Begin typing your search above and press return to search.

2026 లో రెండు రిలీజ్ లు సాధ్యమయ్యే పనేనా..?

సినిమాలను ఓకే చేసినంత స్పీడ్ గా వాటిని పూర్తి చేయలేకపోతున్నాడు రెబల్ స్టార్ ప్రభాస్. ఇప్పటికే ప్రభాస్ కి లైన్ లో అరడజను సినిమాలు ఉన్నాయి.

By:  Tupaki Desk   |   29 April 2025 5:00 PM IST
Prabhas Lineups
X

సినిమాలను ఓకే చేసినంత స్పీడ్ గా వాటిని పూర్తి చేయలేకపోతున్నాడు రెబల్ స్టార్ ప్రభాస్. ఇప్పటికే ప్రభాస్ కి లైన్ లో అరడజను సినిమాలు ఉన్నాయి. వాటిని ఎప్పుడు పూర్తి చేస్తాడు ఎప్పుడు రిలీజ్ చేస్తాడన్నది చెప్పడం కష్టం అనిపిస్తుంది. ప్రస్తుతం రాజా సాబ్ ని పూర్తి చేసే పనిలో ఉన్న ప్రభాస్ ఆ సినిమా తో పాటు హను తో చేస్తున్న ఫౌజీ సినిమాను కూడా స్పీడ్ గా లాగిస్తున్నాడు. ఐతే రాజా సాబ్ ఈ ఇయర్ దసరాకి రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. దసరా మిస్ అయితే క్రిస్ మస్ కి అయినా తెస్తారని టాక్.

ఇక హను రాఘవపూడి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఫౌజీ సినిమా కూడా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఐతే ఈ సినిమాను నెక్స్ట్ ఇయర్ సమ్మర్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఇదే కాదు త్వరలో సందీప్ వంగాతో మొదలు పెట్టే స్పిరిట్ సినిమా కూడా 1 ఇయర్ లో పూర్తి చేయాలని ప్రభాస్ చూస్తున్నాడు. సో రాజా సాబ్ ఈ ఇయర్ రిలీజైతే ఫౌజీ, స్పిరిట్ రెండు సినిమాలు నెక్స్ట్ అంటే 2026 లో రిలీజ్ చేసేలా ప్రభాస్ పనిచేస్తున్నాడు.

ఐతే నెక్స్ట్ ఇయర్ ఆ రెండు సినిమాలు వస్తే ఇంకా సలార్ 2, కల్కి 2 సినిమాలు ఉన్నాయి. వీటితో పాటు ప్రశాంత్ వర్మతో ప్రభాస్ చేసే సినిమా కూడా ప్రీ ప్రొడక్షన్ వర్క్ నెక్స్ట్ ఇయర్ మొదలవుతుందని తెలుస్తుంది. కల్కి 2 ముందు చేసి ఆ తర్వాత సలార్ 2 తో పాటు ప్రశాంత్ వర్మ సినిమా చేస్తాడని తెలుస్తుంది. ప్రభాస్ సినిమా షూటింగ్ విషయంలో ఎక్కువ టైం తీసుకుంటున్నాడన్న టాక్ ఉంది.

ఐతే అది ప్రభాస్ తీసుకోవడం కాదు సినిమా బడ్జెట్ ని బట్టి కావాల్సిన వి.ఎఫ్.ఎక్స్ ఇంకా మిగతా టైం కు అవుతున్న టైం అని ఫ్యాన్స్ చెబుతున్నారు. ఏది ఏమైనా రెబల్ స్టార్ ఫ్యాన్స్ కి ఈ సినిమాలన్నీ కూడా సూపర్ ట్రీట్ అందిస్తాయని మాత్రం చెప్పొచ్చు. నెక్స్ట్ ఇయర్ ప్రభాస్ రెండు సినిమాలు రిలీజ్ చేస్తే బాక్సాఫీస్ దగ్గర రెబల్ స్టార్ సందడి షురూ అయినట్టే లెక్క అని చెప్పొచ్చు.