అసలు పని మొదలుపెట్టిన పూరి
సీనియర్ దర్శకుడు, మాస్ కమర్షియల్ మాస్టర్ అయిన పూరీ జగన్నాథ్.. ఓ కొత్త కాంబినేషన్ తో మళ్ళీ సినిమాని పట్టాలెక్కించారు.
By: Tupaki Desk | 7 July 2025 1:55 PM ISTసీనియర్ దర్శకుడు, మాస్ కమర్షియల్ మాస్టర్ అయిన పూరీ జగన్నాథ్.. ఓ కొత్త కాంబినేషన్ తో మళ్ళీ సినిమాని పట్టాలెక్కించారు. పూరీ తెరకెక్కించబోయే ఈ పాన్ ఇండియా సినిమాకు సంబంధించి ఇటీవలే అధికారికంగా ప్రారంభోత్సవం జరిగింది. ఈ సినిమా బజ్ మొదట నుంచి పాజిటివ్ లెవెల్లోనే ఉంది. ఇక ఈ ప్రాజెక్ట్ లో విజయ్ సేతుపతి హీరోగా నటిస్తుండటం, పూరీ దర్శకత్వంలో మొదటిసారి తమిళ స్టార్ నటుడు కలవబోతుండటంతో ఆసక్తిని కలిగిస్తోంది.
ఇక సినిమాకు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్‌లో గ్రాండ్‌గా ప్రారంభమైంది. ప్రారంభ షెడ్యూల్‌లో విజయ్ సేతుపతి, సంయుక్త కూడా పాల్గొంటున్నారు. ఈ షెడ్యూల్‌లో కీలక సన్నివేశాలు, యాక్షన్ ఎలిమెంట్స్‌ను చిత్రీకరించబోతున్నట్లు సమాచారం. ఈ సినిమా ద్వారా పూరీ జగన్నాథ్ మళ్లీ తన మాస్ మాస్టర్ బ్రాండ్‌ను గుర్తు చేయనున్నారని చిత్రబృందం ధీమా వ్యక్తం చేసింది.
ఈ చిత్రంలో ప్రముఖ బాలీవుడ్ నటి టబు కీలక పాత్రలో నటించనున్నారు. ఇది టబు - పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో వచ్చే తొలి సినిమా కావడంతో ఇది మరో హైలైట్‌గా నిలుస్తోంది. అలాగే హీరోయిన్‌గా సంయుక్త ఎంపిక కావడం కూడా మాస్, గ్లామర్ లెవెల్‌లో సినిమాకి పట్టు వస్తుందని మేకర్స్ ఆశిస్తున్నారు. సంయుక్త ఇటీవల వరుసగా మంచి సినిమాలతో బిజీగా మారిన సంగతి తెలిసిందే.
అలాగే ఈ సినిమాలో విలన్ పాత్రలో దునియా విజయ్ కనిపించబోతున్నారు. ఆయనకు ఇది టాలీవుడ్‌లో మరో బిగ్ రోల్‌గా నిలవబోతోందని ప్రచారం జరుగుతోంది. పూరీ సినిమాల్లో విలన్ పాత్రలు ఎంత బలంగా ఉంటాయో అందరికీ తెలిసిందే. ఆయన మార్క్ స్క్రీన్ ప్లేలో దునియా విజయ్ పాత్రకు పర్‌ఫెక్ట్ స్కోప్ ఉంటుందని తెలుస్తోంది.
ఈ చిత్రాన్ని పూరీ జగన్నాథ్, చార్మీ కౌర్ కలిసి 'పూరీ కనెక్ట్స్' బ్యానర్‌పై JB నారాయణ రావుతో కలిసి నిర్మిస్తున్నారు. సాంకేతికంగా కూడా ఈ సినిమా బలంగా ఉంటుందని, హై స్టాండర్డ్ టెక్నికల్ టీం పని చేస్తుందని సమాచారం. సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ వంటి అప్డేట్స్‌ను త్వరలో విడుదల చేయనున్నట్టు సమాచారం. మొత్తంగా చెప్పాలంటే.. విజయ్ సేతుపతి, పూరీ జగన్నాథ్ కాంబోపై ఇప్పటికే ఇండస్ట్రీలో హై బజ్ ఏర్పడింది. ఒకవైపు తమిళ మార్కెట్, మరోవైపు తెలుగు మాస్ ఆడియన్స్‌కి కిక్కిచ్చేలా ఈ సినిమా ఉండబోతోందని మేకర్స్ ధీమాగా చెబుతున్నారు. తొలి షెడ్యూల్ పూర్తయ్యే సరికి మరిన్ని అప్డేట్స్ వచ్చే అవకాశం ఉంది.