రాజాసాబ్ మేకర్స్ కు కోర్టు కష్టాలు... ఏం జరిందంటే?
ఇక డిసెంబర్ 05న రిలీజ్ ఉంటుందని ఇప్పటికే ప్రకటన చేసినా.. ఆ రోజు కూడా విడుదలవ్వడం డౌట్ గానే ఉంది.
By: M Prashanth | 13 Aug 2025 7:47 PM ISTరెబల్ స్టార్ ప్రభాస్ రాజాసాబ్ విడుదల వాయిదా పడుతూ వస్తోంది. ఇక డిసెంబర్ 05న రిలీజ్ ఉంటుందని ఇప్పటికే ప్రకటన చేసినా.. ఆ రోజు కూడా విడుదలవ్వడం డౌట్ గానే ఉంది. ఈ నేపథ్యంలో మేకర్స్ కు కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. ఈ సినిమా మేకింగ్ సంస్థలుగా ఉన్న పీపుల్ మీడియా ఫ్యాక్టరీ- ఢిల్లీకి చెందిన ఐవీ ఎంటర్టైన్మెంట్ సంస్థలు కోర్టుకెక్కాయి. అసలు ఏం జరిగిందంటే?
ఐవీ ఎంటర్టైన్మెంట్ సంస్థ రాజాసాబ్ సినిమా నిర్మాణంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కో ప్రొడ్యూసర్ గా డీల్ కుదుర్చుకుంది. సినిమా నిర్మాణం కోసం ఐవీ ఎంటర్టైన్మెంట్ రూ.225 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. అందులో భాగంగానే రూ.218 కోట్లు వెచ్చించింది. అయితే ఆ తర్వాత పలు కారణాల వల్ల అగ్రిమెంట్ రద్దు చేసుకోవాలనుకుంటున్నట్లు ఐవీ ఎంటర్టైన్మెంట్ పేర్కొంది. పలు కారణాలు చెప్పి అప్డేట్లు ఇవ్వడం సేదని ఐవీ ఎంటర్టైన్మెంట్ ఆరోపణలు చేసింది. అందుకే ఈ అగ్రిమెంట్ నుంచి తప్పుకుంటున్నట్లు ఐవీ చెప్పింది.
అయితే సడెన్ గా ఒప్పందం రద్దు చేసుకుంటాననడంపై పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కోర్టుకు వెళ్లింది. ఇలా ఒప్పందం మధ్యలోనే రద్దు చేసుకోవడం చట్ట విరుద్ధం అని పేర్కొంది. ఐవీ ఎంటర్టైన్మెంట్ సంస్థ పెట్టినదానికంటే ఎక్కువగానే సినిమాకు ఖర్చైందని.. ప్రస్తుతం షూటింగ్ నడుస్తుందని, అనుకోని కారణాలతో సినిమా డిలే అవుతుందని.. కానీ అంతలోనే ఇలా తమ పరువుకు భంగం కలిగిస్తున్నారని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కోర్టులో పిటిషన్ వేసింది.
దీంతో ఐవీ ఎంటర్టైన్మెంట్ సంస్థ కూడా కోర్టుకు వెళ్లింది. తమకు డీల్ వద్దని, తాము పెట్టుబడిగా పెట్టిన డబ్బును 18 శాతం వడ్డీతో ఇప్పించాలని పిటిషన్ లో పేర్కొంది. ప్రస్తుతం ఈ రెండు పిటిషన్లు కోర్టులో పెండింగ్ లో ఉన్నాయి. అయితే ఐవీ పెట్టుబడి మొత్తాన్ని సినిమా రిలీజ్ కంటే ముందు కోర్టులో డిపాటిజ్ చేయడానికి సిద్ధమేనని, కానీ ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్, మార్కెటింగ్ లో ఐవీ జోక్యం ఉండకూడదని పీపుల్ మీడియా కోరింది. చూడాలి మరి కోర్టు తీర్పు ఎలా ఉండనుందో!