ఆ సినిమా కోసం నలిగిపోయిన నయా డైరెక్టర్!
అలాగే సినిమాలో నాగార్జున-అమీర్ ఖాన్ కాంబినేషన్ లో ఎలాంటి సన్నివేశాలుంటాయనే ఆసక్తి కూడా అభిమానుల్లో ఉంది.
By: Tupaki Desk | 7 July 2025 4:45 PM ISTసూపర్ స్టార్ రజనీ కాంత్ కథానాయకుడిగా లోకేష్ కనగరాజ్ `కూలీ` చిత్రాన్ని తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య సినిమా ఆగస్టు 14న రిలీజ్ అవుతుంది. నాగార్జున, అమీర్ ఖాన్ లాంటి స్టార్ హీరోలు కూడా ప్రాజెక్ట్ లో భాగమవ్వడంతో అంచనాలు పీక్స్ లో ఉన్నాయి. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా 1000 కోట్లకు పైగా వసూళ్లను సాధిస్తుందని భారీ అంచనాలున్నాయి. ఈ వసూళ్లతో కోలీవుడ్ తో కి తొలి 1000 కోట్ల సినిమా ఇదే అవుతుందని తమిళ పరిశ్రమ చాలా ఆశలతో ఎదురు చూస్తోంది.
మరి ఆ రేంజ్ సక్సస్ ను అందుకుం టుందా? లేదా? అన్నది పక్కన బెడితే ఈ ప్రాజెక్ట్ ను లోకేష్ ఓ యజ్ఞంలా భావించి చేసినట్లు ఆయన మాటల్లో తెలుస్తోంది. రెండేళ్ల పాటు ఈ సినిమా కోసం తానెంత కష్ట పడ్డాడు అన్నది రివీల్ చేసారు. `కూలీ ఆలోచనలు తప్ప మరో ఆలోచన లేకుండా పనిచేసా. 36-37 సంవ త్సరాల పుట్టిన రోజు వేడుకలకు దూరంగా ఉన్నా. కుటుంబం, స్నేహితులు, సరదాలు ఏవీ లేవు. నెలల తరబడి సోషల్ మీడియాకు దూరంగా ఉన్నానన్నారు.
`ఎంత మాత్రం పరజ్ఞానంతో పని చేయకూడదనే కఠిన నియమంతో ముందుకెళ్లాను. కథకు..సినిమాకు అంతగా బాండ్ అయి పని చేసానన్నారు. `విక్రమ్` తర్వాత రిలీజ్ అయిన `లియో` ఆ రేంజ్ సక్సెస్ ను అందుకోలేదు. కానీ `కూలీ` విషయంలో అలాంటి తప్పిదాలు దొర్లకుండా పని చేసినట్లు వెల్లడించారు. `లియో` షూటింగ్ ని వేగంగా పూర్తి చేసిన సంగతి తెలిసిందే. ఈక్రమంలోనే కొన్ని పొరపాట్లు జరిగినట్లు తేలింది. కానీ `కూలీ` విషయంలో లోకేష్ ఆఛాన్స్ తీసుకోలేదు. పక్కా ప్రణాళికతో ముందుకెళ్లాడు. ఈ క్రమంలో సినిమా రిలీజ్ లోనూ కొంత జాప్యం జరిగింది.
అలాగే సినిమాలో నాగార్జున-అమీర్ ఖాన్ కాంబినేషన్ లో ఎలాంటి సన్నివేశాలుంటాయనే ఆసక్తి కూడా అభిమానుల్లో ఉంది. ఇద్దరు మంచి స్నేహితుల కూడా. దీంతో ఆ సీన్స్ పై ప్రత్యేకమైన బజ్ క్రియేట్ అవుతుంది. కానీ వాళ్లిద్దరి మద్య ఎలాంటి కాంబినేషన్ సన్నివేశాలు లేవని నాగార్జున తెలిపారు. ఇద్దరు పాత్రలకు సంబంధించి చాప్టర్లు వేర్వేరుగా ఉంటాయన్నారు.