భాను ప్రియ నటించడం మోహన్ బాబుకి ఇష్టం లేదా!
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కెరీర్ లో `పెదరాయుడు` ఎంత గొప్ప చిత్రమన్నది చెప్పాల్సిన పనిలేదు.
By: Tupaki Desk | 24 Jun 2025 11:44 AM ISTకలెక్షన్ కింగ్ మోహన్ బాబు కెరీర్ లో 'పెదరాయుడు' ఎంత గొప్ప చిత్రమన్నది చెప్పాల్సిన పనిలేదు. పెదరాయుడు, పాపా రాయుడు పాత్రలు సినిమాలో ఏ రేంజ్ లో పండాయో తెలిసిందే. పాపారాయుడు పాత్రలో సూపర్ స్టార్ రజనీకాంత్, పెదరాయుడు పాత్రలో మోహన్ బాబు నటన చిరస్మరణీమయైనది. ఈ రెండు రోల్స్ మరే పాత్రలతోనూ రీప్లేస్ చేయలేనివి. మిగతా పాత్రలు సినిమాలో అంతే వన్నే తీసు కొస్తాయి.
అప్పట్లో ఈ చిత్రాన్ని రవిరాజా పినిశెట్టి తెరకెక్కించారు. ఈ సినిమాతో దర్శకుడిగా ఆయన ఇమేజ్ రెట్టింపు అయింది. అయితే ఈ సినిమాలో భానుప్రియ నటించడం అన్నది మోహన్ బాబు కి ఇష్టం లేదు? అన్న సంగతి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ విషయాన్ని రవిరాజా రివీల్ చేసారు. తమిళ వెర్షన్ లో భాను ప్రియ పాత్రలు ఖుష్బూ నటించారు. శరత్ కుమార్ కి వదినగా ఆ రోల్ కనిపిస్తుంది.
ఖుష్పూ పోషించిన ఆ పాత్రకు భాను ప్రియ పర్పెక్ట్ గా సూటవుతుందని ఆమెని ఎంపిక చేసారు. అయితే ఆ ఎంపికను మోహన్ బాబు తిరస్కరించారుట. దీంతో తన అభిప్రాయాన్ని రజనీకాంత్ కు చెప్పినట్లు రవి రాజా తెలిపారు. రజనీకాంత్ కూడా భాను ప్రియ అయితేనే బాగుంటుందని సూచించారు. అయినప్పటికీ మోహన్ బాబుకు ఇష్టం లేకపోయినా అయిష్టంగానే ఒప్పుకున్నారుట. భాను ప్రియకు ఫోన్ చేసి రజనీ కాంత్ మాట్లాడి ఒప్పించారుట. అలా భాను ప్రియ పెదరాయుడులో భాగమైనట్లు రవిరాజా తెలిపారు.
ఈ సినిమా ఓ తమిళ చిత్రానికి రీమేక్. 1994లో రిలీజ్ అయిన నట్టమై అనే సినిమాకు రీమేక్ రూపం. మాతృ కను తెరకెక్కించింది కూడా రవిరాజానే. ఇందులో శరత్ కుమార్ లీడ్ రోల్ పోషించారు. ఈ సినిమా తెలుగు రీమేక్ హక్కుల విషయంలో అప్పట్లో గట్టి పోటీ ఉందిట. మోహన్ బాబుకి ఆ హక్కులు దక్కేలా రజనీకాంత్ సాయం చేసినట్లు రవిరాజా తెలిపారు.