Begin typing your search above and press return to search.

కూలీ టికెట్స్.. అలా చేయడానికి కారణమేంటి?

కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్, ప్రముఖ దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో రూపొందిన కూలీ మూవీ మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే.

By:  M Prashanth   |   13 Aug 2025 3:41 PM IST
కూలీ టికెట్స్.. అలా చేయడానికి కారణమేంటి?
X

కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్, ప్రముఖ దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో రూపొందిన కూలీ మూవీ మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా గ్యాంగ్ స్టర్ డ్రామాగా రూపొందిన ఆ సినిమాలో అనేక మంది స్టార్ నటీనటులు సందడి చేసేందుకు అంతా సిద్ధమైంది.

టాలీవుడ్ స్టార్ అక్కినేని నాగార్జున, కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర, మలయాళ నటుడు సౌబిన్ సాహిర్, బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్, సత్యరాజ్, మహేంద్రన్, స్టార్ హీరోయిన్ శ్రుతిహాసన్ వంటి స్టార్స్ నటిస్తున్న కూలీ మూవీ ఆగస్టు 14వ తేదీన గ్రాండ్ గా వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. ఇప్పటికే అన్ని పనులు కంప్లీట్ చేశారు మేకర్స్.

రీసెంట్ గా అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఓపెన్ చేయగా.. కూలీ మూవీ తన సత్తా చాటుతోంది. ఇప్పటికే రూ.80 కోట్లకుపైగా ప్రీ బుకింగ్స్ లో వసూలు చేసినట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా కూలీ తన దూకుడు చూపిస్తోందని సమాచారం. భారీ ఎత్తున టికెట్స్ సేల్స్ అవుతున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

అదే సమయంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూలీ మూవీ టికెట్స్ ను డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ బ్లాక్ చేస్తున్నారని ఇప్పుడు సోషల్ మీడియాలో డిస్కషన్ జరుగుతోంది. దీంతో ఇప్పుడు నెటిజన్లు స్పందిస్తున్నారు. భారీగా బ్లాక్ చేస్తున్నారని అంటున్నారు. అలా ఎందుకు చేస్తున్నారని, రీజన్ ఏంటోనని మాట్లాడుకుంటున్నారు.

ముఖ్యంగా మూవీకి ఫుల్ హైప్ ఉన్నా.. బ్లాక్ చేయడానికి కారణమేంటోనని డిస్కస్ చేసుకుంటున్నారు. అయితే టికెట్స్ కు చాలా డిమాండ్ ఉంటే.. థియేటర్ యజమానులు బ్లాక్ చేస్తుంటారు. నిబద్ధతలను నెరవేర్చడానికి కొన్ని టికెట్స్ తమ వద్ద ఉంచుతారు. ఆ తర్వాత వాటిని మాన్యువల్ లేదా ఆన్ లైన్ లో సేల్ చేస్తుంటారు.

అదే సమయంలో కొన్నిసార్లు మాత్రం టికెట్స్ ను బ్లాక్ చేసి.. హై డిమాండ్ ఉన్నట్లు చూపిస్తారని ఎప్పటి నుంచో టాక్ వినిపిస్తోంది. కానీ ఇప్పుడు కూలీ మూవీని నిజంగానే డిమాండ్ ఉంది. వేరే లెవెల్ లో హైప్ కూడా ఉంది. ప్రమోషనల్ కంటెంట్ తో అంచనాలు ఆకాశాన్ని తాకాయి. కాబట్టి టికెట్స్ ను బ్లాక్ చేయడమే నిజమైతే.. అలా ఎందుకు చేశారో వారికే తెలియాలి.