Begin typing your search above and press return to search.
రామ్ 'ఆంధ్ర కింగ్ తాలూకా'.. గ్లింప్స్ తో హైప్ ఎక్కేలా ఉందే!
టాలీవుడ్ యంగ్ హీరో, ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని.. ఇప్పుడు తన అప్ కమింగ్ మూవీతో సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు.
By: Tupaki Desk | 15 May 2025 11:38 AM ISTటాలీవుడ్ యంగ్ హీరో, ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని.. ఇప్పుడు తన అప్ కమింగ్ మూవీతో సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి మూవీతో విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు అందుకున్న దర్శకుడు పి. మహేష్ బాబుతో ఆయన ప్రస్తుతం వర్క్ చేస్తున్నారు. భాగ్యశ్రీ బొర్సే హీరోయిన్ గా యాక్ట్ చేస్తున్నారు.
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్ గ్రాండ్ గా నిర్మిస్తుండగా.. కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర కీలక పాత్రలో నటిస్తున్నారు. నేడు రామ్ పుట్టినరోజు సందర్భంగా.. శుభాకాంక్షలు తెలుపుతూ మేకర్స్ టైటిల్ ను అనౌన్స్ చేస్తూ.. గ్లింప్స్ కూడా రిలీజ్ చేశారు. అంతా అనుకున్నట్లే ఆంధ్ర కింగ్ తాలుకానే ఫిక్స్ చేశారు.
థియేటర్ వద్ద అభిమానుల సంబరాలు.. బాణసంచా కాల్పులు.. క్యూలైన్లలో టికెట్స్ కోసం ప్రజలు.. వంటి కోలాహల సీన్స్ తో గ్లింప్స్ ప్రారంభమైంది. అక్కడ యజమాని ఆంధ్రా కింగ్ సూర్య కుమార్ విడుదలకు టిక్కెట్ల కోసం ఫోన్లతో బిజీగా ఉంటారు. ఎమ్మెల్యే తాలూకా, కానిస్టేబుల్ తాలుకా అంటూ టికెట్స్ కావాలని అడుగుతుంటారు.
అప్పుడే రామ్ సైకిల్ పై స్టైలిష్ ఎంట్రీ ఇస్తారు. ఆంధ్రా కింగ్ ఫ్యాన్స్ అంటూ 50 టిక్కెట్లు అడుగుతారు. వెంటనే యజమాని ఓకే చెప్పి ఇస్తారు. రామ్ తోటి అభిమానులతో థియేటర్ బయట ఆంధ్రా కింగ్ మూవీ (కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర) కటౌట్ ఎదుట సంబరాల్లో పాల్గొంటారు. అప్పుడు ఆంధ్ర కింగ్ అంటూ గట్టిగా నినాదిస్తారు.
అప్పుడే టైటిల్ రివీల్ అవ్వగా.. ఆ విజువల్స్ తో గ్లింప్స్ ఎండ్ అయింది. ఇప్పుడు అందరినీ మెప్పిస్తోంది. అయితే స్టార్ హీరో అయిన రామ్.. ఇప్పుడు మరో స్టార్ హీరో ఫ్యాన్ గా యాక్ట్ చేయడం విశేషమే. సినిమాలో తన యాక్టింగ్ తో మెప్పించనున్నారని క్లియర్ గా తెలుస్తోంది. సినిమా కోసం పూర్తిగా మేకోవర్ చేసుకున్నట్లు కనిపిస్తోంది.
సైకిల్ ను పార్క్ చేసే స్టైలిష్ విధానం వేరే లెవెల్. మహేష్ బాబు పి మరోసారి తన మార్క్ చూపించనున్నట్లు తెలుస్తోంది. రైటింగ్ తో ఆకట్టుకుంటారని అర్థమవుతోంది. సిద్ధార్థ విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. వివేక్- మెర్విన్ బ్యాక్ గ్రౌండ్ జోష్ నింపుతోంది. మైత్రీ రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్ స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఓవరాల్ గా గ్లింప్స్.. సినిమాపై మంచి అంచనాలు పెంచుతుందని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు.