Begin typing your search above and press return to search.

బాలీవుడ్ భామ‌పై క‌న్నేసిన పూరీ?

కానీ పూరీ అంద‌రి ఆలోచ‌న‌ల‌ను త‌ల‌కిందులు చేస్తూ ఓ స్టార్ ను లైన్ లో పెట్టాడు. అత‌నే విజ‌య్ సేతుప‌తి. అస‌లు పూరీ సేతుప‌తికి ఏం చెప్పి ఒప్పించాడా అని కూడా చాలా మంది ఆలోచిస్తున్నారు.

By:  Tupaki Desk   |   29 April 2025 9:55 PM IST
బాలీవుడ్ భామ‌పై క‌న్నేసిన పూరీ?
X

ప్ర‌స్తుతం హిట్టు ఉంటేనే వెంట‌నే సినిమాలు చేయ‌లేక‌పోతున్నారు డైరెక్ట‌ర్లు. అలాంటిది స‌రైన హిట్ లేక వ‌రుస డిజాస్ట‌ర్లు ఉంటే ఆ డైరెక్ట‌ర్ గురించి ఆడియ‌న్స్ తో పాటూ హీరోలు కూడా మ‌ర్చిపోతారు. కానీ పూరీ జ‌గ‌న్నాథ్ రూట్ వేరు. లైగ‌ర్, డ‌బుల్ ఇస్మార్ట్ సినిమాల‌తో బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్ లు అందుకున్న పూరీకి అస‌లు ఎవ‌రు ఛాన్స్ ఇస్తారా అని అంద‌రూ అనుకున్నారు.

కానీ పూరీ అంద‌రి ఆలోచ‌న‌ల‌ను త‌ల‌కిందులు చేస్తూ ఓ స్టార్ ను లైన్ లో పెట్టాడు. అత‌నే విజ‌య్ సేతుప‌తి. అస‌లు పూరీ సేతుప‌తికి ఏం చెప్పి ఒప్పించాడా అని కూడా చాలా మంది ఆలోచిస్తున్నారు. వ‌రుస ఫ్లాపుల‌తో స‌త‌మ‌తమ‌వ‌తున్న పూరీ ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాల‌ని ఓ మంచి స్క్రిప్ట్ రెడీ చేసి దాన్ని సేతుప‌తికి చెప్పాడ‌ని, అది న‌చ్చి వెంట‌నే సేతుప‌తి ఓకే చెప్పాడ‌ని స‌మాచారం.

అక్క‌డితో అయిపోలేదు. విజ‌య్ కు క‌థ చెప్పి ఓకే చేయించుకుని అంద‌రికీ షాకిచ్చిన పూరీ, సినిమాలో ఓ కీల‌క పాత్ర కోసం ట‌బుని లైన్ లోకి తీసుకొచ్చాడు. విల‌న్ గా క‌న్న‌డ స్టార్ దునియా విజ‌య్ ను సెలెక్ట్ చేసుకున్నాడు. మొత్తానికి క్యాస్టింగ్ తోనే పూరీ త‌న సినిమాపై క్రేజ్ ను విప‌రీతంగా పెంచుకున్నాడని అర్థ‌మవుతుంది.

ఇదిలా ఉంటే ఈ సినిమాలో మ‌రో ఇద్ద‌రు హీరోయిన్ల‌కు స్కోప్ ఉంద‌ని, అందులో ఒక హీరోయిన్ గా రాధికా ఆప్టే ఆల్రెడీ ఫిక్స్ అయింద‌ని, మ‌రో హీరోయిన్ గా నివేదాను తీసుకోవాల‌ని ఆమెకు పూరీ క‌థ కూడా చెప్పాడ‌ని అన్నారు. ఇప్పుడ‌వ‌న్నీ రూమ‌ర్లేన‌ని తెలుస్తోంది. వాస్త‌వానికి ఈ సినిమాలో ఓ హీరోయిన్ ఉంటుంద‌ట కానీ ఆమె ఎవ‌ర‌నేది ఇంకా పూరీ ఫిక్స్ అవ‌లేద‌ని ఆయ‌న స‌న్నిహిత వ‌ర్గాలు అంటున్నారు.

ఆ హీరోయిన్ రోల్ కోసం పూరీ ఓ బాలీవుడ్ భామ‌తో డిస్క‌ష‌న్స్ చేస్తున్నాడ‌ని, త్వ‌ర‌లోనే ఆమె పేరును కూడా అనౌన్స్ చేయ‌నున్నార‌ని తెలుస్తోంది. ఈ సినిమా కోసం పూరీ త‌న పాత స్టైల్ ను ఫాలో అవ‌నున్నాడ‌ని స‌మాచారం. కేవ‌లం 60 రోజుల్లోనే షూటింగ్ ఫినిష్ చేసి ఈ ఇయ‌ర్ ఎండింగ్ లో సినిమాను రిలీజ్ చేయాల‌ని చూస్తున్నాడ‌ట పూరీ. ఈ సినిమాకు బెగ్గ‌ర్ అనే టైటిల్ ను ప‌రిశీలిస్తున్నారు.