Begin typing your search above and press return to search.

పూరీ చెప్పిన జపాన్ జొహుట్సు కథ..!

జీవిత పాఠాలను ఫ్రీగా ఇలా పాడ్ కాస్ట్ లో చెబుతూ తను ఎంటర్టైన్ అవుతూ తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్ ని ఎంటర్టైన్ చేస్తున్నాడు పూరీ జగన్నాథ్.

By:  Tupaki Desk   |   30 April 2025 2:00 AM IST
పూరీ చెప్పిన జపాన్ జొహుట్సు కథ..!
X

డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ సినిమాల్లో ఎలా అయితే తన డైలాగ్స్ తో అదరగొడతాడో అలానే తన నిజ జీవిత అనుభవాలను.. తనకు తెలిసిన విషయాలను పూరీ మ్యూజింగ్స్ అంటూ పాడ్ కాస్ట్ లో షేర్ చేస్తుంటాడు. పూరీ సినిమాలు వరుసగా ఫ్లాప్ అవుతూ వస్తున్నా పూరీ మ్యూజింగ్స్ కి మాత్రం క్రేజ్ తగ్గట్లేదు. ముఖ్యంగా పూరీ జగన్నాథ్ ని విపరీతంగా ఇష్టపడే వారు ఈ మ్యూజింగ్స్ ని తప్పకుండా ఫాలో అవుతుంటారు. అది ఇది కాదు నిజాన్ని నిర్భయంగా నికార్సుగా చెప్పగలిగే దమ్ము ఉండడం గొప్ప విషయం.

జీవిత పాఠాలను ఫ్రీగా ఇలా పాడ్ కాస్ట్ లో చెబుతూ తను ఎంటర్టైన్ అవుతూ తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్ ని ఎంటర్టైన్ చేస్తున్నాడు పూరీ జగన్నాథ్. ఆయన చెప్పే విషయాలు.. తీసుకునే ఉదహరణలు భలే అనిపిస్తాయి. ఇక ఈ క్రమంలో లేటెస్ట్ గా పూరీ జపాన్ లో జరిగే జొహుట్సు అనే కార్యక్రమం గురించి చెప్పాడు. ప్రపంచంలో వింత వింత విషయాలు చాలా జరుగుతాయి వాటి గురించి మనం తెలుసుకోవాలి అంతే.

ఇంతకీ ఏంటి ఈ జొహుట్సు అంటే.. ఇక జీవితాన్ని జీవించలేను మరణమే శరణ్యం అనుకునే వారు ఆ నిర్ణయం తీసుకోలేని వాళ్లు జొహుట్సు హెల్ప్ తీసుకుంటారు. ఉన్నపళంగా మనం మాయమై వేరే చోట వేరే ఐడెంటిటీతో నివసించడాన్నే జొహుట్సు అంటారు. ఇలా తమ లైఫ్ లో జరుగుతున్న విషయాల పట్ల అసంతృప్తిగా ఉన్న వాళ్లు వేరే దగ్గరకి వెళ్తారు. ఇలా జొహుట్సు గా కొన్ని కంపెనీలు పనిచేస్తాయి. 450 డాలర్లు పే చేస్తే చాలు రాత్రికి రాత్రే మొత్తం మార్చేస్తారు.

ఫ్యామిలీ మొత్తానికి ఈ ఫెసిలిటీ కావాలంటే 2600 డాలర్లు తీసుకుంటారట. ఐతే జపాన్ ఇది పెద్ద క్రైం అంతేకాదు ఇలా మాయమైన వాళ్లను పట్టుకునేందుకు డిటెక్టివ్ సంస్థలు పనిచేస్తాయట. జపాన్ లో ఉన్న ఈ జొహుట్సు గురించి ఒక డాక్యుమెంటరీ కూడా వచ్చింది. గతాన్ని ఈ క్షణంతో వదిలేసి కొత్త జీవితాన్ని ప్రారంభించడాన్నే జొహుట్సు అంటారు. ఈ కొత్త విషయాన్ని చెప్పి పూరీ తన ఫాలోవర్స్ ని సర్ ప్రైజ్ చేశాడు. ఇక పూరీ కొత్త సినిమా విషయానికి వస్తే మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతితో బెగ్గర్ సినిమా చేస్తున్న పూరీ ఆ సినిమా కాస్టింగ్ ని ఫైనల్ చేసే పనుల్లో బిజీగా ఉన్నాడు.