ఈ క్షణం మరువలేనిది.. రకుల్ పోస్ట్ వైరల్!
ఈ తీజ్ వేడుకల్లో రకుల్ ప్రీత్ సింగ్ ఎరుపు రంగు సల్వార్ కమీజ్ వేసుకొని ఎంతో అందంగా కనిపించింది.. ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ పెట్టిన ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.
By: Madhu Reddy | 13 Aug 2025 12:39 PM ISTప్రముఖ బాలీవుడ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ తెలుగులో వరుస సినిమాలు చేసి భారీ పాపులారిటీ అందుకుంది. కెరియర్ పీక్స్ లో ఉండగానే బాలీవుడ్ కి మకాం మార్చిన ఈమె.. అక్కడే ప్రముఖ నిర్మాత, నటుడు అయినా జాకీ భగ్నానినీ పెళ్లి చేసుకుంది. వివాహం తర్వాత అడపాదడపా సినిమాలు చేస్తున్న ఈమె... మరొకవైపు ఇంస్టాగ్రామ్ లో యాక్టివ్ గా ఉంటూ పలు ఫోటోలు పంచుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ఈమె షేర్ చేసిన ఒక పోస్ట్ వైరల్ గా మారింది. మరి ఆ పోస్ట్ ఏంటి? రకుల్ షేర్ చేసిన పోస్ట్ వెనుక ఉన్న అర్థం ఏంటి? అనే విషయం ఇప్పుడు చూద్దాం..
రకుల్ వివాహం తర్వాత.. మొదటిసారి ఆ పండుగ చేసుకున్నానంటూ తాజాగా తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో ఒక ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టింది. అసలు విషయంలోకి వెళ్తే.. రకుల్ ప్రీత్ సింగ్ తాజాగా తన అత్త, భర్తతో కలిసి మొదటిసారి కజారి తీజ్ ని జరుపుకుంది.. దానికి సంబంధించి తాజాగా తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో ఈ విధంగా పోస్ట్ పెట్టింది."మీ అందరికీ హ్యాపీ తీజ్.. నా పూజ భగ్నానీ ( రకుల్ ప్రీత్ సింగ్ అత్త)తో మొదటిసారి తీజ్ జరుపుకుంటున్నాను.. ఫస్ట్ టైం అత్తగారు అలాగే జాకీ భగ్నానీతో కలిసి ఈ పండగ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది.. ఈ క్షణం మరువలేనిది " అంటూ చెప్పుకొచ్చింది.. అంతేకాకుండా భర్త జాకీ భగ్నానీ అలాగే అత్తగారితో కలిసి చేసుకున్న తీజ్ పండగకు సంబంధించిన ఫోటోలను కూడా తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసుకుంది.
ఈ తీజ్ వేడుకల్లో రకుల్ ప్రీత్ సింగ్ ఎరుపు రంగు సల్వార్ కమీజ్ వేసుకొని ఎంతో అందంగా కనిపించింది.. ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ పెట్టిన ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక రకుల్ ప్రీత్ సింగ్ చేసుకున్న కజారి తీజ్ పండుగ సమయంలో ఏం చేస్తారంటే.. పెళ్లి చేసుకున్న స్త్రీలు పార్వతి దేవికి సోలా ష్రింగర్ అంటే వధువు లాగా అలంకరించి పూజిస్తారు.. అలాగే తమ వైవాహిక బంధం బాగుండాలని ఆ దేవత ఆశీర్వాదం తీసుకుంటారు..
ఇక రకుల్ ప్రీత్ సింగ్ సినిమాల విషయానికి వస్తే.. దేదే ప్యార్ దే 2 సినిమాకి సీక్వెల్ గా వస్తున్న దేదే ప్యార్ దే-2 లో రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తోంది.. ఇక ఈ దేదే ప్యార్ దే-2 మూవీ ఈ ఏడాది నవంబర్ 14న విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ సినిమాలో అజయ్ దేవగన్, రకుల్ ప్రీత్ సింగ్, టబు, అలోక్ నాథ్ వంటి వాళ్ళు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అలాగే తమన్నా, ప్రకాష్ రాజ్ లు గెస్ట్ రోల్స్ చేస్తున్నట్టు తెలుస్తోంది.
ఇక రకుల్ ప్రీత్ సింగ్ వ్యక్తిగత విషయానికి వస్తే..ఆమె బాలీవుడ్ నటుడు నిర్మాత అయినటువంటి జాకీ భగ్నానీతో కొన్ని సంవత్సరాలు డేటింగ్ చేసి, గత ఏడాది అనగా 2024 ఫిబ్రవరి 21న గోవా లో గ్రాండ్ గా పెళ్లి చేసుకుంది.