Begin typing your search above and press return to search.

నిక్ ఒడిలో కూర్చొని ప్రియాంక స‌ర‌సాలు

ప్రియాంక రెడ్ హా* లుక్ లో ర‌తి రాణిని త‌ల‌పించింది. హాల్టర్-నెక్ రెడ్ డ్రెస్‌లో స్టన్న‌ర్‌ గా క‌నిపించింది. నిక్ బూడిద రంగు సూట్‌లో ఇస్మార్ట్ బోయ్ లా క‌నిపించాడు.

By:  Tupaki Desk   |   24 Jun 2025 9:00 PM IST
నిక్ ఒడిలో కూర్చొని ప్రియాంక స‌ర‌సాలు
X

ప్రియాంక చోప్రా ఓవైపు మ‌హేష్ - రాజ‌మౌళి సినిమాతో బిజీగా ఉంది. మ‌రోవైపు నిక్ జోనాస్ తో కాన్సెర్టుల్లో డ్యాన్స్ షోల్లో పాల్గొంటోంది. ఆఫ్ట‌ర్ పార్టీల్లో భ‌ర్త‌తో క‌లిసి రొమాంటిక్ ఫోజులు ఇస్తోంది. ప్రియానిక్ జంట ఎక్క‌డ క‌నిపించినా రొమాంటిక్ మూడ్ క్రియేట్ చేస్తూ యూత్ లో డిస్క‌ష‌న్ పాయింట్ గా మారుతున్నారు.

ఇప్పుడు మ‌రోసారి అలాంటి రొమాంటిక్ ఫోజ్ తో ఇంట‌ర్నెట్ ని షేక్ చేసింది ప్రియానిక్ జంట‌. నిక్ జోనాస్-ప్రియాంక చోప్రా రొమాంటిక్ రాప్ పార్టీ మూవ్‌మెంట్ ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది. నిక్ బ్రాడ్‌వే నాటకం 'ది లాస్ట్ ఫైవ్ ఇయర్స్' రాప్ పార్టీలో ప్ర‌యివేట్ క్ష‌ణాల‌కు సంబంధించిన ఫోటో ఇది.

ప్రియాంక రెడ్ హా* లుక్ లో ర‌తి రాణిని త‌ల‌పించింది. హాల్టర్-నెక్ రెడ్ డ్రెస్‌లో స్టన్న‌ర్‌ గా క‌నిపించింది. నిక్ బూడిద రంగు సూట్‌లో ఇస్మార్ట్ బోయ్ లా క‌నిపించాడు. అత‌డి ఒడిలో కూర్చొని ప్రియాంక రొమాంటిగ్గా స‌రాగాలు ప‌లికిస్తోంది. ఆమె అత‌డి మ‌ధ్య ర్యాపో యూత్ ని ఫిదా చేస్తోంది. నిక్ ఈ ఫోటోకు 'లక్కీ మీ' అని క్యాప్షన్ ఇచ్చాడు. 'లేదు, నేను' అని ముద్దుగా రిప్ల‌య్ ఇచ్చింది పీసీ. భార్యాభ‌ర్త‌ల న‌డుమ అన్యోన్య‌త‌కు ఇది అంద‌మైన‌ నిద‌ర్శ‌నంగా నిలిచింది.

పీసీ న‌టించిన 'హెడ్స్ ఆఫ్ స్టేట్' జూన్ 2 నుంచి అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులోకి వ‌స్తోంది. ఈ సినిమా ప్ర‌మోల‌కు స్పంద‌న బావుంది. తెలుగు, త‌మిళం, హిందీ స‌హా స్థానిక భాష‌ల్లోను ఈ చిత్రం అందుబాటులోకి రానుంది. ప్ర‌స్తుతం పీసీ ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో బిజీ బిజీగా ఉంది.