కూలీ ఆ రూ.100 కోట్ల రికార్డ్ కొట్టేనా...?
కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ ఫ్యాన్స్‌తో పాటు అన్ని భాషల ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న 'కూలీ' సినిమా మరో ఐదు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.
By: Ramesh Palla | 8 Aug 2025 9:00 PM ISTకోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ ఫ్యాన్స్‌తో పాటు అన్ని భాషల ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న 'కూలీ' సినిమా మరో ఐదు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. రజనీకాంత్‌కు ఉన్న క్రేజ్, దర్శకుడు లోకేష్ కనగరాజ్ గత సినిమాల ట్రాక్ రికార్డ్ నేపథ్యంలో కూలీ సినిమాకు విపరీతమైన బజ్ క్రియేట్ అయింది. ముఖ్యంగా లోకేష్ కనగరాజ్‌కి ఉన్న క్రేజ్ నేపథ్యంలో సినిమాకు విపరీతమైన క్రేజ్ క్రియేట్ అయింది. తమిళనాట మాత్రమే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో, నార్త్ ఇండియాలోనూ కూలీ సినిమాకు ప్రీ సేల్ ఓ రేంజ్ లో ఉంది అనే విషయం తెల్సిందే. అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభించిన వెంటనే లక్షల మంది బుక్ మై షో లో టికెట్లను బుక్ చేసుకున్నారు.
2025లో బిగ్గెస్ట్ మూవీ
గంటకు ఒకానొక సమయంలో 50 వేల నుంచి 60 వేల వరకు టికెట్లు బుక్ అయ్యాయి. అందుకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రజనీ గతంలో ఏ సినిమాకు రాని విధంగా ఈ సినిమాకు బజ్ క్రియేట్ కావడంతో ఓపెనింగ్స్ అందుకు తగ్గట్లుగా నమోదు అవుతున్నాయి. ఈ మద్య కాలంలో ఈ స్థాయిలో ప్రీ సేల్ కావడం ఇదే అంటున్నారు. 2025 లో అత్యధిక ప్రీ సేల్‌ను నమోదు చేసిన సినిమాగా ఇప్పటి వరకు వచ్చిన సినిమాలన్నింటిని వెనక్కు నెట్టి మరీ కూలీ నిలిచింది. ఇక ఓవర్సీస్‌లో ఈ సినిమా వసూళ్ల జోరు ఏమాత్రం తగ్గడం లేదు. ప్రీ సేల్ ప్రారంభించి రోజులు గడుస్తున్నాయి. రోజులు గడుస్తున్నా కొద్ది వసూళ్లు పెరుగుతూనే ఉన్నాయి. అక్కడ విడుదలకు ముందే రూ.100 కోట్లు సాధించేనా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
కూలీ రికార్డ్‌ల హోరు
విడుదలైన మొదటి రోజు చాలా తక్కువ సినిమాలు మాత్రమే ఓవర్సీస్‌లో రూ.100 కోట్ల క్లబ్‌లో చేరాయి. ఇప్పుడు రజనీకాంత్ కూలీ సినిమా జోరు చూస్తూ ఉంటే ఖచ్చితంగా బాక్సాఫీస్ ను షేక్ చేయడం ఖాయంగా అనిపిస్తుంది. కూలీ సినిమా ఓవర్సీస్‌లో ఇప్పటి వరకు రూ.30 కోట్ల వరకు ప్రీ సేల్ నమోదు చేసింది. విడుదలకు మరో ఐదు రోజుల సమయం ఉంది. కనుక అప్పటి వరకు మరో పాతిక నుంచి ముప్పై కోట్ల వరకు ప్రీ సేల్ రాబట్టే అవకాశాలు ఉన్నాయి. కూలీ సినిమా విడుదల రోజు నమోదు అయ్యే కలెక్షన్స్ అరుదైన రికార్డ్‌ను నమోదు చేసే అవకాశాలు ఉన్నాయి. లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ కి ఉన్న క్రేజ్ నేపథ్యంలో మొదటి రోజు పూర్తి అయ్యేప్పటికి కేవలం ఓవర్సీస్‌లో రూ.100 కోట్లు నమోదు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
జైలర్ తర్వాత కూలీతో రికార్డ్
ఓవర్సీస్ లో మొదటి రోజు రూ.100 కోట్లు రాబట్టిన సినిమాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఆ సినిమాల జాబితాలో ఇప్పుడు ఈ సినిమా నిలిచే అవకాశం ఉందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాలో తెలుగు, మలయాళ స్టార్స్ ఉండటంతో ఈ భాషలకు చెందిన ప్రేక్షకులు సైతం ఓవర్సీస్‌లో కూలీ సినిమాను చూసేందుకు ఆసక్తిగా ఉన్నారు. అందుకే ప్రీ సేల్ అన్ని భాషలకు కలిపి భారీ మొత్తంలో నమోదు అవుతున్నట్లు తెలుస్తోంది. రజనీకాంత్ ఈ మధ్య కాలంలో బాక్సాఫీస్ వద్ద సరైన సత్తా చాటడంలో విఫలం అవుతున్నారు. జైలర్ తర్వాత ఆయన సినిమాలు నిరాశ పరుస్తూ వస్తున్నాయి. దాంతో ఈ సినిమా విషయంలో ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఉన్నారు. రూ.500 కోట్ల టార్గెట్‌తో ఈ సినిమా బాక్సాఫీస్ వార్ కి రెడీ అవుతోంది. వార్ 2 సినిమా ఈ సినిమాకు పోటీగా విడుదల కాబోతున్న విషయం తెల్సిందే.