపడింది'' అని రాసారు.

రెండు భాగాలుగా రూపొందుతున్న రామాయ‌ణం 2026-27 సీజ‌న్ లో మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ గా గుర్తింపు పొందింది. ఈ చిత్రం రెండు భాగాలుగా తెర‌కెక్కుతోంది. మొదటి భాగం 2026 దీపావళిన విడుదల కానుంది. రెండవ భాగం 2027 దీపావళిన పెద్ద తెరలపైకి వస్తుంది. ఈ రెండు భాగాల‌కు క‌లుపుకుని 1600 కోట్ల బ‌డ్జెట్ ఖ‌ర్చు కానుంద‌ని ఇటీవ‌ల క‌థ‌నాలొచ్చాయి.

ఇక బాబీ డియోల్ కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే, అత‌డు ఇటీవ‌ల బాలీవుడ్ సినిమాల‌తో పాటు సౌత్ సినిమాల్లోను న‌టిస్తున్నాడు. చివరిగా కంగువ‌, హౌస్‌ఫుల్ 5 లో కనిపించాడు. త‌దుప‌రి `హరి హర వీర మల్లు: పార్ట్ 1`, ఆల్ఫా, జన నాయగన్ వంటి భారీ చిత్రాల‌లో న‌టిస్తున్నాడు. హరి హర వీర మల్లు: పార్ట్ 1, ఆల్ఫా ఈ సంవత్సరం విడుదల కానుండగా, జన నాయగన్ 2026 లో పెద్ద తెరపైకి రానుంది.