మళ్లీ వైరల్ అవుతున్న వింక్ బ్యూటీ
మలయాళీ ముద్దుగుమ్మ ప్రియా ప్రకాష్ వారియర్ సోషల్ మీడియా కారణంగా పాన్ ఇండియా రేంజ్ గుర్తింపు దక్కించుకుంది.
By: Tupaki Desk | 28 April 2025 3:48 PM ISTమలయాళీ ముద్దుగుమ్మ ప్రియా ప్రకాష్ వారియర్ సోషల్ మీడియా కారణంగా పాన్ ఇండియా రేంజ్ గుర్తింపు దక్కించుకుంది. ఒక్క సినిమా హిట్ కాకుండానే ఈ అమ్మడికి జాతీయ స్థాయిలో స్టార్‌డం దక్కింది. ఒరు ఆదార్ లవ్ సినిమాలోని ముద్దుగన్ పేల్చడంతో పాటు, కన్ను గీటే సన్నివేశం కారణంగా ఈమెకు వచ్చిన పాపులారిటీతో ఎక్కువ సినిమాల్లో నటించే అవకాశం దక్కించుకుంది. హీరోయిన్‌గా పలు సినిమాల్లో నటించినా పెద్దగా సక్సెస్‌లు దక్కించుకోలేక పోతున్న ఈ అమ్మడు ఇటీవల తమిళ్ స్టార్ హీరో అజిత్ నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాలో గెస్ట్ రోల్‌లో కనిపించడంతో పాటు, ఐటెం సాంగ్‌లోనూ నటించడం ద్వారా వార్తల్లో నిలిచింది.
అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాతో బాక్సాఫీస్ వద్ద దాదాపుగా రూ.200 కోట్ల వసూళ్లు సాధించినట్లు సమాచారం అందుతోంది. ఆ స్థాయి వసూళ్లు నమోదు కావడంతో మాత్రమే కాకుండా సినిమాలో ఆమె పాత్రకు, ఆమె ఐటెం సాంగ్‌కి మంచి గుర్తింపు దక్కింది. సినిమాలో కనిపించింది కొద్ది సమయం అయినా కూడా నోటెడ్ అయింది. దాంతో ప్రియా ప్రకాష్ వారియర్‌కి ఆ సినిమా ముందు ముందు మరిన్ని ఆఫర్లు తెచ్చి పెట్టే అవకాశాలు ఉన్నాయని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. సినీ విశ్లేషకులు సైతం ప్రియా ప్రకాష్ వారియర్ కెరీర్ గాడిలో పడ్డట్లే అనే అభిప్రాయంను వ్యక్తం చేస్తున్నారు. గతంలో మాదిరిగా మరోసారి ప్రియా ప్రకాష్ వారియర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాలో ఈమె చేసిన పాటకు సంబంధించిన క్లిప్స్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. సినిమా విడుదల కాక ముందు పెద్దగా ఈ పాటను జనాలు పట్టించుకోలేదు. ఎప్పుడైతే సినిమా విడుదలైందో పాటకు మంచి స్పందన దక్కింది. యూట్యూబ్‌లో అత్యధిక వ్యూస్‌ను రాబడుతూ దూసుకు పోతుంది. ఇటీవల వచ్చిన వీడియో సాంగ్‌కి మంచి స్పందన వస్తోంది. అత్యధిక వ్యూస్‌ను దక్కించుకోవడం మాత్రమే కాకుండా చాలా మంది ఈ పాటను షార్ట్ వీడియో షేర్ చేయడం లేదంటే రీల్స్‌గా షేర్ చేయడం చేస్తున్నారు. తద్వార ప్రియా ప్రకాష్ వారియర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చాలా కాలం తర్వాత ఈ అమ్మడు నెట్టింట ఈ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది.
హీరోయిన్‌గా నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిరాశ పరచడంతో ఈ అమ్మడికి ఆఫర్లు దక్కడం లేదు. చిన్నా చితక సినిమాల్లో మెయిన్ రోల్స్ దక్కినా అవి ప్రయోజనం కలిగించడం లేదు. ఇక పెద్ద సినిమాల్లో ఇలా చిన్న పాత్రల్లో కనిపించినా కూడా మంచి ఫలితం ఉంటుందని నిరూపితం అయ్యింది. ఆ మధ్య ధనుష్ దర్శకత్వంలో వచ్చిన సినిమాలోనూ చిన్న పాత్రలో కనిపించి మంచి గుర్తింపు దక్కించుకుంది. మెల్ల మెల్లగా ప్రియా ప్రకాష్ వారియర్ కెరీర్ ను గాడిలో పెట్టుకునేందుకు గాను చిన్నా చితకా సినిమాల్లో నటిస్తూ కెరీర్‌లో ముందుకు సాగుతుంది. ముందు ముందు ఈ అమ్మడు హీరోయిన్‌గా స్టార్ హీరోల సినిమాల్లో నటించిన ఆశ్చర్యం లేదు.