Begin typing your search above and press return to search.

కూలీ రైటర్ బయటపెట్టిన సీక్రెట్..!

సూపర్ స్టార్ రజినీకాంత్ కూలీ సినిమా గురువారం థియేటర్లలో సందడి చేస్తుంది. సౌత్ లో సూపర్ బజ్ ఏర్పరచుకున్న కూలీ సినిమా తెలుగు రెండు రాష్ట్రాల్లో కూడా ఒక హైప్ తెచ్చుకుంది.

By:  Ramesh Boddu   |   13 Aug 2025 12:06 PM IST
కూలీ రైటర్ బయటపెట్టిన సీక్రెట్..!
X

సూపర్ స్టార్ రజినీకాంత్ కూలీ సినిమా గురువారం థియేటర్లలో సందడి చేస్తుంది. సౌత్ లో సూపర్ బజ్ ఏర్పరచుకున్న కూలీ సినిమా తెలుగు రెండు రాష్ట్రాల్లో కూడా ఒక హైప్ తెచ్చుకుంది. ఐతే కూలీ సినిమా డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ ఈ సినిమాను తన సినిమాటిక్ యూనివర్స్ కలిపేలా ఈ మూవీ చేశాడా లేదా అన్నది తెలియాల్సి ఉంది. ట్రైలర్ లో 30 ఏళ్లు అండర్ కవర్ గా ఉన్నాడంటూ చెప్పాడు లోకేష్. దానర్ధం ఇది మళ్లీ లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగానే చేస్తున్నాడా అన్న డౌట్ వచ్చింది.

కూలీ రైటర్ చంద్రు అన్బళగన్..

కానీ లోకేష్ తన ఇంటర్వ్యూస్ లో ఇది ఎల్.సి.యు లో భాగం కాదని చెప్పాడు. ఐతే రిలీజ్ ముందు కూలీ కో రైటర్ చంద్రు అన్బళగన్ మాత్రం కూలీలో ఒక సర్ ప్రైజ్ ఉంటుందని అన్నాడు. అంతేకాదు అది ఎల్.సి.యులో భాగంగా కాదా అన్నది కూడా థియేటర్ నుంచి బయటకు వచ్చాక తెలుస్తుందని అన్నాడు. ఈ సస్పెన్స్ ఏంటో కానీ కూలీ సినిమాకు భారీ హైప్ తెస్తుంది.

ఖైదీ, విక్రం సినిమాలు లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ కి బలం చేకూర్చాయి. ఈ రెండు సినిమాల తర్వాత లోకేష్ రేంజ్ మారిపోయింది. ఐతే ఇప్పుడు కూలీ కూడా ఎల్.సి.యు లోనే భాగంగా వస్తుందని తెలిస్తే మాత్రం అంచనాలు డబుల్ అవుతాయి. సూపర్ స్టార్ ఫ్యాన్స్ కి ఇది స్పెషల్ ట్రీట్ ఇచ్చేలా ఉంటుందని.. సినిమాలో మిగతా స్టార్స్ కూడా అదరగొట్టేస్తారని అంటున్నాడు కూలీ రైటర్ చంద్రు.

లోకేష్ ఏం మ్యాజిక్ చేస్తాడో కానీ..

మొత్తానికి రిలీజ్ ముందు రోజు కూలీ, ఎల్.సి.యు అంటూ మరో ట్రెండింగ్ టాపిక్ వైరల్ అవుతుంది. లోకేష్ ఏం మ్యాజిక్ చేస్తాడో కానీ అతని సినిమా అటే చాలు విపరీతమైన బజ్ ఏర్పరచుకుంటుంది. మరి కూలీ అసలు కథ ఏంటి.. అది ఎల్.సి.యులోనేనా కాదా అన్నది మరికొద్ది గంటల్లో తెలుస్తుంది. సూపర్ స్టార్ రజినీకాంత్ కూలీలో కింగ్ నాగార్జున విలన్ గా చేశాడు. విలన్ గా నాగ్ ని ఒప్పించడానికి దాదాపు 7 సార్లు చెన్నై టు హైదరాబాద్ తిరిగాడట లోకేష్.

సినిమాలో రజినీ రోల్ కి ఏమాత్రం తగ్గకుండా నాగార్జున రోల్ ఉంటుందట. ఇక ఉపేంద్ర రోల్ తో పాటు అమీర్ ఖాన్ మ్యామియో కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని అంటున్నారు. అనిరుద్ ఇచ్చిన మ్యూజిక్ ఇప్పటికే సినిమాకు సూపర్ హై ఇచ్చింది. శృతి హాసన్, పూజా హెగ్దే కూడా సినిమాకు హైలెట్ అవ్వనున్నారు.