పిక్‌టాక్ : కవర్ స్టిల్‌తో మంట పెట్టిన రకుల్
By: Ramesh Palla | 13 Aug 2025 3:28 PM ISTతెలుగు ప్రేక్షకులకు కెరటం సినిమాతో పరిచయం అయిన ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్‌కి 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్' సినిమాతో హిట్ దక్కింది. సందీప్ కిషన్ హీరోగా నటించిన వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ కమర్షియల్‌గా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో వెంటనే రకుల్ ప్రీత్ సింగ్‌కి టాలీవుడ్‌లో స్టార్ హీరోల సినిమాల్లో నటించే అవకాశాలు దక్కాయి. మెల్ల మెల్లగా స్టార్ హీరోల సినిమాలకు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా నిలిచిన రకుల్ ప్రీత్ సింగ్ ఐదేళ్ల పాటు వరుస సినిమాలు చేసింది. ఒకానొక సమయంలో స్టార్ హీరోల సినిమాలకు సైతం డేట్లు ఇవ్వలేని స్థాయిలో బిజీగా సినిమాలు చేసింది. కానీ కాలం ఎప్పుడూ ఒకలా ఉండదు కదా, తెలుగులో ఆఫర్లు తగ్గుతూ వచ్చాయి. టాలీవుడ్‌లో ఆఫర్లు తగ్గిన సమయంలో ఈ అమ్మడికి బాలీవుడ్ నుంచి పిలుపు వచ్చింది.
దే దే ప్యార్ సీక్వెల్‌తో ప్రేక్షకుల ముందుకు
బాలీవుడ్‌లో ఈమె చేసిన సినిమాలు సైతం నిరాశను మిగిల్చాయి. ఒకటి రెండు తప్ప పెద్దగా సినిమాలు ఆమెకు గుర్తింపును తెచ్చి పెట్టలేదు. రెండు మూడు ఏళ్ల పాటు అక్కడ వరుస సినిమాలు చేసినా పెద్దగా గుర్తింపు రాలేదు. దాంతో అక్కడ కూడా ఆఫర్లు తగ్గుతూ వచ్చాయి. గత రెండేళ్లుగా రకుల్ ప్రీత్ సింగ్ సినిమాలు చాలా అరుదుగా వస్తున్నాయి. ఈ ఏడాది మేరే హస్బెండ్ కీ బివి సినిమాతో వచ్చింది. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. అయినా కూడా లక్కీగా రకుల్ కి దే దే ప్యార్ దే సినిమా సీక్వెల్ లో నటించే అవకాశం వచ్చింది. అప్పట్లో దే దే ప్యార్ దే మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అందుకే ఈ సినిమా లో ఆమెకు నటించే అవకాశం దక్కింది. ఈ సీక్వెల్ త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సినిమా విడుదల కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
బ్రైడ్స్ టుడే కవర్ పేజ్‌పై రకుల్ ప్రీత్ సింగ్
రకుల్ ప్రీత్ సింగ్ కెరీర్ ఆరంభం నుంచి సినిమాలతోనే కాకుండా అందమైన ఫోటోలతోనూ ఆకట్టుకుంటూ వస్తోంది. తాజాగా మరోసారి ఇన్‌స్టాగ్రామ్‌లో అందమైన ఫోటోలను షేర్ చేయడం ద్వారా రకుల్ ప్రీత్ సింగ్ వార్తల్లో నిలిచింది. ఈసారి ప్రముఖ మ్యాగజైన్ బ్రైడ్స్ టుడే కవర్ పేజ్ పై రకుల్ ప్రీత్ సింగ్ మెరిసిపోయింది. నడుము అందం చూపిస్తూ అందమైన నాభి అందాలను చూపించడం ద్వారా రకుల్ ప్రీత్ సింగ్ చూపు తిప్పనివ్వడం లేదు. ఆకట్టుకునే అందంతో పాటు, కన్నుల విందు చేసే విధంగా రకుల్ ప్రీత్ సింగ్ మేకోవర్ ఉంది. ఇంతటి అందమైన రకుల్ ప్రీత్ సింగ్‌కు ఇంత త్వరగా ఇండస్ట్రీ ఉద్వాసన పలకడం ఏ మాత్రం బాగా లేదు అంటూ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కుర్రాళ్ల గుండెలో గుబులు
తెల్లటి డ్రెస్‌లో రకుల్ ప్రీత్ సింగ్ మెరిసి పోతున్న ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. కవర్ పేజ్‌కే అందం వచ్చిందని, పేరుకు తగ్గట్లుగా భలే ఉందని రకుల్ ప్రీత్ సింగ్ కవర్ ఫోటోకు కామెంట్స్ వస్తున్నాయి. సాధారణంగానే రకుల్ ప్రీత్ సింగ్ చాలా అందంగా ఉంటుంది. స్కిన్ షో చేసినా, చేయకున్నా కూడా చాలా అందంగా రకుల్ ప్రీత్ సింగ్ ఉంటుంది. అలాంటి రకుల్ ప్రీత్ సింగ్ ను ఈ అందమైన కవర్ పేజ్‌లో చూస్తూ ఉంటే కుర్రాళ్ల గుండెలో మంట పెట్టినట్లు ఉందని చాలా మంది అంటున్నారు. కవర్ స్టిల్‌తో ఇంత అందంగా కనిపించవచ్చు అని ఈమెను చూస్తే అనిపిస్తుందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ అమ్మడి ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇంత అందంగా ఉన్న రకుల్ ప్రీత్ సింగ్‌కి మరో ఐదేళ్ల పాటు సినిమా ఆఫర్లు రావాలని అభిమానులు కోరుకుంటున్నారు.