Begin typing your search above and press return to search.

ప్రీ బుకింగ్స్ లో కూలీ క్రేజీ హైప్.. కబాలి తర్వాత ఇదే తొలిసారి

సూపర్ స్టార్ రజనీకాంత్ తాజా చిత్రం కూలీపై భారీగానే అంచనాలు ఉన్నాయి. అంచనాలు ప్రీ బుకింగ్స్ లెక్కల్లోనే తెలిసిపోతోంది.

By:  M Prashanth   |   9 Aug 2025 3:59 PM IST
ప్రీ బుకింగ్స్ లో కూలీ క్రేజీ హైప్.. కబాలి తర్వాత ఇదే తొలిసారి
X

సూపర్ స్టార్ రజనీకాంత్ తాజా చిత్రం కూలీపై భారీగానే అంచనాలు ఉన్నాయి. అంచనాలు ప్రీ బుకింగ్స్ లెక్కల్లోనే తెలిసిపోతోంది. ఓవర్సీస్ తోపాటు దేశంలోనూ పలు ఏరియాల్లో బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ఇలా ప్రారంభమయ్యయో లేదో కేరళలోని కొన్ని ప్రాంతాల్లో ఫస్ట్ వీకెండ్ టికెట్లు అన్నీ సోల్డ్ ఔట్ అయ్యాయంటేనే అర్థం చేసుకోవచ్చు సినిమ హైప్.

ఇది రిలీజ్ కు ముందే సినిమా సాధించిన విజయం అని చెప్పవచ్చు. ఇక తమిళనాడుతోపాటు తెలుగు రాష్ట్రాల్లో కూలీ భారీ స్థాయిలో విడుదల కానుంది. ఆగస్టు 14న రిలీజ్ కానుండడం.. స్వాతంత్ర్య దినోత్సవం వీకెండ్ కలిసి రావడంతో తొలి వీకెండ్ లోనే కూలీకి భారీ సంఖ్యలో వసూళ్లు వస్తాయని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.

రిలీజ్ కు ముందే ఓవర్సీస్ బుకింగ్స్ లో దూసుకెళ్తున్న కూలీ.. రిలీజ్ తర్వాత అనేక రికార్డులు బ్రేక్ చేసే ఛాన్స్ ఉంది. అటు ఉత్తర భారతంలో కూడా గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. బాలీవుడ్ భారీ యాక్షన్ సినిమా వార్ 2 నుంచి వంటి తీవ్రమైన పోటీ ఉన్నప్పటికీ.. కూలీ ఉత్తరాదిలో తొలి వీకెండ్ లో భారీ వసూళ్లే సాధిస్తుందని అంటున్నారు.

అయితే కూలీకి తెలుగు రాష్ట్రాల్లో వార్ 2 తో గట్టి పోటీ ఎదురవ్వనుంది. ఎందుకంటే ఈ వార్ 2లో ఎన్టీఆర్ కీలక పాత్ర పోషించడమే ముఖ్య కారణం. దీంతో తారక్ మార్కెట్ దృష్యా వార్ 2 కు మరిన్ని ఎక్కువ స్క్రీన్లు లభిస్తాయి. కానీ, అందుబాటులో ఉన్న స్క్రీన్ల ప్రకారం కూలీ బుకింగ్స్ జోరుగా సాగుతున్నాయి.

ప్రస్తుతానికి, కూలీపై క్రేజీ హైప్ ఉంది. గతంలో రజనీకాంత్ కబాలి సినిమాకు ఈ రేంజ్ హైప్ క్రియేట్ అయ్యింది. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత ఆ రేంజ్ లో రజనీ సినిమాకు హైప్ రావడం ఇదే తొలిసారి. బుకింగ్స్ కూడా కబాలి తర్వాత ఈ రేంజ్ లో ఇప్పుడు కూలీకే అవుతున్నాయి. చూడాలి మరి రిలీజ్ రోజు సినిమా టాక్ ఎలా ఉంటుందో.

కాగా ఈ సినిమాకు లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో అక్కినేని నాగార్జున, సౌబిన్ షాహిర్, ఉపేంద్ర, శ్రుతి హాసన్, సత్యరాజ్, ఆమిర్ ఖాన్, రెబా మోనికా జాన్ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. సన్ పిక్చర్స్ నిర్మాతలు కాగా, అనిరుధ్ సంగీతం అందించాడు.