రజినీకాంత్.. ఇది నెవ్వర్ బిఫోర్..
ఇప్పుడు రజినీ మరోసారి బాక్సాఫీస్ వద్ద మోత మోగించేందుకు సిద్ధమయ్యారన్న విషయం తెలిసిందే.
By: M Prashanth | 13 Aug 2025 1:00 PM ISTకోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ కు ఉన్న క్రేజ్ అండ్ ఫాలోయింగే వేరు. అటు మాస్.. ఇటు క్లాస్.. రెండు ఫ్యాన్ బేస్ లు ఆయన సొంతం. తలైవా నటించిన సినిమా వస్తుందంటే చాలు.. అంతా భారీ అంచనాలు పెట్టుకుంటారు. థియేటర్స్ కు క్యూ కడతారు. రిలీజ్ అయిన అన్న థియేటర్స్ లో తమ ఈలలు, అరుపులతో దద్దరిల్లేలా చేస్తారు.
ఇప్పుడు రజినీ మరోసారి బాక్సాఫీస్ వద్ద మోత మోగించేందుకు సిద్ధమయ్యారన్న విషయం తెలిసిందే. కూలీ మూవీతో మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రజినీకాంత్ నటించిన గ్యాంగ్ స్టర్ డ్రామా.. ఆగస్టు 14వ తేదీన ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా స్థాయిలో థియేటర్స్ లో సందడి చేయనుంది.
కూలీ సినిమాలో దేవా పాత్రలో రజినీ ఒదిగిపోయినట్లు ఇప్పటికే మేకర్స్ రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ ద్వారా క్లారిటీ వచ్చేసింది. మరోసారి తన టాలెంట్ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకోనున్నారని అర్థమైపోయింది. ముఖ్యంగా బాక్సాఫీస్ ను రజినీకాంత్ శాసిస్తారని అంతా అంచనా వేస్తున్నారు. భారీ వసూళ్లు రాబట్టనున్నారని అంటున్నారు.
అయితే 74 ఏళ్లలో అలాంటి హైప్ క్రియేట్ చేసుకోవడమంటే అరుదైన విషయమనే చెప్పాలి. ఆ వయసులో కూడా పరిశ్రమను శాసించడం చాలా తక్కువ. అనేక మంది అనుభవజ్ఞులైన నటులు క్రమంగా సహాయ పాత్రలు చేస్తున్నారు. కానీ రజినీకాంత్ అందుకు విరుద్ధంగా వరుస చిత్రాలతో అందరికీ గట్టి పోటీ ఇస్తున్నారు.
నిరంతరం అభిమానులను థియేటర్లకు ఆకర్షిస్తున్నారు. తన కెరీర్ లో ఈ దశలో కూడా సరైన ప్రాజెక్టుల ను ఎంచుకుని సత్తా చాటుతున్నారు. ఏజ్ తో ఎలాంటి సంబంధం లేదని ప్రూవ్ చేశారు. ఆయన టాలెంట్, మాస్ కనెక్టివిటీ అసమానమైన సినిమా ప్రయాణానికి నిదర్శనంగా నిలుస్తాయని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు.
ఇప్పుడు కూలీ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ లోనూ జోరు చూపిస్తున్నారు. దర్శకుడు లోకేష్ కనగరాజ్ సృజనాత్మక దృష్టి, అనిరుధ్ సంగీతం, స్టార్ క్యాస్టింగ్ కూడా కూలీకి హిట్ ఫ్యాక్టర్స్ అయినా.. రజినీకాంత్ మెయిన్ ఫ్యాక్టర్ అనే చెప్పాలి. మొత్తానికి 74 ఏళ్ల వయసులో నెవ్వర్ బిఫోర్ అనేలా జోష్ చూపిస్తున్న రజినీకాంత్.. కూలీ మూవీతో ఎలాంటి విజయం అందుకుంటారో వేచి చూడాలి.