Begin typing your search above and press return to search.

రజినీ 'కూలీ'.. రిలీజ్ కు ముందే రూ.100 కోట్లు?

కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్.. ఇప్పుడు కూలీ మూవీతో మరికొన్ని గంటల్లో సందడి చేయనున్న విషయం తెలిసిందే.

By:  M Prashanth   |   13 Aug 2025 10:26 AM IST
రజినీ కూలీ.. రిలీజ్ కు ముందే రూ.100 కోట్లు?
X

కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్.. ఇప్పుడు కూలీ మూవీతో మరికొన్ని గంటల్లో సందడి చేయనున్న విషయం తెలిసిందే. పవర్ఫుల్ గ్యాంగ్ స్టర్ డ్రామాగా స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఆ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ కానుంది. ఆగస్టు 14వ తేదీ అంటే రేపే వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ప్రముఖ సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ భారీ బడ్జెట్ తో నిర్మించిన కూలీ సినిమాలో అనేక స్టార్ నటీనటులు కనిపించనున్నారు. టాలీవుడ్ కింగ్ నాగార్జున కీలక పాత్ర పోషిస్తున్నారు. అమీర్ ఖాన్, శ్రుతి హాసన్, సాబిన్ సాహిర్, ఉపేంద్ర, సత్యరాజ్, మహేంద్రన్‌ తదితర నటీనటులు ముఖ్యపాత్రల్లో ఆడియన్స్ ను కనువిందు చేయనున్నారు.

అయితే ఇప్పటికే సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. మేకర్స్ రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ వేరే లెవెల్ లో హైప్ క్రియేట్ చేసింది. పాటలు, ట్రైలర్‌ సినిమాపై ఉన్న అంచనాలను తాకేలా చేసింది. కూలీతో లోకేష్ మరో సరికొత్త ప్రపంచాన్ని ఆవిష్కరించారని అంతా ఫిక్స్ అయ్యారు. పక్కా బ్లాక్ బస్టర్ బొమ్మ అని డిసైడ్ అయ్యారు.

అంతలా కూలీ మూవీపై బజ్ ఉంది. అయితే గత కొంతకాలంగా రిలీజ్ కు ముందు ఇంత హైప్ క్రియేట్ చేసుకున్న సినిమా ఇదేనని చెప్పాలి. రజినీ కెరీర్ లో కూడా అంతే. ఎందుకంటే ఆయన నటించిన వివిధ సినిమాలు రీసెంట్ గా మెప్పించలేకపోయాయి. జైలర్ తప్ప పేట, పెద్దన్న, వేట్టయాన్ వంటి చిత్రాలకు అసలు హైప్ కనపడలేదు.

కానీ ఇప్పుడు కూలీ యమా హైప్ తో రిలీజ్ కానుంది. ఇప్పుడు విడుదలకు ముందే రూ.100 కోట్ల క్లబ్ లోకి చేరనున్నట్లు కనిపిస్తుంది. ఇప్పటికే మేకర్స్ అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ట్ చేయగా.. ఓ రేంజ్ లో జరుగుతున్నాయి. దీంతో ఇప్పటి వరకు రూ.70 కోట్లకు పైగా కూలీ మూవీ.. అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా రాబట్టినట్లు తెలుస్తోంది.

ఇంకా రిలీజ్ కు కొన్ని గంటల సమయం ఉంది కాబట్టి రూ.100 కోట్లు రాబట్టడం పక్కాలా ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. అదే జరిగితే కూలీ ఓపెనింగ్స్ రూ.150 కోట్లు సాధించే అవకాశం ఉంటుందనే చెప్పాలి. మొత్తానికి ఫస్ట్ షో పడడానికి ముందే ప్రతిష్టాత్మక క్లబ్ లోకి కూలీ వెళ్లేలా కనపడడం విశేషం. సినిమాకు పాజిటివ్ టాక్ వేస్తే దూకుడు వేరు. రూ.1000 కోట్ల మార్క్ కూడా టచ్ చేసే ఛాన్స్ ఉంది.